బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు రవాణాలో వేగం పెంచడం కోసం 13 రైల్వే లైన్లు నిర్మాణంలో ఉన్నాయి

प्रविष्टि तिथि: 26 JUL 2023 3:45PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం, బొగ్గు రంగంలో అనేక విధాన సంస్కరణలు తీసుకొచ్చింది.

దేశంలో బొగ్గు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖతో బొగ్గు మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటోంది. రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో 13 రైల్వే లైన్లు నిర్మిస్తున్నారు, ప్రస్తుతం అవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

బొగ్గు రవాణాలో 1బీటీ యాంత్రిక నిర్వహణ సామర్థ్యాన్ని సాధించడానికి, 885 ఎంటీ సామర్థ్యంతో మొత్తం 67 మొదటి మైలు అనుసంధాన (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టులను 3 దశల్లో చేపట్టడం జరిగింది. పీఎం గతి శక్తి లక్ష్యానికి అనుగుణంగా, బహుళ స్థాయి అనుసంధానాన్ని అభివృద్ధి చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ రూ.26,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులను చేపట్టింది.

రైల్వే, విద్యుత్‌, బొగ్గు శాఖలు, రాష్ట్రాలతో కలిపి ఒక ఉప సంఘాన్ని సృష్టించడం జరిగింది. బొగ్గు లభ్యతను బట్టి బోగీల సరఫరాను ఈ ఉప సంఘం నిర్ధరిస్తుంది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

****


(रिलीज़ आईडी: 1943090) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil