పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు 2023 ను ఆమోదించిన లోక్ సభ
Posted On:
26 JUL 2023 6:20PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణ , అటవీ, పర్యావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ఈరోజు
అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు 2023 ను, పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదించచిన విధంగా లోక్సభ ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా ఆయన సభను కోరారు. దీనిపై సభలో సంప్రదింపుల అనంతరం పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నమీదట లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది.
అటవీ సంరక్షణ చట్టం 1980, కీలకమైన కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇది దేశంలోని అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం. దీని ప్రకారం రిజర్వుడు అటవీ ప్రాంతాలను రిజర్వుడు నుంచి తొలగించడం కానీ,
అటవీ భూములను అటవీయేతర పనులకు ఉపయోగించడానికి కానీ , అటవీ భూములను లీజు లేదా ఇతర విధంగా ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి కానీ,,సహజసిద్దంగా పెరిగిన చెట్లను తొలగించి తిరిగి ఆ ప్రాంతంలో మొక్కలు నాటడానికి కానీ ముందస్తుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
ఈ చట్టం వర్తింపు వివిధ రకాల అడవులకు ఒక్కో విధంగా ఉండేది. తొలుత ఈ చట్టం నిబంధనలు నోటిఫైడ్ అటవీ భూములకు మాత్రమే వర్తించేవి. ఆ తర్వాత 12.12.1996 నాటి కోర్టు తీర్పు తర్వాత దీనిని రెవిన్యూ అటవీ భూములు, లేదా ప్రభుత్వ రికార్డులలో అటవీ భూములుగా నమోదు చేసినవి, అలాగే చూడడానికి అడవులుగా ఉన్న వాటికి వర్తింప చేస్తూ వచ్చారు
ఇలాంటి చాలా భూములు అటవీ యేతర అవసరాలకు,నివాసం,సంస్థల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి వాటికి సంబంధిత అథారిటీ అనుమతితో వినియోగిస్తూ వచ్చారు.
ఈ పరిస్థితులలో ఈ చట్టంలోని నిబంధనలకు వివిధ రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రత్యేకించి రికార్డెడ్ అటవీ భూములు, ప్రైవేటు అటవీ భూములు, ప్లాంటేషన్లు వంటి వాటి విషయంలో భిన్న వ్యాఖ్యానాలు వచ్చాయి.
ప్రైవేటు వ్యక్తుల భూములు, సంస్థల భూములలో మొక్కలు నాటితే, అవి ఎఫ్.సి.ఎ కిందికి వస్తాయేమో నన్న భయాందోళనలతో చాలా మంది ప్రైవేటు భూములలో మొక్కలు నాటడానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనితో అటవీ ప్రాంతం వెలుపల మొక్కల విస్తరణ లక్ష్యానికి విఘాతం కలుగుతూ వస్తోంంది. అదనంగా 2.5 బిలియన్ టన్నుల నుంచి 3 బిలియన్ టన్నులవరకు కార్బన్ డయాక్సైడ్ పీల్చే మొక్కలు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
దీనికి తోడు, భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రాజెక్టులు, జాతీయ ప్రాధాన్యతగల ప్రాజెక్టులను సత్వరం చేపట్టవలసి ఉంటుంది .ఉదాహరణకు వాస్తవాధీన రేఖ, అధీన రేఖల వద్ద, ఎల్.డబ్ల్యు.ఇప్రాంతాలలో ప్రాజెక్టులకు సత్వర అనుమతులు అవసరం. ఇలాగే, చిన్న సంస్థలు, రోడ్లు, రైల్వేల పక్కన గ ఆవాసాలకు ప్రజాప్రయోజనార్థం రోడ్డు,రైలు మార్గాలతో అనుసంధానత కల్పించాల్సి ఉంది.అటవీ సంరక్షణ చట్టం వచ్చిన తర్వాత పర్యావరన, సామాజిక సవాళ్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వచ్చాయి.
