వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహజ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 21 JUL 2023 4:07PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం 2019-20 నుండి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.  పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవైయొక్క ఉప పథకం భారతీయ ప్రకృతి కృషి పద్ధతి (బీపీకేపీ)  కింద సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

సహజ వ్యవసాయం అనేది పశువులను, స్థానిక వనరులను ఉపయోగించి సమగ్ర వ్యవసాయం మరియు పశుసంవర్ధక విధానం ఆధారంగా రసాయన రహితంగా సాగు చేయడం. ఇది ఎక్కువగా బయోమాస్ మల్చింగ్, స్థానిక పశువుల నుండి పొలంలో ఆవు పేడ-మూత్ర సూత్రీకరణలతో ఆన్-ఫార్మ్ బయోమాస్ రీసైక్లింగ్‌పై ఆధారపడి ఉంటుంది. దాదాపు 8 రాష్ట్రాల పరిధిలోని ప్రాంతం అనగాఆంధ్రప్రదేశ్ఛత్తీస్గఢ్కేరళహిమాచల్ ప్రదేశ్జార్ఖండ్ఒడిశామధ్యప్రదేశ్ మరియు తమిళనాడులలోని 4.09 లక్షల హెక్టార్లు బీపీకేపీ పథకం కింద ఉన్నాయిప్రభుత్వం ఇప్పుడు బీజామృత్జీవామృత్నీమాస్త్రా మొదలైన పశువుల ఆధారిత సహజ వ్యవసాయ ఇన్పుట్ వ్యవసాయ ఉత్పత్తిపై తగిన దృష్టితో మిషన్ మోడ్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. 2023-24 బడ్జెట్ ప్రసంగంలో “రాబోయే 3 సంవత్సరాలలో, 1 కోటి మంది రైతులు సహజ వ్యవసాయాన్ని అవలంబించేలా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించిందిఇందుకోసం 10,000 బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను (బీఆర్సీలనుఏర్పాటు చేస్తారుస్థానిక పశువుల ఆధారిత సహజ వ్యవసాయ ఇన్పుట్ నిరంతర సరఫరా కోసం  BRCలను ఏర్పాటు చేస్తారు విషయాన్ని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక  లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 1941675) సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil