వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 5.45 లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా 80.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు

Posted On: 21 JUL 2023 3:33PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 2023 జూన్ 30 నాటికి, దాదాపు 80.10 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు [అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)- 8.95 కోట్లు; ప్రాధాన్యతా గృహాలు (పిహెచ్ హెచ్)- 71.15 కోట్లు]  5.45 లక్షల ఎఫ్ పిఎస్ ధరల షాపులు (5.45 లక్షల ఎఫ్ పిఎస్) షాపుల ద్వారా దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు పొందుతున్నారు. 
లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్) కంట్రోల్ ఆర్డర్ 2015 ప్రకారం, రేషన్ కార్డ్‌లు/లబ్దిదారుల జాబితా సమీక్ష, అనర్హులు/నకిలీ రేషన్ కార్డ్‌ల గుర్తింపు, అర్హులైన లబ్ధిదారులు/గృహాలను చేర్చడం సంబంధిత రాష్ట్ర/యూటీ ప్రభుత్వ బాధ్యత. నిజమైన లబ్ధిదారుల రేషన్ కార్డ్‌లు తొలగించకుండా/సస్పెండ్ కు గురికాకుండా  ప్రతి కేసు సరైన ధృవీకరణ (ఫీల్డ్ వెరిఫికేషన్‌తో సహా) చేపట్టాలని రాష్ట్రాలు/యూటీలకు సూచించింది. అంతేకాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ ) సీలింగ్ పరిమితి కింద రద్దు చేసిన రేషన్ కార్డ్‌ల స్థానంలో అర్హత ఉన్న కుటుంబాలు/లబ్దిదారులకు రాష్ట్రాలు/యూటీలు క్రమం తప్పకుండా కొత్త రేషన్ కార్డ్‌లను జారీ చేస్తాయి. దీని ప్రకారం, సంబంధిత రాష్ట్రం/యూటీ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) సీలింగ్ పరిమితిలోపు లబ్ధిదారుల సంఖ్యలో ఏదైనా మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాయి . 

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్)లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఈ సమాచారాన్ని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు, రాజ్యసభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

*****



(Release ID: 1941674) Visitor Counter : 109


Read this release in: English , Urdu , Marathi , Tamil