గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దీనదయాళ్ అంత్యోదయ యోజన కింద సంగతన్ సే సమృద్ధి కార్యక్రమం – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్

నాడు పోస్టు చేయడమైనది: 25 JUL 2023 2:27PM by PIB Hyderabad

గ్రామీణ పేద మహిళలను స్వయం సహాయక బృందాలుగా (ఎస్‌హెచ్‌జి) నిర్వహించడం మరియు వారికి నిరంతర ఉపాధి  మరియు మద్దతు ఇవ్వడం అనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా (ఢిల్లీ & చండీగఢ్ మినహా) దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఏవై –ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) అమలు చేస్తోంది. వారు నిర్దిష్ట కాల వ్యవధిలో ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలను సాధించే వరకు వారి జీవన నాణ్యతను మెరుగుపరిచే వరకు మరియు కడు పేదరికం నుండి బయటపడే వరకు ఈ మద్దతు కొనసాగుతుంది.డిఏవై –ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద మిగిలిపోయిన అర్హులైన, బలహీనమైన మరియు అట్టడుగున ఉన్న గ్రామీణ కుటుంబాలను (హెచ్‌హెచ్‌) స్వయం సహాయక బృందాలుగా (ఎస్‌హెచ్‌జిలుమ) తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 18 నుండి జూన్ 30, 2023 వరకు “సంగతన్ సే సమృద్ధి అభియాన్” (ఎస్ఎస్‌ఎస్‌ఏ) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎస్ఎస్‌ఎస్‌ఏ యొక్క ప్రధాన లక్ష్యాలు -

 

1

వ్యవస్థీకృత ఎస్‌ఎస్‌ఎస్‌ఏలున్న గ్రామ పంచాయితీల (జిపిలుసంఖ్య లక్షల్లో )

1.1

2

ఎస్‌హెచ్‌జిలలోకి సమీకరించాల్సిన హెచ్‌హెచ్‌ల సంఖ్య లక్షల్లో )

20

3

ఏర్పాటు చేయబోయే కొత్త ఎస్‌హెచ్‌జిల సంఖ్య లక్షల్లో )

1.1

4

తెరవబోయే కొత్త ఎస్‌హెచ్‌జి బ్యాంక్ ఖాతాల సంఖ్య లక్షల్లో )

60,000

5

ఎస్‌హెచ్‌జిలోకి సమీకరించబడుతున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (పిఎంఏవై-జి) గృహాల లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో )

10

 

సామాజిక-ఆర్థిక మరియు కుల గణన (ఎస్‌ఈసిసి-2011) డేటాబేస్ ప్రకారం పేదరికంలో ఉన్న కుటుంబాలు, పేదల భాగస్వామ్య గుర్తింపు (పిఐపి) ప్రక్రియ ద్వారా గుర్తించబడిన మరియు సంబంధిత గ్రామ సభ ద్వారా సక్రమంగా తనిఖీ చేయబడిన కుటుంబాలు మిషన్ కింద కవరేజీకి అర్హత కలిగిన కుటుంబాలుగా గుర్తించబడ్డాయి.

మిషన్ కింద, ప్రతి ఎస్‌హెచ్‌జికి ₹20,000-30,000 రివాల్వింగ్ ఫండ్ (ఆర్‌ఎఫ్‌) మరియు ప్రతి ఎస్‌హెచ్‌జికి రూ. 2.5 లక్షల వరకు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సిఐఎఫ్‌) అందించే నిబంధన ఉంది.

ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

 
****
 

(రిలీజ్ ఐడి: 1942450) సందర్శకుల సూచీ సంఖ్య : : 167
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil