ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య రాష్ట్రాలలో రైలు, విమాన , రోడ్ నెట్వర్క్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు

నాడు పోస్టు చేయడమైనది: 20 JUL 2023 3:13PM by PIB Hyderabad
ఈశాన్య రాష్ట్రాలలో రైలు, విమాన, రోడ్డు నెట్వర్క్లను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి వివిధ నోడల్ మంత్రిత్వశాఖలు అందించిన సమాచారం కిందివిధంగా ఉంది.

రోడ్డు అనుసంధానత:
ఈశాన్య రాష్ట్రాలలో జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ),  జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్)  ద్వారా  సుమారు, రూ 1,02,594 కోట్ల రూపాయలు,
లను ఎం.ఒ.ఆర్.టి.హెచ్ కి చెందిన వివిధ పథకాల కింద 261 రోడ్డు ప్రాజెక్టులను మంజూరు అయ్యాయి.
దీనికితోడు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ , ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్) ,
ఈశాన్య రోడ్ సెక్టర్ డవలప్ మెంట్ పథకం కింద రూ 3372.58 కోట్ల రూపాయల విలువగల 77 రోడ్డు ప్రాజెక్టులను  మంజూరు చేసింది.
రైలు  అనుసంధానత:
పూర్తిగా, లేదా పాక్షికంగా ఈశాన్యరాష్ట్రాల పరిధిలో 19 రైల్వే ప్రాజెక్టులను సుమారు రూ 81,941 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. వీటి పొడవు సుమారు 1909  కిలోమీటర్లు. ఇవి ప్రణాళిక, అనుమతులు, అమలు కు సంబంధించి వివిధ దశలలో ఉన్నాయి.
వీటిలో 482 కిలోమీటర్ల పొడవుగల రైల్వేలైన్లపై  2023 మార్చినాటికి రూ 37,713 కోట్ల రూపాయలు  ఖర్చు చేశారు.
విమానయాన అనుసంధానత:
పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రాంతీయ అనుసంధానత పథకం (ఆర్.సి.ఎస్)–ఉడాన్ ( ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్) ను 21.10.2016 లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయంగా విమాన సేవల అనుసంధానతను  పెంచేందుకు  దీనిని తీసుకువచ్చారు.
ప్రజలు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసేందుకు వీలుగా ఇప్పటివరకూ విమాన సేవలు లేని ప్రాంతాలు, అంతగా విమాన సేవలులేని ప్రాంతాలకు దీనిని వర్తింప చేశాఉ.
 ఈశాన్య ప్రాంతంలో ఉడాన్ కింది 64 రూట్లలో విమాన సేవలు కార్యరూపం దాల్చాయి. వాటిలో రూప్సి, తేజు, తేజ్ పూర్, పాసిఘాట్, జోర్హాట్, లీలాబరి, షిల్లాంగ్, ప్యాక్యాంగ్, ఇటానగర్, దిమాపూర్ ఉన్నాయి.
ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో 16 విమానాశ్రయాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అదనంగా జిరో లో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ అందుబాటులోకి వచ్చింది. అరుణాచల్  ప్రదేశ్, అస్సాం, మణిపూర్ , మేఘాలయ, త్రిపుర
రాష్ట్రాలలో 13 ప్రధాన ఇంజినీరింగ్  మౌలికసదుపాయాల పనులు అందుబాటులోకి  వచ్చాయి.

దీనికితోడు,  ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ (ఎన్.ఇ.సి) కింద ఈశాన్య రాష్ట్రాలలో  రూ 4345.16 కోట్ల రూపాయల వ్యయంతో 51 ప్రాజెక్టులను రైలు, విమాన, రోడ్ నెట్ వర్క్ లకు సంబంధించిన ప్రాజెక్టులను మంజూరు చేశారు.. 2022–23, 2023–24

సంవత్సరాలలో మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కు చెందిన వ్యయ విభాగం ఈ కింది విధంగా ఈశాన్య రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి. 
 

 

2022‌‌–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద ఈశాన్య రాష్ట్రాలకు విడుదల చేసినది

 

రూ . కోట్ల లో

క్రమ

సంఖ్య

రాష్ట్రాలు

2022-23

2023-24

పార్ట్  1 కింద కేటాయింపు

ఆమోదించిన మొత్తం

విడుదల చేసిన మొత్తం

1

అరుణాచల్ ప్రదేశ్

1564.1047

1757

1254.8595

 

2

అస్సాం

4300.1400

3128

3128.0000

1514.8276

3

మణిపూర్

467.2205

716

 

 

4

మేఘాలయ

1049.0200

767

511.7500

 

5

మిజోరం

297.5000

500

399.2400

 

6

నాగాలాండ్

504.1600

569

569.0000

 

7

సిక్కిం

551.3600

388

387.6200

258.426254

8

త్రిపుర

349.7900

708

 

 

మొత్తం

9083.2952

8533

6250.4695

1773.253854

 

  కొత్త ప్రాజెక్టులుప్రారంభించడానికి ముందు అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ)ని చేపట్టడం జరుగుతోంది. అవసరమైన పరయావరణ అనుమతులను సంబంధిత ఏజెన్సీలు , మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రప్రభుత్వాలు పొందుతున్నాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.  కిషన్  రెడ్డి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 1941283) సందర్శకుల సూచీ సంఖ్య : : 111
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Manipuri , Tamil