యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

103 మంది అథ్లెట్లు మరియు 2 హాకీ టీమ్‌లు (పురుషులు & మహిళలు) ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కింద ఎంపిక చేయబడ్డాయి.


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గత ఐదేళ్లలో రూ.612.51 కోట్లతో 29 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టింది.

Posted On: 25 JUL 2023 5:25PM by PIB Hyderabad

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ద్వారా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఒలింపిక్ / పారాలింపిక్ గేమ్స్, ఆసియా మరియు కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలను నిర్ధారించడానికి మరియు ఈ ఈవెంట్‌లలో మన క్రీడాకారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్‌లో భారతదేశం యొక్క ప్రదర్శనను మెరుగుపరచడానికి, మంత్రిత్వ శాఖ 2014 నుండి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్)ని కూడా అమలు చేస్తోంది.   టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కింద, విదేశీ శిక్షణతో సహా ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్‌ల కోసం గుర్తించబడే సంభావ్య క్రీడాకారులకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల సహాయాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ పోటీ, పరికరాలు, ఫిజికల్ ట్రైనర్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, మెంటల్ ట్రైనర్ మరియు ఫిజియోథెరపిస్ట్ వంటి సహాయక సిబ్బంది/పర్సనల్ సేవలన్నీ కోర్ గ్రూప్ అథ్లెట్లకు నెలకు రూ.50,000/- మరియు డెవలప్‌మెంట్ గ్రూప్‌కు నెలకు రూ.25,000/- పాకెట్ అలవెన్స్ గా అందించబడతాయి.    ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కింద 103 వ్యక్తిగత అథ్లెట్లు మరియు 2 హాకీ జట్లు (పురుషులు & మహిళలు) కోర్ గ్రూప్‌గా ఎంపిక చేయబడ్డాయి. అలాగే, డెవలప్‌మెంట్ గ్రూప్ ఆఫ్ టాప్స్ కింద భారతదేశ ఒలింపిక్ సన్నాహాల్లో దృష్టి కేంద్రీకరించే విధానాన్ని నిర్ధారించడానికి 166 మంది అత్యుత్తమ క్రీడా ప్రతిభను గుర్తించడం పూర్తయింది.

యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ కూడా క్రీడల అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా యువతలో ప్రయోజనాలు/సౌకర్యాలను అందిస్తోంది. అవి...
(i) ఖేలో ఇండియా పథకం;
(ii) జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం;
(iii) అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లలో విజేతలకు మరియు వారి కోచ్‌లకు ప్రత్యేక అవార్డులు;
 (iv) జాతీయ క్రీడా అవార్డులు;
 (v) మెరిటోరియస్ క్రీడాకారులకు పెన్షన్;
(vi) పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ క్రీడా సంక్షేమ నిధి;
 (vii) జాతీయ క్రీడా అభివృద్ధి నిధి (NSDF);
 (viii) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లను నడపడం.

పైన పేర్కొన్న పథకాల వివరాలు మంత్రిత్వ శాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లలో పబ్లిక్ డొమైన్‌లో వరుసగా www.yas.nic.in/sports మరియు www.sportsauthorityofindia.nic.inలో అందుబాటులో ఉన్నాయి.

‘క్రీడలు’ అనేది రాష్ట్ర సబ్జెక్ట్ కాబట్టి..  క్రీడా మౌలిక సదుపాయాల కల్పన మరియు పెంపుదల బాధ్యత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలదే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని క్రీడా సౌకర్యాల విషయానికొస్తే, సాయ్ గత ఐదేళ్లలో రూ.612.51 కోట్లతో 29 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది.

ఖేలో ఇండియా పథకం కింద, మల్టీపర్పస్ హాల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఫుట్‌బాల్ టర్ఫ్, హాకీ టర్ఫ్, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రాథమిక క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం అందించబడింది. రాజస్థాన్ రాష్ట్రంలో 48 సహా దేశవ్యాప్తంగా మొత్తం 297 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.  ఇది అన్ని వర్గాల పౌరులకు సేవలు అందిస్తుంది.

ఇంకా, సాయ్ భారతదేశంలోని సాయ్ కేంద్రాలలో మాత్రమే క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతుంది. సాయ్ కేంద్రాల్లో కొత్త స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఇప్పట్లో ఎలాంటి ప్రతిపాదన లేదు.

ఈ రోజు లోక్‌సభలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.

***


(Release ID: 1943025) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Tamil , Kannada