వ్యవసాయ మంత్రిత్వ శాఖ
1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
పీఎం కిసాన్ పథకం 14 వ విడత చెల్లింపులు విడుదల చేయనున్న ప్రధానమంత్రి
సల్ఫర్ కోటెడ్ యూరియా (యూరియా గోల్డ్) ఉత్పత్తులను విడుదల చేయనున్న ప్రధాని
రేపు రాజస్థాన్‌లోని సికార్ నుంచి ఓఎన్డిసి లో 1,600 ఎఫ్‌పిఓ ఆన్-బోర్డింగ్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.
Posted On:
26 JUL 2023 6:18PM by PIB Hyderabad
పీఎం-కిసాన్ పథకం 14 వ విడత వాయిదాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్‌లోని సికార్‌లో విడుదల చేస్తారు. దీనితో ఏర్పాటైన పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా,స్థానికపార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు దేశం వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 2 కోట్ల మంది రైతులు కార్యక్రమానికి హాజరవుతారు. సమావేశంలో 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 75 ఐసిఏఆర్ సంస్థలు, 75 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, 50,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు , దేశవ్యాప్తంగా 4 లక్షల కామన్ సర్వీస్ కేంద్రాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు.
ముఖ్య కార్యక్రమాలు
1. 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారుస్తోంది. పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతుల అనేక రకాల అవసరాలు తీరుస్తాయి. వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్ధాలు (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), భూసార పరీక్షలు,, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు అందిస్తాయి. వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, బ్లాక్/జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్‌ల సామర్థ్యాన్నిపెంపొందించడానికి పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా చర్యలు అమలు జరుగుతాయి.
2. పీఎం-కిసాన్ 14 వ విడత వాయిదాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేస్తారు.లబ్దిదారులకు నేరుగా ప్రయోజనం అందించడానికి అమలు జరుగుతున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది ప్రపంచంలో అతిపెద్ద పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం-కిసాన్ ప్రధానమైన పథకం. వ్యవసాయరంగం సంపూర్ణ, సమగ్ర అభివృద్ధి సాధించాలి అన్ని లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.కేంద్ర ప్రాయోజిత పథకంగా 24 ఫిబ్రవరి 2019 న పథకం ప్రారంభమైంది. అధిక ఆదాయ స్థితి నిర్దిష్ట మినహాయింపు ప్రమాణాలకు లోబడి భూమిని కలిగి ఉన్న రైతులందరి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పథకం అమలు జరుగుతోంది. పథకం కింద మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6000/- ఆర్థిక ప్రయోజనం అందిస్తారు. , ప్రతి నాలుగు నెలలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అవుతుంది. ఇంతవరకు పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు రూ.2.42 లక్షల కోట్లకు పైగా ప్రయోజనం పొందారు. దీనిలో 1.86 లక్షల కోట్ల రూపాయలు కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. . 14వ విడతలో 8.5 కోట్ల మంది రైతులకు దాదాపు 17,000 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి . 27.07.2023న ఒక బటన్ నొక్కి విడుదల చేస్తారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులకు మొత్తం రూ. 2.59 లక్షల కోట్లకు పైగా బదిలీ జరిగి ఉంటుందని ఉంటుందని. ప్రభుత్వం అందిస్తున్నఆర్థిక సహాయం రైతులకు వారి రోజువారీ అవసరాలు తీర్చడంలో తోడ్పడుతుంది. దీనివల్ల రైతులు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు.
3. సల్ఫర్ కోటెడ్ యూరియా (యూరియా గోల్డ్) ప్రారంభం: యూరియా గోల్డ్ అని పిలువబడే సల్ఫర్ కోటెడ్ యూరియాను ఉపయోగించడం వల్ల మట్టిలో సల్ఫర్ లోపాలు పరిష్కారం అవుతాయి. . ఈ వినూత్న ఎరువులు వేప పూత తో కూడిన యూరియా కంటే మరింత పొదుపుగా, సమర్ధవంతంగా పనిచేస్తాయి. మెరుగైన నత్రజని వినియోగ సామర్థ్యం, తగ్గిన వినియోగం , పంట నాణ్యత ఎక్కువగా ఉంటుంది.
4. ఓఎన్డిసి లో 1,600 ఎఫ్‌పిఓ ల ప్రారంభం : రాబోయే 5 సంవత్సరాల్లో 10,000 కొత్త ఎఫ్‌పిఓ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 6,865 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంతవరకు 6,319 ఎఫ్‌పిఓలు రిజిస్టర్ అయ్యాయి. చేయబడ్డాయి (రూ.188.3 కోట్ల మూలధనం 11.96 లక్షల మంది రైతులు). ఓఎన్డిసి (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)లో 1,600 రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పిఓలు) సభ్యత్వం కలిగి ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ చెల్లింపు, బి 2బి, బి2సి లావాదేవీల నిర్వహణకు ఎఫ్‌పిఓలకు అవకాశం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరిచి విలువ ఆధారిత స్థానిక విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది.
5 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, 7 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్, చిత్తోర్‌గఢ్, సిరోహి, శ్రీ గంగానగర్ , సికార్‌లలో కొత్తగా నెలకొల్పిన 5 మెడికల్ కాలేజీలను ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో మరో 7 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. .
6. ఆరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక కేంద్రీయ విద్యాలయాల ప్రారంభోత్సవం: రాజస్థాన్‌లోని 6 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు , రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని తిన్వారీలో ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. .
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రసాయనాలు,ఎరువుల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ , రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేయనున్న వివిధ కార్యక్రమాలను ప్రారంభించి రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి తెలియజేయనున్నారు. వ్యవసాయ దిగుబడి పెరగడానికి , రైతు ఆదాయాన్ని పెంపొందించడానికి, దేశానికి ఆహార భద్రతను కల్పించడానికి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది.
***
(Release ID: 1943093)
Visitor Counter : 280