వ్యవసాయ మంత్రిత్వ శాఖ
శాటిలైట్ ద్వారా పంటల మ్యాపింగ్
प्रविष्टि तिथि:
21 JUL 2023 4:08PM by PIB Hyderabad
పంటల ఉత్పత్తి అంచనా, కరువు అంచనాలకు సంబంధించిన ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఇందులో ఉపగ్రహ చిత్రాల వాడకం వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం అంతరిక్షం, వ్యవసాయ వాతావరణ శాస్త్రం మరియు భూమి ఆధారితం వ్యవసాయ పంటల అంచనాల పరిశీలన (ఫసల్) ప్రాజెక్ట్‌ని ఉపయోగిస్తోంది. పంట ఉత్పత్తి, క్షేత్ర పంటల అంచనా, వ్యవసాయ కరువు అంచనా కోసం జాతీయ వ్యవసాయ కరువు అంచనా మరియు పర్యవేక్షణ వ్యవస్థను (ఎన్ఏడీఏఎంఎస్) వినియోగిస్తోంది. ఫసల్ మరియు ఎన్ఏడీఏఎంఎస్లను మహాలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్ (ఎం.ఎన్.సి.ఎఫ్.సి) వ్యవసాయం & రైతుల సంక్షేమ శాఖ అటాచ్డ్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తారు. ప్రస్తుతం, వరి, గోధుమలు, రబీ పప్పులు, రాప్‌సీడ్ & ఆవాలు, రబీ, జొన్న, పత్తి, జనపనార, తురుము మరియు చెరకు అనే తొమ్మిది పంటలు ఫసల్ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై) కి సాంకేతిక మద్దతుతో సహా పంట కోత ప్రయోగాల కోసం స్మార్ట్ శాంప్లింగ్ (సీసీఈలు), దిగుబడి & ప్రాంత వివాద పరిష్కారం వంటి పీఎంఎఫ్బీఐ కింద వివిధ కార్యాచరణ అనువర్తనాల కోసం కూడా ఉపగ్రహ చిత్రాలు ఉపయోగించబడుతున్నాయి. ఎం.ఎన్.సి.ఎఫ్.సి. వివిధ భౌగోళిక-ప్రాదేశిక పరిష్కారాలు, సేవలను అభివృద్ధి చేయడం మరియు పెంచడంపై ఇస్రో, పరిశ్రమతో కలిసి పని చేస్తోంది. ఇటీవల, ఎం.ఎన్.సి.ఎఫ్.సి. మరియు ఫిక్సల్ స్పేస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. పైలట్ ప్రాతిపదికన ఎంచుకున్న ప్రాంతాలపై పంట గుర్తింపు మరియు మ్యాపింగ్, పంట ఆరోగ్య పర్యవేక్షణ మరియు నేల సేంద్రీయ కార్బన్ అంచనా కోసం, ఫిక్సెల్ యొక్క హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహాల చిత్రాలను ఉపయోగించి వ్యవసాయ విశ్లేషణ నమూనాలను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పదం దోహదం చేస్తుంది. ఇది పంట అంచనా సర్వేలు, విపత్తు నిర్వహణ మరియు ఉపశమనం, పంట బీమా మరియు వ్యవసాయ స్థాయి సలహాలలో ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(रिलीज़ आईडी: 1941676)
आगंतुक पटल : 213