శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బయోటెక్నాలజీ , వ్యవసాయ రంగంలో యువ పరిశోధకులు, స్టార్టప్‌ల ద్వైపాక్షిక మార్పిడికి భారతదేశం, అర్జెంటీనా దేశాల మధ్య ఒప్పందం.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
శాస్త్ర, సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విద్య, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పాటైన బృందాలతో సమగ్ర చర్చలు జరుపనున్న రెండు దేశాలు
భారత శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రితో చర్చలు జరిపిన అర్జెంటీనాలోని శాంటా ఫే ప్రావిన్స్ గవర్నర్, ఒమర్ ఏంజెల్ పెరోట్టి
Posted On:
24 JUL 2023 6:43PM by PIB Hyderabad
శాస్త్ర సాంకేతిక రంగంలో ముఖ్యంగా బయోటెక్నాలజీ, వ్యవసాయ రంగంలో యువ పరిశోధకులు, స్టార్టప్‌ల ద్వైపాక్షిక మార్పిడికి భారతదేశం, అర్జెంటీనా దేశాల మధ్య అంగీకారం కుదిరిందని
కేంద్ర శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ తెలిపారు. అర్జెంటీనాలోని శాంటా ఫే ప్రావిన్స్ గవర్నర్ ఒమర్ ఏంజెల్ పెరోట్టి ఈరోజు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్ర, సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విద్య, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పాటైన బృందాలతో సమగ్ర చర్చలు నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించామని నిర్ణయించామని తెలిపారు.
2023 ఫిబ్రవరి 7న అర్జెంటీనా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల శాఖ మంత్రి డేనియల్ ఫిల్ముస్‌తో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇంధన పరివర్తన, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిలో భాగంగా
మొత్తం 82 ఉమ్మడి ప్రతిపాదనలు అందాయని మంత్రి తెలిపారు. ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు.
మొత్తం ప్రతిపాదనల్లో 8 ప్రతిపాదనలు శాంటా ఫే ప్రావిన్స్ నుంచి అందాయి. లాటిన్ అమెరికా దేశం మధ్య జరుగుతున్న భారతదేశం వాణిజ్య కార్యకలాపాల్లో శాంటా ఫే ప్రావిన్స్ దాదాపు 80% వాటా కలిగి ఉందని పెరోట్టి చెప్పారు. శాంటా ఫే బయోటెక్నాలజీ, వ్యవసాయ పరిశోధనలలో ప్రత్యేకించి సోయాబీన్‌లో పరిశోధన, అభివృద్ధి సంస్థలకు శాంటా ఫే ప్రావిన్స్ కేంద్రంగా ఉందని ఆయన వివరించారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో పరిపాలనా యంత్రాంగం సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యాధి నిరోధక విత్తనోత్పత్తిలో శాంటా ఫే ప్రావిన్స్ అగ్రగామిగా ఉందన్నారు.
జియోస్పేషియల్ టెక్నాలజీ, క్వాంటం కంప్యూటేషన్, బయో-ఎంజైమ్‌లలో కలిసి పనిచేయడానికి భారతీయ ప్రతినిధి బృందం ఆసక్తి కనబరిచింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భారతదేశంలో పనిచేస్తున్నదని అర్జెంటీనా ప్రతినిధి బృందానికి తెలిపిన భారత ప్రతినిధి బృందం సంస్థాగత, విశ్వవిద్యాలయాలు,బహుపాక్షిక రంగాల్లో వివిధ స్థాయిలలో ఉమ్మడి అధ్యయనాలు సాగించి సహకారానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో కలిసి పనిచేయడానికి భారతదేశం , అర్జెంటీనా దేశాల మధ్య 1985లో ఒప్పందం కుదిరింది. శాస్త్రీయ రంగంలో పనిచేస్తున్న సంస్థ మధ్య సంబంధాలు బలోపేతం చేసి పరిశోధన కార్యక్రమాలు ఎక్కువ చేయాలని ఒప్పందంలో నిర్ణయించారు. పరిశోధన బృందాల పరస్పర మార్పిడికి రెండు దేశాలు అంగీకరించాయి. ఉమ్మడి శాస్త్ర , సాంకేతిక ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం రెండు దేశాలు ప్రాజెక్టులను గుర్తించి ఎంపిక చేస్తాయి.
శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్. గోఖలే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్. ఎన్. కలైసెల్వి భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు, అర్జెంటీనా ప్రతినిధి బృందం లో శాంటా ఫే ప్రావిన్స్ కి చెందిన రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల అధ్యక్షులు, భారతదేశంలో అర్జెంటీనా రాయబారి హ్యూగో గోబీ సభ్యులుగా ఉన్నారు.
