రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కార్వార్ తీరంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిశోధన నౌకలో 8 మంది శాస్త్రవేత్తలు సహా 36 మంది సిబ్బందిని రక్షించిన భారత తీర రక్షణ దళం

प्रविष्टि तिथि: 27 JUL 2023 7:25PM by PIB Hyderabad

ఈ నెల 27న, అరేబియా సముద్రంలో, కర్ణాటకలోని కార్వార్ తీరంలో 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ'కి (ఎన్‌ఐవో) చెందిన ఆర్‌వీ సింధు సాధన అనే పరిశోధన నౌక ఇంజిన్‌ విఫలమైంది. ఆ సమయంలో ఆ నౌక భూమి నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. నౌకలోని సిబ్బంది సాయం కోసం అభ్యర్థన సంకేతాలు పంపారు. ఆ సంకేతాలు అందుకున్న భారత తీర రక్షణ దళం, నౌక చికుక్కున్న 8 మంది శాస్త్రవేత్తలు సహా 36 మంది సిబ్బందిని రక్షించింది.

ఐఎన్‌వో ఒక అత్యాధునిక పరిశోధన నౌక. చాలా విలువైన పరికరాలు, సమాచారం అందులో ఉన్నాయి. కాబట్టి పరిస్థితి క్లిష్టంగా మారింది. అంతేకాదు, పర్యావరణపరంగా కార్వార్ తీరప్రాంతం సున్నితంగా ఉంటుంది. పరిశోధన నౌక మునిగిపోతే పర్యావరణ సంబంధ ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. చమురు భారీగా బయటకు రావడం, సహజ సముద్ర పరిస్థితులను నాశనం చేసే ప్రమాదానికి అవకాశం ఉంది.

సంకేతాలు అందుకున్న వెంటనే, భారతీయ తీర రక్షణ దళం తక్షణం స్పందించింది. నైపుణ్యం గల బృందంతో కూడిన అత్యంత అధునాతన నౌకను ఆ ప్రాంతానికి పంపింది. పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి, నౌక గాలికి కొట్టుకుపోకుండా ఆపే చర్యలు చేపట్టింది.

వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నా, ఓడ పరిమాణం భారీగా ఉన్నప్పటికీ, భారతీయ తీర రక్షణ దళం ఆ పరిశోధన నౌకను గోవా తీరానికి సురక్షితంగా చేర్చింది. ఎన్‌ఐవో నౌకలోని సిబ్బంది, శాస్త్రవేత్తలు సురక్షితంగా ఉన్నారు.


(रिलीज़ आईडी: 1943574) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी