బొగ్గు మంత్రిత్వ శాఖ

అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న బొగ్గు బ్లాకులను గుర్తించేందుకు తీసుకున్న ప్రమాణాలు, రక్షణ చర్యలు

Posted On: 24 JUL 2023 2:40PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ 2018 నుండి 90 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసింది. 2018 నుంచి  విజయవంతంగా వేలం వేసిన బొగ్గు గనుల సంవత్సరం వారీగా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

 

సంవత్సరం

2018-19

2019-20

2020-21

2021-22

2022-23

 వేలం వేసిన బొగ్గు బ్లాకుల సంఖ్య 

0

4

20

19

47

 

 వేలం కోసం బొగ్గు బ్లాకులను గుర్తించే సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సాధారణంగా కింది ప్రమాణాలు, రక్షణ ఛాయలు అమలు చేస్తుంది: 

i)జాతీయ పార్కులు , వన్యప్రాణుల అభయారణ్యాలు, ఈ ఎస్ జెడ్ ,వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలలో   బొగ్గు బ్లాకులు ఉండకూడదు

ii )కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ  డెసిషన్ సపోర్ట్ సిస్టం (డిఎస్ఎస్ ) విశ్లేషణ.

(iii)  కొనసాగుతున్న అన్వేషణ కార్యకలాపాలు లేదా క్రియాశీల సిబిఎం  బ్లాక్‌లు కలిగి ఉన్న ప్రాంతాలకు మినహాయింపు  

(iv)  ప్రస్తుతం వివాదంలో  ఉన్న బ్లాక్‌లు/గనులు మినహాయింపు 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో సంప్రదించి  ఛత్తీస్‌గఢ్‌లోని హస్డియో అరంద్ అడవుల్లోని తారా బ్లాక్ , మధ్యప్రదేశ్‌లోని మహాన్ బొగ్గు బ్లాక్‌లను  వేలం కోసం గుర్తించడం జరిగింది. పర్యావరణం పై పడే  ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని మహాన్ బొగ్గు బ్లాక్‌ను భూగర్భ పద్ధతిలో మైనింగ్ కోసం వేలం వేయాలని నిర్ణయించారు.  పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాన్ని రక్షించడానికి ఈ చర్య తీసుకోవడం జరిగింది.  తారా బ్లాక్‌ను హస్డియో-అరంద్ కోల్‌ఫీల్డ్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన జీవ వైవిధ్య  అధ్యయనం సిఫార్సుల ఆధారంగా వేలం కోసం గుర్తించడం జరిగింది.  

బొగ్గు గనుల ప్రాజెక్టులకు అవసరమైన  అనుమతులు, పర్యావరణ అనుమతులను  కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ , మంత్రిత్వ శాఖ నిపుణుల అంచనా కమిటీలు చట్టబద్ధంగా ఏర్పాటైన అడవుల సలహా  అటవీ కమిటీ జారీ చేస్తాయి. అనుమతులు జారీ చేయడానికి  పర్యావరణ ప్రభావ అంచనా, అటవీ, వన్యప్రాణుల ప్రభావం, సామాజిక-ఆర్థిక ప్రభావం, గాలి, నీటి నాణ్యత, పర్యావరణ నిబంధనలను పాటించడం, స్థానిక ప్రజలను సంప్రదించడం, , పర్యవేక్షణ మరియు సమ్మతి విధానం వంటి అనేక అంశాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. ప్రాజెక్ట్  స్థాయి, ప్రాంతం, ప్రభావాలపై ఆధారపడి కొన్ని ప్రమాణాలు, మార్గదర్శకాలు మారే అవకాశం ఉంటుంది  అని గుర్తించాల్సి ఉంటుంది.  

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో  దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు  తీర్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.  ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అంశానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.  బొగ్గు నిక్షేపాలు  కలిగి ఉన్న ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంపకం , తవ్విన భూములను పునరుద్ధరించడం వంటి అనేక ఉపశమన చర్యలను అనుసరించడం ద్వారా పర్యావరణం పరిరక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం అమలు జరుగుతున్న చర్యలు:- 

  1. బొగ్గు రంగంలో హరితహారం కార్యక్రమాలు: 2022-23 సంవత్సరానికి 50 లక్షల మొక్కల పెంపకంతో బొగ్గు క్షేత్రాలు, వాటి  చుట్టుపక్కల 2400 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని గ్రీన్ కవర్‌లోకి తీసుకురావాలని బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు కంపెనీలకు  లక్ష్యాన్ని నిర్దేశించింది. 2030 నాటికి అదనపు అటవీ , చెట్లతో సమానమైన 2.5 నుండి 3 బిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువుకి సమానమైన అదనపు కార్బన్ సింక్‌ను కల్పించడానికి అమలు జరుగుతున్న నేషనల్‌లీ డిటర్‌మైన్ కాంట్రిబ్యూషన్  నిబద్ధతకు  హరితీకరణ కార్యక్రమాల ద్వారా   బొగ్గు రంగం పూర్తి సహకారం అందిస్తోంది. 
  2. పరిహార అటవీ నిర్మూలన అనేది మానవ కార్యకలాపాల వల్ల దెబ్బతిన్న భూముల పునరుద్ధరణకు సహకరిస్తుంది.  తవ్విన భూభాగాన్ని  సంతృప్తికరమైన పునరావాసానికి సిద్ధం చేయడానికి ఈ చర్య తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.  బొగ్గు గనుల కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ,నేల కోతను నివారణకు , వాతావరణ స్థిరీకరణ , వన్యప్రాణుల సంరక్షణ, గాలి , జలవనరుల  నాణ్యత పెంచడానికి ఈ చర్య సహకరిస్తుంది. 
  3. దేశంలో పర్యావరణహిత  బొగ్గు తవ్వకాలు ప్రోత్సహించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ 'సస్టైనబిలిటీ జస్ట్ ట్రాన్సిషన్' విభాగాన్ని ఏర్పాటు చేసింది.
  4. మైనింగ్ ప్రాంతాల్లో ఎకో-టూరిజంను ప్రోత్సహించడం
  5. భూగర్భ బొగ్గు తవ్వకాలుప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***(Release ID: 1942118) Visitor Counter : 79


Read this release in: English , Urdu , Tamil , Kannada