గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహిళల భాగస్వామ్యం
Posted On:
25 JUL 2023 2:29PM by PIB Hyderabad
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎ), 2005 కింద నమోదు చేసుకున్న, పని కోసం కనీసం అభ్యర్ధించే లబ్ధిదారులలో కనీసం మూడింట ఒకవంతు మంది మహిళలు ఉండేవిధంగా వారికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎస్) అన్నది పురుషులతో సమానంగా వేతనాలు అందించడం, మహిళలకు వేతనాల రేట్ల ప్రత్యేక షెడ్యూల్‌ను అందించడం, పిల్లల కోసం క్రెష్ సౌకర్యాలు, వర్క్ సైడ్ షెడ్లు, శిశు సంరక్షణ సేవలను అందించడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే జెండర్ తటస్థ పధకం.
జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కలయికతో దానికి అనుగుణంగా మహిళా సహచరులను ప్రవేశపెట్టి, మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేసేలా చేశారు. ఈ పథకం లబ్ధిదారుల నివాసానికి సమీపంలో పనులను అందించడానికి కృషి చేస్తుంది.
ఆర్థిక సంవత్సరం 2018-19 నుంచి 2022-23 వరకు గత ఐదు సంవత్సరాలలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజిఎస్ కింద మహిళల భాగస్వామ్య రేట్లు (మొత్తం శాతంలో మహిళా పని దినాలు) దిగువన ఇవ్వడం జరిగింది.
****
(Release ID: 1942644)