ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్‌కు నిధులు కేటాయింపు


వివిధ పథకాల కింద ప్రాజెక్ట్‌ల అమలుకు మణిపూర్‌కు రూ.363.14 కోట్ల విడుదల

प्रविष्टि तिथि: 27 JUL 2023 2:59PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం.డి.ఒ.ఎన్.ఇ.ఆర్) పథకాల నిధుల కేటాయింపులను మణిపూర్తో సహా  ఇతర ఈశాన్య రాష్ట్రంలోని కొండలు, లోయ ప్రాంతాలుగా విభజించి అందించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎం.డి.ఒ.ఎన్.ఇ.ఆర్ మరియు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ) యొక్క వివిధ పథకాల కింద ప్రాజెక్ట్‌ల అమలు కోసం మొత్తం రూ.363.14 కోట్లు మణిపూర్‌కు విడుదల చేయబడ్డాయి, వీటిలో రూ.114.99 కోట్లు 2020-21లో విడుదలయ్యాయి; 2021-22లో రూ.145.24 కోట్లు; 2022-23లో రూ.65.18 కోట్లు; మరియు 2023-24లో (జూన్, 2023 వరకు) రూ.37.73 కోట్లు విడుదలయ్యాయి. 30 జూన్, 2023 నాటికి, నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద రూ.4.55 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి; నాన్-లాప్సబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్-స్టేట్ పథకం కింద రూ.54.59 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి; హిల్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.9.46 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది కాకుండా, ఎన్ఈసీ పథకాల కింద రూ.8.36 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి మరియు ఈశాన్య రోడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎన్ఈఆర్ఎస్డీఎస్) కింద రూ.26.15 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు 2023 మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు/అమలుచేసే ఏజన్సీలతో (ఐఏలు) రెగ్యులర్ సమావేశం ద్వారా ఖర్చుల వేగం మరియు నిధుల వినియోగంతో సహా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తారు; సెంట్రల్ నోడల్ ఏజెన్సీ సిస్టమ్ మరియు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై ఐఏల బోర్డింగ్‌లో, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలకు నిధుల నిజ సమయ బదిలీ కోసం పర్యవేక్షణ ఉంటోందని  కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

*****


(रिलीज़ आईडी: 1943480) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Manipuri , Tamil