శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భారతదేశపు మొట్టమొదటి గంజాయి ఔషధ ప్రాజెక్ట్‌కు మార్గదర్శకంగా జమ్మూ:


కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జమ్మూకి చెందిన 'గంజాయి పరిశోధన ప్రాజెక్ట్' కెనడియన్ సంస్థతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద భారతదేశంలో మొట్టమొదటిది, దుర్వినియోగ పదార్థాన్ని మానవజాతి యొక్క మంచి కోసం ఉపయోగించడంలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క ఈ ప్రాజెక్ట్ ఆత్మ-నిర్భర్ భారత్ దృక్కోణం నుండి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వివిధ రకాల న్యూరోపతిలు, డయాబెటిక్ నొప్పులు మొదలైన వాటికి ఎగుమతి చేసే నాణ్యమైన మందులను ఉత్పత్తి చేయగలదని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ భారతదేశంలోని పురాతన శాస్త్రీయ పరిశోధనా సంస్థ. ఇది 1960లలో పుదీనాను కనుగొన్న చరిత్రతో, ఊదా విప్లవానికి కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క

Posted On: 23 JUL 2023 4:27PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, సాంకేతిక, పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ..  భారతదేశపు మొట్టమొదటి గంజాయి ఔషధ ప్రాజెక్ట్‌కు జమ్మూ మార్గదర్శకత్వం వహించబోతోందన్నారు.

 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) జమ్మూకి చెందిన ‘గంజాయి పరిశోధన ప్రాజెక్ట్’ భారతదేశంలోనే తొలిసారిగా కెనడియన్ సంస్థతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభించబడింది. దుర్వినియోగం చేసే ఈ మొక్క మానవజాతి మంచి కోసం.. ముఖ్యంగా నరాలవ్యాధి, క్యాన్సర్ మరియు మూర్ఛతో బాధపడుతున్న రోగులకు నయం చేసే  గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 ఈ ముఖ్యమైన మొక్కపై జరుగుతున్న పరిశోధనల గురించి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడాని, ఈ మొక్కపై రక్షిత ప్రాంతంలో గంజాయిని సాగు చేసే పద్ధతులు ప్రత్యక్షంగా పరిశీలించడానికి  జమ్మూ సమీపంలోని చతా ఫామ్‌లోగల  సీఎస్ఐఆర్ -ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క గంజాయి సాగు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..

 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం)  యొక్క ఈ ప్రాజెక్ట్ ఆత్మ-నిర్భర్ భారత్ కోణం నుండి కూడా ముఖ్యమైనదని మంత్రి అన్నారు, ఎందుకంటే అన్ని అనుమతులు పొందిన తరువాత, వివిధ రకాల న్యూరోపతిలు, డయాబెటిక్ నొప్పులు మొదలైన వాటికి ఉద్దేశించిన ఎక్స్పోర్ట్ క్వాలిటీ మందులను ఉత్పత్తి చేయగలదన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జమ్ము మరియు కశ్మీర్, పంజాబ్ ప్రాంతాలు మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ప్రభావితమవుతున్నాయని,  దుర్వినియోగమవుతున్న ఈ మొక్కను వివిధ రకాల ఔషధ ఉపయోగాలు కలిగి ఉందని ముఖ్యంగా ప్రాణాంతకత మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు  ఈ రకమైన ప్రాజెక్ట్ అవగాహన కల్పిస్తుందన్నారు.

డాక్టర్  జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) మరియు ఇండస్‌స్కాన్ మధ్య శాస్త్రీయ ఒప్పందంపై సంతకాలు జమ్ము కశ్మీర్కే కాకుండా భారతదేశం మొత్తానికి చారిత్రాత్మకమైనవన్నారు.  ఎందుకంటే ఇది విదేశాల నుండి ఎగుమతి చేయవలసిన మందులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

ఈ తరహా ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్‌లో భారీ పెట్టుబడులకు ఊతమిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం)ని అభినందిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం)  భారతదేశంలోని పురాతన శాస్త్రీయ పరిశోధనా సంస్థ అని,  1960లలో పుదీనాను కనుగొన్న చరిత్ర, ఊదా విప్లవానికి కేంద్ర బిందువన్నారు. అంతేకాక ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) యొక్క గంజాయి పరిశోధన ప్రాజెక్ట్ భారతదేశంలో శాస్త్రీయ పరిశోధన పరంగా మరింత ప్రతిష్టాత్మకంగా మారబోతోందన్నారు.

క్షేత్ర సందర్శన సమయంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ఎకరం రక్షిత ప్రాంతాన్ని పరిశీలించారు, అక్కడ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) ప్రస్తుతం పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేస్తోంది.

వాతావరణ నియంత్రణ సౌకర్యాలతో కూడిన గ్లాస్ హౌసెస్ను కూడా మంత్రి సందర్శించారు. వివిధ రకాలైన గంజాయి మొక్కలను ఆశించిన రీతిలో  సాగుచేయడంపై ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి.  


