పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం
Posted On:
27 JUL 2023 3:39PM by PIB Hyderabad
- 7 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదం
- 11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు ప్రారంభించబడ్డాయి
దేశంలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ (జిఎఫ్‌ఏ) పాలసీ, 2008ని రూపొందించింది. పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సహా ఏ డెవలపర్ అయినా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే వారు తగిన స్థలాన్ని గుర్తించి, విమానాశ్రయ నిర్మాణానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి 'సైట్ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించాలి.అనంతరం 'సూత్రప్రాయ' ఆమోదం లభిస్తుంది.
దేశవ్యాప్తంగా గోవాలోని మోపా, నవీ ముంబై, మహారాష్ట్రలోని షిర్డీ మరియు సింధుదుర్గ్, కర్ణాటకలోని కలబురగి, విజయపుర, హాసన్ మరియు శివమొగ్గ, మధ్యప్రదేశ్‌లోని దబ్రా (గ్వాలియర్) ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ మరియు నోయిడా (జేవార్), గుజరాత్‌లోని ధోలేరా మరియు హిరాసర్, పుదుచ్చేరిలోని కారైకల్, ఆంధ్రప్రదేశ్‌లోని దగదర్తి, భోగాపురం మరియు ఓర్వకల్ (కర్నూలు), పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్యోంగ్, కేరళలోని కన్నూరు మరియు మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగి (ఇటానగర్)లో 21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 'సూత్రప్రాయ' ఆమోదం తెలిపింది. వీటిలో 11 అనగా దుర్గాపూర్, షిర్డీ, కన్నూర్, పాక్యోంగ్, కలబురగి, ఓర్వకల్ (కర్నూల్), సింధుదుర్గ్, ఖుషీనగర్, ఇటానగర్, మోపా మరియు శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించబడింది.
అంతేకాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీని ఉత్తేజపరిచేందుకు మరియు విమాన ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 21-10-2016న ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సిఎస్)-ఉడాన్ (ఉడెదేశ్‌కాఆమ్‌నాగ్‌రిక్)ని కూడా ప్రారంభించింది. ఉడాన్ యొక్క అవార్డ్ రూట్‌లలో చేర్చబడిన మరియు ఆర్‌సిఎస్ కార్యకలాపాల ప్రారంభించడానికి అప్‌గ్రేడేషన్ / డెవలప్‌మెంట్ అవసరమయ్యే విమానాశ్రయం "అన్‌సర్వ్ మరియు తక్కువ సేవలందించే విమానాశ్రయాలు/హెలిపోర్ట్‌లు/వాటర్ ఏరోడ్రోమ్‌ల పునరుద్ధరణ/అప్‌గ్రేడేషన్" పథకం కింద అభివృద్ధి చేయబడింది. ఈ పథకం కింద బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశమంతటా అన్‌సర్వ్ & తక్కువ సేవలందించే విమానాశ్రయాలు/ఎయిర్‌స్ట్రిప్‌లు పునరుద్ధరణ/అభివృద్ధి మరియు ఉడాన్ విమానాలను నడపడానికి గుర్తించబడ్డాయి/ప్రదానం చేయబడతాయి. 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 74 విమానాశ్రయాలు (హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు & గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలతో సహా) దేశవ్యాప్తంగా ఉడాన్ (ఉడెదేశ్‌కాఆమ్‌నాగ్‌రిక్) కింద పని చేస్తున్నాయి.
ఆర్‌సిఎస్ కింద అమలు చేయబడిన/పునరుద్ధరించిన విమానాశ్రయాల రాష్ట్రాల వారీ జాబితా అనుబంధంలో ఉంది.
పైన పేర్కొన్న 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబై, పుదుచ్చేరిలోని కారైకల్, ఉత్తరప్రదేశ్‌లోని జేవార్ (నోయిడా) గుజరాత్‌లోని ధోలేరా మరియు హిరాసర్ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో 7 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం 'సూత్రప్రాయ' ఆమోదం తెలిపింది. ఈ 7 విమానాశ్రయాలలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తన స్వంత వనరుల నుండి వరుసగా రూ.1405 కోట్లు మరియు రూ.1305 కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయంతో హిరాసర్ మరియు ధోలేరా అనే రెండు విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. మిగిలిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్ చేయడం సంబంధిత ఎయిర్‌పోర్ట్ డెవలపర్‌ల బాధ్యత. ఇంకా విమానాశ్రయ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి భూసేకరణ, తప్పనిసరి అనుమతుల లభ్యత, ఆర్థిక మూసివేత మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఏ) గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలతో సహా దేశంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ చర్యలు చేపట్టింది. ఎఫ్‌డిఐ పాలసీ కింద గ్రీన్‌ఫీల్డ్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టులలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతించబడ్డాయి. కేరళలోని కన్నూర్ (రూ. 2342 కోట్లు), పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ (రూ. 670 కోట్లు) గోవాలోని మోపా (రూ. 3400 కోట్లు), నవీ ముంబై (రూ. 19646 కోట్లు), మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (రూ. 520 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం (రూ. 2500 కోట్లు), ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (జేవార్) (రూ. 10056 కోట్లు) ప్రైవేట్ పెట్టుబడితో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధిని చేపట్టిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది.
విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్‌గ్రేడ్ చేయడం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరియు సంబంధిత విమానాశ్రయ నిర్వాహకులు ఎప్పటికప్పుడు వాణిజ్య సాధ్యత, ట్రాఫిక్ డిమాండ్, భూమి లభ్యత మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. 2014 నుండి తిరుపతి, విజయవాడ, ఖుషీనగర్ మరియు మోపా అనే 4 విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య 30కి చేరింది.
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి కోసం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ, 2008ని రూపొందించింది. విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న దరఖాస్తుదారు 'సైట్ క్లియరెన్స్' మరియు 'సూత్రప్రాయంగా' ఆమోదం కోసం స్టీరింగ్ కమిటీకి నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తును సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు షెడ్యూల్ ప్రకారం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలి.
ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు.
అనుబంధాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి:
(Release ID: 1943542)
Visitor Counter : 155