గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎస్ బీ ఎం - యూ 2.0 కింద చెత్త రహిత నగరాలు
Posted On:
27 JUL 2023 4:07PM by PIB Hyderabad
సురక్షిత పారిశుధ్యాన్ని సాధించడం మరియు దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను (MSW) శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం కోసం భారత ప్రభుత్వం అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్ బీ ఎం - యూ)ని ప్రారంభించింది.
సాధించిన పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి, 100% మూలాధార విభజన ద్వారా ఇంటింటికీ అన్ని నగరాలకు చెత్త రహిత స్థితిని సాధించాలని పల్లపు ప్రదేశాల్లో చెత్తను సురక్షితంగా పారవేయడంతోపాటు వ్యర్థాల యొక్క అన్ని రకాల చెత్తను శాస్త్రీయ సేకరణ నిర్వహణ లక్ష్యంతో ఐదేళ్ల కాలానికి 1 అక్టోబర్ 2021న స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్ బీ ఎం - యూ) 2.0 ప్రారంభించబడింది. ఇది అన్ని పాత డంప్‌సైట్‌లను కూడా పరిష్కరించి వాటిని గ్రీన్ జోన్‌లుగా మార్చడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్ బీ ఎం - యూ 2.0 ని దాని వివిధ భాగాలను అమలు చేయడానికి అయ్యే అంచనా వ్యయం ₹1,41,600 కోట్లు. కేంద్ర వాటా ₹36,465 కోట్లు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తులు లబ్ధిదారుల సహకారం, రాష్ట్రాలు మరియు యూ టీ లు/ యూ ఎల్ బీ లు/ప్రైవేట్ రంగం పీ పీ పీ కింద అందించాలి.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పారిశుధ్యం రాష్ట్ర అంశం. కాబట్టి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, డిజైన్ చేయడం, అమలు చేయడం మరియు నిర్వహించడం రాష్ట్ర/యూ ఎల్ బీ ల బాధ్యత. అయినప్పటికీ, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా దీన్ని సులభతరం చేస్తోంది. మధ్యప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు మరియు యూ ఎల్ బీ లలో ఎస్ బీ ఎం ఏకరీతిగా అమలు చేయబడుతోంది. మొత్తం మిషన్ వ్యవధిలో సీ ఎస్ నిధులు రాష్ట్రాలు/ యూ టీ లకు కేటాయించబడతాయి. నగరాల వారీగా లేదా జిల్లాల వారీగా వివరాలు జాతీయ స్థాయిలో నిర్వహించబడవు.
గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1943579)
Visitor Counter : 121