నిషేధించబడిన మరియు దుర్వినియోగానికి ప్రసిద్ధి చెందిన మొక్క అయిన గంజాయి యొక్క చికిత్సా లక్షణాలను అన్వేషించడంలో మార్గదర్శక పరిశోధన కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) యొక్క ప్రయత్నాలను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) ద్వారా గంజాయి ప్రాజెక్ట్‌పై నిర్వహించిన పరిశోధన పనులపై మంత్రి తన సంతృప్తిని వ్యక్తం చేశారు మరియు వివిధ ఆరోగ్య పరిస్థితులను పరిష్కరించడంలో గంజాయి ఆధారిత చికిత్సల యొక్క అపారమైన సామర్థ్యాన్ని కూడా గుర్తించారు.

 రైతులకు సహాయపడే ఉత్పత్తులను పెంచడానికి అత్యాధునిక సాంకేతికతను మరియు సాగు పద్ధతులను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు.  మన దేశ పర్యావరణ పరిస్థితులకు సరిపోయే కొత్త దేశీయ రకాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా నొక్కి చెప్పారు. ఈ ప్రయత్నంలో బయోటెక్నాలజీ పాత్రను కూడా మంత్రి హైలైట్ చేశారు.  అంతేకాకుండా శాస్త్రీయ అభివృద్ధి యొక్క సరిహద్దులను కొనసాగించమని పరిశోధకులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ..  గంజాయి ఒక అద్భుత మొక్క అని, దీని నుండి వికారం మరియు వాంతులు చికిత్స కోసం Marilnol/nabilone మరియు Cesamet వంటి మందులను ఎఫ్డీఏ ఆమోదించిందని, నరాలవ్యాధి నొప్పి మరియు స్పాస్టిసిటీ కోసం Sativex, Epidiolex, Cannabidiol మూర్ఛ మరియు ఇతర దేశాలలో ఉపయోగిస్తున్నారని చెప్పారు. జమ్ము మరియు కశ్మీర్లో, పరిశోధన మరియు రక్షిత సాగు కోసం జమ్మూలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం)కి లైసెన్స్ మంజూరు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా జీఎంపీ తయారీ అనుమతితో, మిగిలిన ప్రీ-క్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాలు పూర్తవుతాయని చెప్పారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, ప్రస్తుతం CSIR-IIIM దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 500 కంటే ఎక్కువ ప్రవేశాల రిపోజిటరీని కలిగి ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గంజాయి సాగు కోసం ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీని అందించడానికి వివిధ దిశల్లో పని చేస్తున్నారని,  క్యాన్సర్ మరియు మూర్ఛలో నొప్పి నిర్వహణ వంటి వ్యాధి పరిస్థితులపై దృష్టి సారించి ఔషధ ఆవిష్కరణ జరుగుతోందన్నారు.  బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తో సీఎస్ఐఆర్ యొక్క త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) శాస్త్రీయ ప్రయోజనం కోసం గంజాయి సాగుకు లైసెన్స్ పొందిన తరువాత, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్ఐఐఐఎం) గంజాయిపై అన్వేషణాత్మక పరిశోధనను పూర్తి చేసిందని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. క్యాన్సర్ నొప్పి మరియు మూర్ఛ నిర్వహణకు సంబంధించిన తదుపరి ప్రీ-క్లినికల్ రెగ్యులేటరీ అధ్యయనాల కోసం, కొత్త చికిత్సా ఔషధాల ఆవిష్కరణకు తప్పనిసరి అవసరాలైన ప్రీ-క్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాల కోసం జీఎంపీ తయారీని నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. జమ్ము మరియు కశ్మీర్ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ నుండి లైసెన్స్ పొందేందుకు దరఖాస్తు చేశామని,  శాస్త్రీయ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా గంజాయి పదార్థాల జీఎంపీ తయారీ మరియు రవాణా కోసం చాలా కాలం క్రితం సమర్పించబడిందన్నారు.  ఇది ఇప్పటికీ ప్రక్రియలో ఉందని సీఎస్ఐఆర్ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్ మంత్రి జితేంద్ర సింగ్ కు తెలిపారు.

సంబంధితంగా సీఎస్ఐఆర్ -ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గంజాయి పరిశోధనలో అగ్రగామిగా ఉంది మరియు దేశంలో సాగు కోసం మొదటి లైసెన్స్‌ను పొందింది. దీనిని అనుసరించి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక ఇతర రాష్ట్రాలు శాస్త్రీయ ప్రయోజనం కోసం గంజాయిని ఉపయోగించే విధానం మరియు నియమాలను రూపొందించడం ప్రారంభించాయి.

ఈ కార్యక్రమంలో ఆర్ఎంబీడీ అండ్ ఐఎస్టీ చీఫ్ సైంటిస్ట్ మరియు హెడ్   ఎర. అబ్దుల్ రహీమ్,  పీఎస్ఏ డివిజన్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ & హెడ్డాక్టర్ ధీరజ్ వ్యాస్, ఐఐడీ డివిజన్  సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ & హెడ్  డాక్టర్ సుమిత్ గాంధీ, గంజాయి పరిశోధన ప్రాజెక్ట్  ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ పీ.పీ.  సింగ్  మరియు  ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు ఐ/సీ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. డా. సౌరభ్ సరన్ తదితరులు పాల్గొన్నారు. 

 

****

 (Release ID: 1941984) Visitor Counter : 135