అర్జెంటీనా తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారతదేశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022 సంవత్సరంలో USD 6.4 బిలియన్ల చారిత్రక శిఖరాన్ని తాకింది, 2021 తో పోల్చి చూస్తే వాణిజ్యం 12% వృద్ధి రేటు నమోదు చేసింది. భారతదేశం నుండి అర్జెంటీనాకు USD 1.84 బిలియన్ విలువ చేసే ఎగుమతులు (31% వృద్ధి రేటు) జరిగాయి. అర్జెంటీనా నుంచి భారతదేశం USD 4.55 విలువ చేసే వస్తువులు దిగుమతి చేసుకుంది. డీజీ ఎఫ్టీ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం-అర్జెంటీనా ద్వైపాక్షిక వాణిజ్యం USD 4.16 బిలియన్ల వరకు వుంది. , అర్జెంటీనాకు భారతదేశం నుంచి USD 961 మిలియన్లు విలువ చేసే ఎగుమతులు జరిగాయి. భారతదేశానికి అర్జెంటీనా USD 3.20 బిలియన్లు.విలువ చేసే వస్తువులు ఎగుమతి చేసింది.
అర్జెంటీనాకు భారతదేశం ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో ఎక్కువగా పెట్రోలియం నూనెలు, వ్యవసాయ రసాయనాలు, నూలుతో తయారు చేసిన వస్త్రాలు, సేంద్రీయ రసాయనాలు, బల్క్ డ్రగ్స్, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అర్జెంటీనా నుండి భారతదేశం దిగుమతి చేసుకునే ప్రధాన వస్తువులలో కూరగాయల నూనెలు (సోయా బీన్, పొద్దుతిరుగుడు), పూర్తయిన తోలు, తృణధాన్యాలు, అవశేష రసాయనాలు,అనుబంధ ఉత్పత్తులు, పప్పులు ఉన్నాయి.
అనేక భారతీయ కంపెనీలు అర్జెంటీనాలో మొత్తం USD 1 బిలియన్ పెట్టుబడితో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారతదేశంలో అర్జెంటీనా పెట్టుబడి దాదాపు 120 మిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి. భారతదేశంలో అర్జెంటీనా దేశానికి ప్రముఖ సంస్థలు గ్లోబాంట్, OLX IT సేవల్లో మరియు TECHINT తయారీ రంగంలో ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త అసెంబ్లీ లైన్‌ను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ 9 సెప్టెంబర్ 2020న బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లోని SIMPA గ్రూప్ ప్రొడక్షన్ ప్రారంభించారు. 119 సంవత్సరాల రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో వారి బైక్‌లను వారి స్వంత ప్లాంట్‌ల వెలుపల తయారు చేయడం ఇదే మొదటిసారి.
2023 ఫిబ్రవరి లో ఓవిఎల్ లిమిటెడ్ , YPF (అర్జెంటీనా ఆయిల్ అండ్ ఎనర్జీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ) మధ్య చమురు మరియు ఇంధన రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒప్పందాలు జరిగాయి. హెలికాప్టర్ విడిభాగాలు, ఇంజిన్ నిర్వహణ కోసం రక్షణ రంగంలో మొట్టమొదటి వాణిజ్య ఒప్పందం 2023 ఫిబ్రవరి లో హెచ్ఏఎల్, అర్జెంటీనా వైమానిక దళం మధ్య కుదిరింది. 2023 జూన్లో లో హెచ్ఏఎల్, FadeA (ఏరోనాటిక్స్‌లో అర్జెంటీనా ప్రభుత్వ రంగ సంస్థ) మధ్య సహకార ఒప్పందం కుదిరింది.
ద్వైపాక్షిక వ్యాపార చాంబర్ ఇండియా -అర్జెంటీనా బిజినెస్ కౌన్సిల్ (IABC), అధికారికంగా 14 అక్టోబర్ 2020న ప్రారంభమైంది. . అర్జెంటీనాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారులు, ఎగుమతిదారులు,దిగుమతి దారులతో కూడిన లాభాపేక్షలేని సంస్థ గా పనిచేసే కౌన్సిల్ ప్రస్తుతం 30కి పైగా కంపెనీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. తన భారతదేశ శాఖతో కలిసి ఇండియా -అర్జెంటీనా బిజినెస్ కౌన్సిల్ 25 మార్చి 2021న మొదటి బిజినెస్ ఫోరమ్‌ను నిర్వహించింది.
అర్జెంటీనాలో దాదాపు 2,600 మంది ప్రవాస భారతీయులు /పిఐలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రాజధాని నగరం బ్యూనస్ ఎయిర్స్‌లో నివసిస్తున్నారు.భారతీయ కంపెనీలు, బహుళజాతి సంస్థల్లో భారతీయులు నిపుణులగా పనిచేస్తున్నారు.
***
(Release ID: 1942400)
Visitor Counter : 163