పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలో 21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం


• 11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు ఇప్పటికే ప్రారంభం

Posted On: 24 JUL 2023 2:48PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు 'సూత్రప్రాయఆమోదం తెలిపిందిఇందులో గోవాలోని మోపామహారాష్ట్రలోని నవీ ముంబైషిర్డీ మరియు సింధుదుర్గ్కర్ణాటకలోని కలబురగివిజయపురహసన్ మరియు శివమొగ్గమధ్యప్రదేశ్లోని దబ్రా (గ్వాలియర్), ఉత్తరప్రదేశ్లోని కుషినగర్నోయిడా (జెవేర్),  గుజరాత్లోని ధోలేరా మరియు హిరాసర్పుదుచ్చేరిలోని కరైకల్ఆంధ్రప్రదేశ్లోని దగదర్తిభోగాపురం మరియు ఓర్వకల్ (కర్నూలు), పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్సిక్కింలోని పాక్యోంగ్కేరళలోని కన్నూర్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని హోలోంగి (ఇటానగర్) ఉన్నాయి.  వీటిలో 11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు. దుర్గాపూర్, షిర్డీ, కన్నూర్, పాక్యోంగ్, కలబురగి, ఓర్వకల్ (కర్నూల్), సింధుదుర్గ్, ఖుషీనగర్, ఇటానగర్, మోపా మరియు శివమొగ్గలో కార్యరూపందాల్చాయి.

ప్రతిపాదన దశలో పరందూర్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం..

తమిళనాడులోని కాంచీపురం జిల్లా పరందూర్ వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసం మొదటి దశ క్లియరెన్స్ అంటే 'సైట్ క్లియరెన్స్' మంజూరు కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ)కి దరఖాస్తును సమర్పించింది. జీఎఫ్ఏ పాలసీ ప్రకారం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ) మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఎంఓడీ) వారి అభిప్రాయాల నిమిత్తం ఈ ప్రతిపాదనలు పంపబడినాయి. వాటాదారులతో ఈ సంప్రదింపులు పూర్తయిన తర్వాత, సైట్ క్లియరెన్స్ అవార్డుకు సంబంధించి వారి సిఫార్సు కోసం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలపై స్టీరింగ్ కమిటీ ముందు ప్రతిపాదన తీసుకురాబడుతుంది.  జీఎఫ్ఏ పాలసీ, 2008 ప్రకారం, ప్రాజెక్ట్ యొక్క నిధులు, భూసేకరణ, ఆర్&ఆర్ మొదలైనవాటితో సహా విమానాశ్రయ ప్రాజెక్టుల అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సహా సంబంధిత విమానాశ్రయ డెవలపర్‌పై ఉంటుంది (ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు అయితే). విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన కాలక్రమం సంబంధిత విమానాశ్రయ డెవలపర్‌లచే భూసేకరణ, తప్పనిసరి అనుమతులు, అడ్డంకులను తొలగించడం, ఫైనాన్షియల్ క్లోజర్స్ మొదలైన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.  పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

******



(Release ID: 1942287) Visitor Counter : 104