హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అగ్నిమాప‌క సేవ‌ల విస్త‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ‌కు ప‌థ‌కం

Posted On: 25 JUL 2023 4:53PM by PIB Hyderabad

 జాతీయ విప‌త్తు ప్ర‌తిస్పంద‌న నిధి (ఎన్‌డిఆర్ఎఫ్‌) కింద సంసిద్ధ‌త‌, సామ‌ర్ధ్య నిర్మాణ నిధుల గ‌వాక్షం కోసం కేటాయించిన మొత్తం నుంచి 2025-26 వ‌ర‌కు  రాష్ట్రాల అగ్నిమాప‌క సేవ‌ల విస్త‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ, బ‌లోపేతం చేయ‌డం కోసం 04.07.2023న రూ 5000 కోట్ల వ్య‌యంతో ప‌థ‌కాన్ని ప్రారంభించింది. 
ఈ ప‌థ‌కం కింద వ్య‌య భాగ‌స్వామ్యం ఆధారంగా నిధులు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో అగ్నిమాప‌క సేవ‌ల విస్త‌ర‌ణ‌, అగ్నిమాప‌క సేవ‌ల ఆధునీక‌ర‌ణ కింద గుర్తించిన కార్య‌క‌లాపాలను విస్త్ర‌తంగా వ‌ర్గీక‌రించ‌డం జ‌రిగింది.  కొత్త అగ్నిమాప‌క కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర శిక్ష‌నా కేంద్రాలు, సామ‌ర్ధ్య నిర్మాణాన్ని బ‌లోపేతం చేయ‌డం, ఆధునిక అగ్నిమాప‌క ప‌రిక‌రాల కోసం నిబంధ‌న‌లు, రాష్ట్ర కేంద్ర‌కార్యాల‌యాలు, ప‌ట్ట‌ణ అగ్నిమాప‌క కేంద్రాలను బ‌లోపేతం చేయ‌డం, ఆన్‌లైన్ వ్య‌వ‌స్థను సాంకేతికంగా ఆధునీక‌రించి, స్థాప‌నం, పెంచ‌డం త‌దిత‌రాలు ఈ ప‌థ‌కం చేప‌ట్ట‌నున్న కొన్ని చ‌ర్య‌లు . ఇందుకు అద‌నంగా, చ‌ట్ట‌ప‌ర‌మైన, మౌలిక‌స‌దుపాయాల ఆధారిత సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టే రాష్ట్రాల‌కు మొత్తం వ్య‌యంలో రూ. 500 కోట్లు  ప్రోత్సాహ‌కాలుగా అందుబాటులో ఉంటాయి. 
అగ్నిమాప‌క సేవ‌లు అనేవి రాష్ట్ర అంశ‌మే కాదు, ఆర్టిక‌ల్ 243 (డ‌బ్ల్యు) ప్ర‌కారం భార‌త రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో మున్సిప‌ల్ వ్య‌వ‌హారంగా చేర్చ‌డం జ‌రిగింది. రాష్ట్రాల‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదాలు/ ఘ‌ట‌న‌ల గురించి కేంద్ర‌స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి డేటాను నిర్వ‌హించదు.
త‌మ అధికార ప‌రిధిలోని ప్రాంతంలో అగ్నిప్ర‌మాదాల నుంచి ప్రాణ‌, ఆస్తి ర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్రాథ‌మిక బాధ్య‌త‌. కేంద్ర ప్ర‌భుత్వం  రాష్ట్రంలో అగ్ని, అత్య‌వ‌స‌ర సేవ‌ల నిర్వ‌హ‌ణ‌ను అందించేందుకు మోడ‌ల్ బిల్లును 16.09. 2023న అన్ని రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు పంపింది. 
ఈ విష‌యాన్ని హోం వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్‌స‌భ‌లో లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో వెల్ల‌డించారు. 


 

****


(Release ID: 1942647) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Bengali , Tamil