సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్‌ఎంఈలలో ఆలస్యమైన చెల్లింపులను పరిష్కరించడానికి పథకాలు

Posted On: 24 JUL 2023 4:15PM by PIB Hyderabad

ఎంఎస్‌ఎంఈ రంగానికి చెల్లింపుల ఆలస్యం సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి: -
 

  • మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ (ఎంఎస్‌ఎంఈడి) చట్టం, 2006లోని నిబంధనల ప్రకారం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల (ఎంఎస్‌ఈలు) చెల్లింపుల ఆలస్యం కేసులను పరిష్కరించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌లు (ఎంఎస్‌ఈఎఫ్‌సిలు) ఏర్పాటు చేయబడ్డాయి.
  • ఫిర్యాదుల దాఖలు & వస్తువులు మరియు సేవల కొనుగోలుదారుల నుండి సూక్ష్మ & చిన్న పరిశ్రమలకు (ఎంఎస్‌ఈలు) బకాయిలను పర్యవేక్షించడం కోసం 30.10.2017న ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ సమాధాన్ పోర్టల్ (https://samadhaan.msme.gov.in/MyMsme/MSEFC/MSEFC_Welcome.aspx)ను ప్రారంభించింది.
  • ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరిన్ని సంఖ్యలో ఎంఎస్‌ఈఎఫ్‌సిలను ఏర్పాటు చేయాలని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ,ఉత్తరప్రదేశ్‌ మరియు పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ ఎంఎస్‌ఈఎఫ్‌లను ఏర్పాటు చేయడంతో ఇప్పటివరకు 152 ఎంఎస్‌ఈఎఫ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.
  • కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్/పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా బకాయిలు మరియు నెలవారీ చెల్లింపులను ఎంఎస్‌ఎంఈలకు నివేదించడం కోసం ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ 14.06.2020న ఆత్మనిర్భర్ భారత్ ప్రకటనల తర్వాత సమాధాన్ పోర్టల్‌లో ప్రత్యేక ఉప-పోర్టల్‌ను రూపొందించింది.
  • సిపిఎస్‌ఈలు మరియు రూ.500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన అన్ని కంపెనీలకు బహుళ ఫైనాన్షియర్‌ల ద్వారా ఎంఎస్‌ఎంఈల ట్రేడ్ రిసీవబుల్స్ తగ్గింపును సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ (టిఆర్‌ఇడిఎస్‌)లో పొందేందుకు భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.
  • మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ నుండి వస్తువులు లేదా సేవల సరఫరాను పొందే కంపెనీలు మరియు మైక్రో మరియు స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెల్లింపులు ఆమోదించబడిన తేదీ లేదా వస్తువులు లేదా సేవలను డీమ్డ్ యాక్సిక్షన్ తేదీ నుండి 45 రోజులకు మించిన కంపెనీలు, చెల్లింపుల ఆలస్యానికి గల కారణాలను పేర్కొంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అర్ధ వార్షిక రిటర్న్‌ను సమర్పించాలి.
  • బడ్జెట్ 2023 ప్రకటన: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 43బి కింద ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపు చేసినప్పుడు మాత్రమే చెల్లింపులపై చేసే ఖర్చుపై మినహాయింపు అనుమతించబడుతుంది.


దేశంలో ఎంఎస్‌ఎంఈల సమగ్ర అభివృద్ధి మరియు ప్రమోషన్ కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు మరియు విధాన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర/కేంద్రపాలితప్రభుత్వాల ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది.

ఎంఎస్‌ఎంఈల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈల  రంగ  ప్రమోషన్ మరియు అభివృద్ధి కోసం వివిధ పథకాలు/కార్యక్రమాలను అమలు చేస్తుంది. వీటిలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఈజిపి), మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్-క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌ఈ-సిడిపి), ఎంఎస్‌ఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వంటివి ఉన్నాయి. ఈసిఎస్‌జిఎస్‌పై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ 23.01.2023న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈసిఎస్‌జిఎస్‌ పథకం (పునర్నిర్మాణంతో సహా) కారణంగా దాదాపు 14.60 లక్షల ఎంఎస్‌ఎంఈ ఖాతాలు సేవ్ అయ్యాయి. వీటిలో దాదాపు 98.30 % ఖాతాలు సూక్ష్మ మరియు చిన్న వర్గాలకు చెందినవి ఉన్నాయి.

సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

*****


(Release ID: 1942286) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Punjabi , Tamil