జల శక్తి మంత్రిత్వ శాఖ

జేజేఎం డిజిటల్ అకాడమీని ఏర్పాటు చేసిన కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్యం విభాగం


తారునీరు, పారిశుద్ధ్య సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన జేజేఎం డిజిటల్ అకాడమీని ప్రారంభించిన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

జేజేఎం డిజిటల్ అకాడమీ ద్వారా తక్కువ ఖర్చుతో వాటాదార్లందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేతులు కలిపిన జేజేఎం, ఎకో

Posted On: 23 JUL 2023 4:34PM by PIB Hyderabad

న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన జాతీయ సదస్సు సందర్భంగా, జేజేఎం డిజిటల్ అకాడమీ స్థాపించడానికి కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్యం విభాగం, ఎకో ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. జేజేఎం డిజిటల్ అకాడమీ ఆన్‌లైన్ పోర్టల్‌ను కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, తాగునీరు & పారిశుద్ధ్యం విభాగం కార్యదర్శి శ్రీమతి వినీ మహాజన్, అదనపు కార్యదర్శి & మిషన్ డైరెక్టర్-ఎన్‌జేజేఎం శ్రీ వికాస్ షీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లాభాపేక్ష లేకుండా పని చేసే ఎకో ఇండియా, జేజేఎం డిజిటల్ అకాడమీని స్థాపించడానికి కేంద్ర విభాగానికి మద్దతు ఇచ్చింది. పారిపాలనాధికారులు, ఇంజినీర్లు, పంచాయతీ కార్యనిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు వంటి నీటి సరఫరా కార్యక్రమాలతో సంబంధం ఉన్న సిబ్బంది సామర్థ్యాన్ని ఈ అకాడమీ ద్వారా పెంచడం కేంద్ర విభాగం లక్ష్యం. ఆశించిన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలను అకాడమీ అందిస్తుంది. వినూత్న విధానాల ద్వారా శిక్షణ కోసం డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తుంది.

విజ్ఞానాన్ని పంచుకోవడానికి, భవిష్యత్తులో పునఃపరిశీలన కోసం అన్ని శిక్షణ కార్యక్రమాలను అకాడమీ రికార్డు చేస్తుంది, రిపోజిటరీ కూడా నిర్మిస్తుంది. సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కీ రిసోర్స్‌ సెంటర్లు (కేఆర్‌సీలు), ఇంప్లిమెంటింగ్ సపోర్ట్ ఏజెన్సీలు (ఐఎస్‌ఏలు) జేజేఎం డిజిటల్ అకాడమీ వేదికలో ఉంటాయి. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తాము అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వివరించడానికి సమావేశాలు నిర్వహిస్తాయి.  ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞానాన్ని అందించడానికి అనేక యూఎన్‌, ద్వైపాక్షిక ఏజెన్సీలు, ఆర్‌డబ్ల్యూపీఎఫ్‌ భాగస్వాములు, ట్రస్టులు, ఫౌండేషన్లు, సంస్థలు, పౌర సంస్థలుచేతులు కలిపాయి. ఇవి తమ ప్రణాళికలను ప్రచురిస్తాయి. దానికి అనుగుణంగా సరైన స్థలంలో, సరైన సమయంలో సరైన జ్ఞానాన్ని అందించడానికి క్షేత్ర స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విజ్ఞానాన్ని అందిస్తాయి.

భాగస్వాములు, ప్రభుత్వం, సంఘాల సమష్టి ప్రయత్నాల ద్వారా ఉత్పన్నమయిన విజ్ఞానం, ఇళ్లకు మంచినీటి సరఫరాలో స్థిరత్వం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుందని కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. ఆ విజ్ఞానాన్ని  వినియోగించుకోవడానికి ఒక వేదికను జేజేఎం డిజిటల్ అకాడమీ అందిస్తుందన్నారు.

 

***



(Release ID: 1941980) Visitor Counter : 112