కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యే ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ

प्रविष्टि तिथि: 24 JUL 2023 4:09PM by PIB Hyderabad

ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వ నియామక నిబంధనలను అనుసరించి భర్తీ చేస్తారు. అయితే  ఆయా అవసరాల రీత్యా పాలనా పరంగా ఏర్పడే పని పరిస్థితులలో,విధిలేని పరిస్థితులలో
కొన్నిసార్లు కాంట్రాక్ట్ ద్వారా ఔట్సోర్సింగ్
సేవలు పొందడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది.   ఇలాంటి నాన్ కన్సల్టింగ్ ఔట్ సోర్సు సేవలను  పొందడానికి సవివరమైన ప్రక్రియను రూపొందించడం జరిగింది. ఇందులో ఈ ప్రొక్యూర్మెంట్, జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలు ,2017 (జిఎఫ్ఆర్ 2917),
కన్సల్టెన్సీ, ఇతర సేవలు 2017 కు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ ఉన్నాయి.
ప్రభుత్వానికి సేవలు అందించే ఔట్ సోర్సు ఉద్యోగుల విషయంలో కాంట్రాక్టుకు సంబంధించిన నిబంధనలు, చట్టబద్ధంగా అమలు చేయవలసిన వాటిని అమలు చేయవలసి ఉంటుంది.
ఉదాహరణకు వారికి వర్తించే కాంట్రాక్టు లేబర్ (రెగ్యులేషన్, రద్దు) చట్టం 1970, కనీస వేతన చట్టం 1948, వేతనాల చెల్లింపు చట్టం 1936,
బోనస్ చెల్లింపు చట్టం 1965, గ్రాట్యుటి చెల్లింపు చట్టం 1972, భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల ( ఉపాధి నియంత్రణ, సేవల నిబంధనల) చట్టం 1996, సమాన వేతన చట్టం 1976 , అంతర్ రాష్ట్ర వలస  కార్మికుల (ఉపాధి యనియంత్రణ, సేవల నిబంధనల) చట్టం 1979, బాలలు, కౌమార కార్మికుల (పి అండ్ ఆర్) చట్టం1986, ప్రసూతి ప్రయోజనాల చట్టం ,1961 తదితరాలు ఇందులో ఉన్నాయి.

కాంట్రాక్టు  ద్వారా నియమితులైన ఉద్యోగుల ప్రయోజనాలను ఈ చట్టాల కింద పరిరక్షించడం జరుగుతుంది. ఈ చట్టాలను ప్రభుత్వం కేంద్ర రంగానికి సంబంధించి ఛీఫ్  లేబర్ కమిషనర్ (సెంట్రల్ ) సిఎల్సి (సి)
అమలు చేస్తారు. సిఎల్సి(సి0 ఇందుకు సంబంధించిన తనిఖీలు  నిర్వహిస్తారు. ఆ రకంగా కాంట్రాక్టు కార్మికుల ఉపాధిని వారు నియంత్రిస్తారు.ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక ,  ఉపాధి శాఖ సహాయమంత్రి శ్రీ రామేశ్వర్ తెలి లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

****


(रिलीज़ आईडी: 1942304) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Tamil