పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
విజయం సాధించిన స్వమిత్వ (SVAMITVA) పథకం
Posted On:
26 JUL 2023 1:55PM by PIB Hyderabad
గ్రామ ప్రాంతాలలో అవసరార్ధం మెరుగుపరచి టెక్నాలజీతో రూపొందించిన నక్షాల సహాయంతో గ్రామాల సర్వే చేసే స్వమిత్వ పథకం విజయం సాధించింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు సర్వే ఆఫ్ ఇండియా (SoI) సంయుక్త సహకారంతో ఈ పథకం అమలుచేస్తున్నారు. గ్రామ ప్రాంతాలలో నివసిస్తూ సొంత ఇళ్ళు ఉన్నవారికి
చట్టబద్ధమైన యాజమాన్య హక్కుల (ఆస్తి కార్డులు/టైటిల్ డీడ్‌లు) జారీ చేయడం ద్వారా ఆయా గ్రామాలలోని గృహ యజమానులకు హక్కులు కల్పించడం ఈ పథకం ఉద్దేశం.
సర్వే ఆఫ్ ఇండియా ద్వారా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ పథకం కింద భూ సముదాయాల నక్షాలు తయారు చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకోసం రాష్ట్రాలు SoIతో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 31 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (UTలు) SoIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
స్వమిత్వ పథకం కింద రాష్ట్రాల వారీగా నక్షాలు రూపొందించిన గ్రామాల ప్రగతికి సంబంధించిన సంవత్సరం వారీ వివరాలు అనుబంధం Iగా జతచేయడం జరిగింది.
సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రాలలోని అన్ని గ్రామీణ నివాస (అబాది) ప్రాంతాలను కలుపుకుని దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాల సర్వే పూర్తి చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే పథకం అమలు జరుగుతున్న సమయంలో ఈ క్రింది కారణాల వల్ల వాస్తవంగా సర్వే చేయాల్సిన గ్రామాల సంఖ్యను సవరించారు:
బీహార్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మేఘాలయ వంటి భాగస్వామ్య రాష్ట్రాలలో SoIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోని గ్రామాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
స్థానిక ప్రభుత్వ డైరెక్టరీలో రాష్ట్రాలు/యుటిలు అందించిన మొత్తం గ్రామాల సంఖ్య కంటే వాస్తవంగా నివాసులు ఉన్న గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గమనించారు.
సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు కేవలం పైలట్ గ్రామాలలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
హక్కులకు సంబంధించిన ముందస్తు రికార్డులు లేని గ్రామాలలో మాత్రమే ఒడిశా, అసోం రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
***
(Release ID: 1943472)