ఉదాహరణకు వాతావరణ మార్పులను తట్టుకోవడానికి, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాల స్థాయికి చేరడానికి, అటవీ కార్బన్ నిల్వలను పెంచడానికి, అడవులను పరిరక్షించే గొప్ప సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడానికి ఇలాంటి అంశాలను అటవీ సంరక్షణ చట్టం పరిధిలోకి తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ కట్టుబాట్లకు అనుగుణంగా, కార్బన్ సమతుల్యత, చట్టం అమలు విషయంలో అస్పష్టతలను తొలగించడం, అటవీ యేతర ప్రాంతాలలో కూడా మొక్కల పెంపకానికి వీలు కల్పించడం,
అటవీ ఉత్పాదకత పెంపు వంటి వాటికి అనుగుణంగా అటవీ సంరక్షణ చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2023ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
లోక్సభ ఆమోదించిన సవరణలలో , చట్టం పరిధిని మరింత విస్తృత పరిచేందుకు చట్టం పేరును వన (సంరక్షణ ఏవం సంవర్ధన్) అధినియం,1980 గా మార్చడంతోపాటు ప్రవేశికను చేర్చారు. చట్టంలో అస్పష్టతలు లేకుండా చూసేందుకు వివిధ భూములకు చట్టం అనువర్తింపు, చట్టం పేరు వంటి వాటివిషయంలో స్పష్టత నిచ్చారు. దీనికి తోడు, ప్రస్తుత సవరణలు,మినహాయింపులను లోక్సభ ఆమోదించిది. ఇందదులో జాతీయ భద్రతతో ముడిపడి న వ్యూహాత్మక ప్రాజెక్టులు, అంతర్జాతీయయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల పరిధిలో గల భూములు అంటే వాస్తవాధీన రేఖ, అధీన రేఖ వెంబడి 0.10 హెక్టార్ల భూమి వావాసలు, రోడ్డువెంట, రైల్వే మార్గాల వెంట ఉన్న ప్రాంతాలకు అనుసంధానత కల్పించడానికి, భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి 10 హెక్టార్ల వరకు, ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల విషయంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలలో 5 హెక్టార్ల వరకు మినహాయింపు పొందినవాటిలో ఉన్నాయి. ఆయా మినహాయింపులన్నీ సంబంధిత షరతులు,నిబంధనలకు లోబడి ఉంటాయి. అలాగే ప్రత్యామ్యాయ అటవీ పెంపకం, కేంద్రప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఇందులో ఉన్నాయి. అటవీ సంరక్షణ మూల చట్టం ప్రకారం అటవీ భూములను ప్రైవేటు భూములను లీజుకు ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వకంపెనీలకు కూడా వర్తింప చేసే విషయంలో ఏకరూపత తెచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ బిల్లు కొత్త కార్యకలాపాలను కూడా చేర్చింది. అవి, క్షేత్రస్థాయి అటవీ సిబ్బందికి మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత పర్యాటకం, జంతు ప్రదర్శన శాలలు, సఫారి వంటి వాటిని అటవీ కార్యకలాపాలలో చేర్చారు. అడవుల సంరక్షణ కార్యకలాపాలలో వీటిని చేర్చారు. అటవీ ప్రాంతంలో నిర్వహించే సర్వేలు, పరిశోధనలను అటవీ యేతర కార్యకలాపాలుగా పరిగణించబోరు. ఇలాంటి కార్యకలాపాలు తాత్కాలికమైనవైనందున భూ వినియోగంలో ఎలాంటి మార్పు ఉండదు . ఈ బిల్లులోని సెక్షన్ 6 ప్రకారం,కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంఅమలుకు తగిన మార్డదర్శకాఉవిడుదల చేస్తుందని కూడా పేర్కొన్నారు. దీనికి కూడా లోక్ సభ ఆమోదం తెలిపింది.చట్టం అమలులో అస్పష్టతలు తొలగించేందుకు అటవీభూములను అటవీయేతర కార్యకలాపాలకు వినియోగించడానికి సంబంధించిన ప్రతిపాదనలకు సంబందించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను పేర్కోంటోంది.
ఇలాంటి మినహాయింపులు 12.12.96 కుముందు కాంపిటెంట్ అథారిటీ అటవీ యేతర అవసరాల కోసం ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేసి ఉంటే అలాంటి వాటిని ఉపయోగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అభివృద్ది పథకాలకు దీనిని వినియోగించుకోవచ్చు. అటవీ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని అంశాలను బిల్లులో చేర్చిన వాటిలో క్షేత్ర స్థాయి అటవీ సిబ్బందికి మౌలిక సదుపాయాల కల్పన ఒకటి. అటవీప్రాంతంలో ఏర్పడే ఆకస్మిక ఇబ్బందులకు తక్షణం స్పందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలకు చట్టం లో వీలు లేకుంటే అటవీ అగ్నిప్రమాదా ల నివారణ,అడవులను కనిపెట్టి ఉండడం, పర్యవేక్షణ, మొక్కల తిరిగి పెంపకం వంటి వాటికి ఇబ్బంది కలుగుతుంది. ఈ నిబంధనలు అన్నీ అడవులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి, వాటి ఉత్పాదకత పెంచడానికి, పర్యావరణ ఉత్పత్తులు, సేవలు పెంచి తద్వారా వాతావరణ మార్పులను అరికట్టడంతో పాటు అడవుల సంరక్షణకు దోహదపడతాయి.జంతు ప్రదర్శన శాలలు, సఫారీల ఏర్పాటు వంటి కార్యకలాపాలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వీటిని కేంద్ర జూ అథారిటీ అనుమతితో రక్షిత ప్రాంతం వెలుపల ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
అలాగే పర్యావరణహిత పర్యాటకాన్ని అనుమతి పొందిన వర్కింగ్ ప్లాన్ ప్రకారం లేదా వన్యప్రాణి నిర్వహణ ప్రణాళిక లేదా పులుల సంరక్షన ప్రణాళిక కింద అటవీ ప్రాంతాలలో చేపడతారు. ఇలాంటి సదుపాయాలు ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల సంరక్షన ఆవశ్యకతతెలిపే విధంఆ చూస్తారు. ఇది స్థానిక కమ్యూనిటీలకు జీవనోపాథి కల్పించేలా కూడా చూస్తారు. తద్వారా వారు ప్రధాన స్రవంతి అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూస్తారు.
అటవీ సంరక్షణ బిల్లు లో ప్రతిపాదించిన సవరణలను లోక్ సభ ఆమోదించడం ద్వారా ఇది చట్టం స్ఫూర్తిని మరింత పటిష్టం చేస్తుంది. అలాగే అటవీ సంరక్షణను మరింత మెరుగు పరుస్తుంది. అటవీ ఉత్పత్తుల ను మరింత పెంచడానికి ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుంది. అలాగే అటవీ ప్రాంతాల వెలుపల మొక్కల పెంపకానికి, రెగ్యులేటరీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి, స్థానిక కమ్యూనిటీల జీవనోపాథి ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
****
(Release ID: 1943482)
Visitor Counter : 746