శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

తక్కువ కార్బన్ ఎకానమీ లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


- గోవాలో జరిగిన సీఈఎం 14/ఎంఐ 8 సమావేశంలో భాగంగా టెక్నాలజీ షోకేస్‌ను సందర్శించి

అనేక కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 JUL 2023 5:22PM by PIB Hyderabad

సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గోవాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో G20 జరుగుతున్న ఎనర్జీ ట్రాన్సిషన్ మినిస్టీరియల్ మీటింగ్ (ఈటీఎంఎం) సందర్భంగా జరిగిన టెక్నాలజీ షోకేస్‌ను ప్రదర్శనను సందర్శించారు. జూలై 19-22, 2023లో 8వ మిషన్ ఇన్నోవేషన్ (ఎంఐ-8) మరియు 14వ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ (సీఈఎం14) ఆధ్వర్యంలో ఈటీఎంఎం నిర్వహించబడింది. ఎగ్జిబిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ)కి చెందిన వివిధ పరిశోధన మరియు అభివృద్ధి  కేంద్రాల నుండి పాల్గొన్న వారితో ఆయన ముచ్చటించారు. టెక్నాలజీ షోకేస్ మూడు విభాగాలలో ఏర్పాటు చేయబడింది.  వాహనం మరియు ఛార్జింగ్, మౌలిక వనరుల ప్రదర్శన (సియామ్, టెరీ, కాల్ స్టార్ట్ మరియు డ్రైవ్ టు జీరో ద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శన), మిషన్ ఇన్నోవేషన్ (డీఎస్టీ ద్వారా), మరియు క్లీన్ టెక్ స్టార్ట్-అప్ (టెరీ) అనే మూడు భాగాల క్రింద నిర్వహించబడింది. ఇది భారత దేశం యొక్క అత్యాధునిక పురోగతులు, వివిధ రంగాలలో కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను కలిగి ఉంది. స్వచ్ఛమైన శక్తిలో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించింది. డీఎస్టీ తన ఆర్&డీ కేంద్రాలు మరియు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించింది. క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ & మిషన్ ఇన్నోవేషన్ సమావేశాలలో ఈ ప్రదర్శన  కీలక అంశం. మంత్రుల సమావేశం జరిగిన రోజున క్లీన్ ఎనర్జీని వేగవంతం చేయడానికి డాక్టర్ సింగ్ అనేక నిధుల అవకాశాలు మరియు గ్రాంట్లు కూడా ప్రకటించారు. సభ్య ఎంఐ దేశాలతో కలిసి సంయుక్త పరిశోధన & అభివృద్ధిని చేపట్టేందుకు మిషన్ ఇన్నోవేషన్ 2.0 కింద కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ మరియు స్టోరేజీకి సంబంధించిన ఆర్డీ&డీ కోసం ఫండింగ్ ఆపర్చునిటీ ప్రకటన 2023ని ఇందులో చేర్చారు. దీనికి తోడు మంత్రి  క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ & గ్రీన్ హైడ్రోజన్ ప్రాంతంలోని నేషనల్ ఛాలెంజ్ విజేతలు/ గ్రాంటీలను వారికి సైటేషన్ ఫలకాలు అందించి సత్కరించారు. అలాగే గ్రీన్ పవర్ ప్రైరేటెడ్ ఇన్నోవేషన్ కింద గుర్తించిన అత్యంత అత్యవసరమైన ఆవిష్కరణను పరిష్కరించడానికి హై-ఎఫిషియన్సీ పీవీ సెల్స్ మరియు మాడ్యూల్స్‌పై నాలుగు నేషనల్ ఛాలెంజ్ గ్రాంట్ ప్రాజెక్ట్‌ల విజేతలను కూడా సత్కరించారు.  సీఈఎం 14/ఎంఐ 8 జాయింట్ మినిస్టీరియల్‌ను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ భారతదేశ ప్రయత్నాలను వివరించారు. “హైడ్రోజన్ కోసం, మేము చిన్న తరహా హైడ్రోజన్ వ్యాలీని ప్రారంభించే అధునాతన దశలో ఉన్నాము. నాలుగు ఇండో-డానిష్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించాము. ఇంకా, మేము గ్రీన్ పవర్డ్ ఫ్యూచర్ మిషన్ వైపు సమర్థవంతమైన సౌర ఘటాలను తయారు చేయడానికి ఛాంపియన్ పరికరాల తయారీకి సంబంధించిన నాలుగు ప్రాజెక్ట్‌లను కూడా ప్రారంభిస్తాము. తక్కువ కార్బన్ జెట్ ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి ఏడు ఆర్&డీ ప్రాజెక్ట్‌లకు కూడా మద్దతు లభిస్తుంది మరియు స్వదేశీ 2జీ ఇథనాల్ టెక్నాలజీని 250 కిలోల/రోజు పైలట్ ప్లాంట్ స్కేల్‌లో అభివృద్ధి చేసి ప్రదర్శించాము. ” అని అన్నారు.  సీసీయుఎస్, హైడ్రోజన్, స్మార్ట్ గ్రిడ్‌లు, ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడం, ఆఫ్-గ్రిడ్‌లు మరియు తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు దేశం మారడంలో సహాయపడటానికి డీఎస్టీ మద్దతు ఉన్న ఎంఐ జోక్యాల ద్వారా అభివృద్ధి చేయబడిన సాంకేతికతల సంకలనమైన మిషన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ కాంపెండియాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు.

 

***



(Release ID: 1941844) Visitor Counter : 151