జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ సంకలనాన్ని ఆవిష్కరించిన కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్


వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న 75 ఓడీఎఫ్‌ ప్లస్ ఉత్తమ విధానాల సంకలనం ఈ క్రానికల్‌; ఇది ఆవిష్కరణలను చాటి చెబుతుంది, ఆచరణలను ప్రోత్సహిస్తుంది

Posted On: 22 JUL 2023 12:52PM by PIB Hyderabad

'రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరమ్' (ఆర్‌డబ్ల్యూపీఎఫ్‌) రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా, ఇవాళ, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 75 ODF ప్లస్ ఉత్తమ విధానాల సంకలనాన్ని ఆవిష్కరించారు. 'స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా' పేరుతో ఈ సంకలనాన్ని రూపొందించారు. ఎస్‌బీఎం-జి రెండో దశ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ ODF ప్లస్ కార్యకలాపాల కోసం రాష్ట్రాలు/యూటీలు చేసిన ప్రయత్నాలు, అడ్డంకులను అధిగమించడానికి & ప్రజల్లో అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన ఆవిష్కరణలు, ప్రత్యేక ప్రచారాలను ఈ సంకలనం వివరిస్తుంది.

 

 

"ODF ప్లస్‌ను సాధించడానికి కృషి చేస్తున్న రాష్ట్రాలు, వర్గాలకు ఈ సంకలనం విలువైన వనరు"గా  కేంద్ర మంత్రి శ్రీ షెకావత్ అభివర్ణించారు. "దేశవ్యాప్తంగా అమలైన ఉత్తమ విధానాలను ఇది వివరిస్తుంది, ఆ విజయాలను అనుసరించేలా ఇతరులకు స్ఫూర్తిని అందిస్తుంది" అన్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఐఈసీ బృందం ఈ సంకలనాన్ని రూపొందించింది. ఎస్‌బీఎంజీ రెండో దశ నేపథ్యాంశాల అమలుకు సంబంధించిన కథనాలు ఇందులో ఉంటాయి. ఈ కింది కీలక ప్రమాణాల ఆధారారంగా కథనాలను ఎంపిక చేశారు:

ఆవిష్కరణలు: ODF ప్లస్‌ను సాధించడానికి అనుసరించిన వినూత్న విధానాలను ఈ విభాగం వివరిస్తుంది. ఉదాహరణకు, ఒడిశా రాష్ట్రంలో, బ్లాక్ స్థాయిలో సామాజిక భాగస్వామ్యం & నాయకత్వం వల్ల ఖోర్ధా జిల్లాలోని జితికర్ సువాన్‌లో గ్రామం ఎలా ODF ప్లస్ నమూనా గ్రామం హోదాను సాధించిందో ఈ సంకలనం వివరిస్తుంది. ODF ప్లస్ ఆస్తుల ప్రత్యక్ష నమూనాలను ప్రదర్శించడం (ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం) ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా ODF ప్లస్ స్థితిని ఎలా సాధించిందో వెల్లడిస్తుంది.

అడ్డంకులను అధిగమించడం: ODF ప్లస్‌ను సాధించడంలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎలా అధిగమించింది అనే విషయాలను ఈ విభాగం చర్చిస్తుంది. ఉదాహరణకు, తమిళనాడు రాష్ట్రంలో నమ్మ ఊరు సూపరు ప్రచారంలో భాగంగా, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం వల్ల మదురై జిల్లాలోని పెరి-అర్బన్ పంచాయతీల్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి.

అవగాహన పెంచడం: పారిశుద్ధ్యం గురించి అవగాహన పెంచడానికి తీసుకున్న చర్యలను ఈ విభాగం చాటి చెబుతుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలు, 'వాష్ వాణి' అనే పత్రిక నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రత అలవాట్లను ప్రోత్సహించేలా తమ సృజనాత్మక శక్తిని ఉపయోగిస్తున్నారు.

ప్రత్యేక ప్రచారాలు: ODF ప్లస్‌ సాధించడానికి ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమాలను ఈ విభాగం వివరిస్తుంది. ఉదాహరణకు, 'స్వచ్ఛ్ సాగర్', 'సురక్షిత్ సాగర్' ‍‌(పరిశుభ్ర సముద్రం, సురక్షిత సముద్రం) కార్యక్రమాలు తీసుకొచ్చిన గుజరాత్ ప్రభుత్వం, రాష్ట్రంలోని సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడానికి, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది.

‘స్వచ్ఛత క్రానికల్స్: ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

*****


(Release ID: 1941806) Visitor Counter : 143