సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాహిత్య అకాడమీ చేపట్టే వివిధ సాహిత్య కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ భాషలు, మాండలికాలను ప్రోత్సహించనున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ
Posted On:
27 JUL 2023 4:55PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సాహిత్య అకాడమీ ద్వారా , ఈశాన్య రాష్ట్రాలలోని మిజో, ఆఓ,గరో, చక్మా, రభ,కర్బి, హమర్, లెప్చ, ఖాసి, తంగ్ఖుల్, మిస్సింగ్, తెనిడియ, కొక్బొరొక్, జైంతియా తదితర గిరిజన భాషలను
ప్రోత్సహించేందుకు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సాఇత్‌య అకాడమీ ప్రాంతీయ మాండలికాలు, భాషలలో ప్రాచీన సాహిత్యం , మధ్యయుగ సాహిత్యం, గుర్తింపు పొందని భాషల సాహిత్యంలో
విశేష కృషి చేసిన వారిని భాషా సమ్మాన్ ద్వారా ప్రోత్సహిస్తోంది.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో సాహిత్య ప్రేమికులను చేరేందుకు గ్రామలోక్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రపంచ మూలవాసుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న అఖిల భారత గిరిజన రచయితల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈశాన్య ప్రాంత మౌఖిక సాహిత్య కేంద్ర(ఎన్ఇసిఒఎల్) అగర్తలలో ఏర్పాటైంది. దీని ద్వారా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంతోపాటు, ఇందుకు సంబంధించిన ప్రచురణలను తీసుకురావడం జరుగుతుంది.
ప్రాంతీయ భాషల నుంచి పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువాదం చేయడం వల్ల ఇవి, ఇతర భాషలలోకి అనువదింపబడి, ఇతర భాషల ప్రజలలోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎవరికీ తెలియని ఇలాంటి భాషలు ఇతర కమ్యూనిటీలకు తెలియడానికి వీలు కలుగుతుంది.
2014లో మౌఖిక, గిరిజన సాహిత్య కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ మౌఖిక, గిరిజన సాహిత్యాన్ని అందుబాటులోకి తేవడానికి, ఈ సంప్రదాయాన్ని పరిరక్షించడానికి దీనిని నెలకొల్పారు.
లోక: ఎన్నో గొంతుకలు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో , గిరిజన, జానపద కళలు,సంస్కృతిని పరిరక్షించడానికి ప్రసంగాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. వార్షిక అక్షర ఉత్సవం నిర్వహిస్తారు.
గిరిజన సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు అఖిల భారత గిరిజన రచయితల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా రచయితల రచనలు , అనువాదాలను ప్రచురించి వాటిని ప్రదర్శనకు పెట్టడంతోపాటు దేశవ్యాప్తంగా అమ్మకానికి ఉంచుతున్నారు.
దీనికితోడు విద్యా మంత్రిత్వశాఖ, జాతీయ విద్యా విధానం 2020 కింద అన్ని భారతీయ భాషలను, ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నది. ఈ విధానం కింద వీలున్న చోట కనీసం 5 వ తరగతి వరకు ఇంకా వీలైతే 8 వతరగతి వరకు ప్రాంతీయ భాషలలో బోధించాలని
సూచిస్తున్నది. ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభకు తెలిపారు.
***
(Release ID: 1943569)
Visitor Counter : 102