మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ముంబైలో బాలల రక్షణ, భద్రత, సంరక్షణపై మూడవ ప్రాంతీయ సదస్సు నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ


సదస్సులో పాల్గొంటున్న 7 రాష్ట్రాలకు చెందిన 2500 పైగా ప్రతినిధులు

బాల్య న్యాయం చట్టం నిబంధనల సవరణపై సదస్సులో చర్చలు

గ్రామ స్థాయి రక్షణ కమిటీ సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి
ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్ సహకారంతో దేశంలో తప్పిపోయిన 4 లక్షల మంది పిల్లల ఆచూకీ గుర్తింపు.. మంత్రి

పిల్లల రక్షణ, పిల్లల భద్రత, శిశు సంక్షేమ సమస్యలపై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల్లో భాగంగా ముంబైలో నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

Posted On: 23 JUL 2023 8:51AM by PIB Hyderabad

బాలల రక్షణ, భద్రత,  శిశు సంక్షేమం పై కేంద్ర  మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  3వ  ఒకరోజు ప్రాంతీయ సదస్సు 2023 జూలై 22 న ముంబై శ్రీ షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆడిటోరియంలో జరిగింది. సదస్సులో  మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, దాద్రా, నగర్ హవేలీ,డామన్ , డయ్యూ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు సదస్సుకు దాదాపు 2500 మంది బాలల సంక్షేమ కమిటీలు (సిడబ్ల్యుసిలు), జువైనల్ జస్టిస్ బోర్డులు (జెజెబిలు), గ్రామ స్థాయి పిల్లల సంరక్షణ  కమిటీ (విసిపిసి) సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. బాలల భద్రతా, సంరక్షణ, సంక్షేమం అంశాలపై  అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సదస్సుల్లో  భాగంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  ముంబైలో ప్రాంతీయ సదస్సు నిర్వహించింది. 

సదస్సులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి  శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ పాల్గొన్నారు కేంద్ర  మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ చద్దా కూడా ప్రసంగించారు.

బాల్య న్యాయం చట్టం నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలపై సదస్సులో ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. 

2022 సెప్టెంబర్ నెలలో దత్తతకు సంబంధించి చట్టంలో సవరణలు చేశారు. సవరణల వల్ల దత్తత ప్రక్రియ సులభతరం అయింది. దీనివల్ల దత్తత తీసుకున్నతల్లిదండ్రులకు కలిగిన ప్రయోజనాలను సదస్సులో ప్రస్తావించారు.  

సామాజిక అభివృద్ధి సాధించడానికి, జీవించడానికి, ఎదగడానికి, విద్యావంతులు కావడానికి, జీవితంలో అభివృద్ధి సాధించడానికి హక్కులు కలిగి ఉంటారని కేంద్ర  మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి.ఇంద్ర మల్లో వివరించారు. బాలల హక్కులను శ్రీమతి.ఇంద్ర మల్లో వివరంగా  వివరించారు. మిషన్ వాత్సల్య పోర్టల్ గురించి కూడా ఆమె ప్రస్తావించారు,  పోర్టల్  లో ఎంఐఎస్, ఇ-ఆఫీస్ అప్లికేషన్లు అన్ని రాష్ట్రాలు పొందవచ్చునని ఆమె తెలిపారు.  

మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  శ్రీ సంజీవ్ కుమార్ చద్దా మాట్లాడుతూ బాలల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా  మిషన్ వాత్సల్య అమలు జరుగుతుందన్నారు.  ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన  సంతోషకరమైన బాల్యాన్ని అందించడం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  

 మిషన్ వాత్సల్య అమలులోకి వచ్చిన తర్వాత బాల నేరస్తుల న్యాయ చట్టం అమలు, సీసీఐ, ఇతర సంస్థలు పనితీరు గణనీయంగా మెరుగు పడ్డాయన్నారు.జిల్లా సుతఃయి అధికారులు అమలు చేస్తున్న చర్యల వల్ల మిషన్ వాత్సల్య వల్ల ప్రజలు, పిల్లలు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు.  

సీసీఐ,సిడబ్ల్యుసి,జెజెబి,డిసిపియు పనితీరు పట్ల కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచారం కోసం కాకుండా మానవతా దృక్పధంతో సభ్యులు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. 

ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్ సహకారంతో దేశంలో తప్పిపోయిన 4 లక్షల మంది పిల్లల ఆచూకీ గుర్తించి 

 వారి కుటుంబాలకు చేర్చామని ఆమె తెలిపారు. అందరి సహకారంతో, ప్రభుత్వ సమన్వయంతో ఏడాదిలో దేశవ్యాప్తంగా 2500 కు పైగా దత్తత తీసుకున్నట్లు ఆమె వివరించారు.

పిల్లల సంరక్షణ కోసం కృషి చేస్తున్న గ్రామ స్థాయి సంరక్షణ కమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు. 

సహాయం అవసరమైన పిల్లలను గుర్తించాలని మంత్రి సూచించారు.  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన వారికి సహాయం, భద్రత కల్పిస్తామని మంత్రి తెలిపారు. 

 కౌమారదశలో చదువు మానివేసిన  బాలికలను తిరిగి పాఠశాలలో చేర్పించడానికి  ఒక సంవత్సరం ముందు మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించిందని శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు  లక్ష మంది బాలికలు  తిరిగి చదువుకోవడం ప్రారంభించారని మంత్రి తెలిపారు. 

మధ్యలో చదువు మాని వేసిన మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలను గుర్తించి వారు చదువు కొనే విధంగా చర్యలు అమలు చేసేందుకు  చూసేందుకు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని సదస్సులో నిర్ణయించారు. 14 సంవత్సరాల వయస్సు ఉన్న వారందరికీ విద్యా హక్కు కల్పించాలని సదస్సు నిర్ణయించింది. 

సదస్సులో  మిషన్ వాత్సల్య ద్వారా సాధించిన విజయాలను వివరించారు. 

 

***

 



(Release ID: 1941886) Visitor Counter : 138