ఉక్కు మంత్రిత్వ శాఖ
ఉక్కు రంగంలో, డీకార్బొనైజేషన అంశాలపై సహకారం కోసం ద్వైపాక్షిక చర్చలు నిర్వహించిన భారత్- జపాన్
తమ తమ నికర సున్నా లక్ష్యాలను సాధించడంలో సహకార ప్రాముఖ్యతను ధృవీకరించిన ఇరు పక్షాలు
Posted On:
20 JUL 2023 2:41PM by PIB Hyderabad
ఉక్కు రంగం, డీ కార్బొనైజేషన్కు సంబంధించిన అంశాలలో సహకారం కోసం చర్చించేందుకు గురువారం న్యూఢిల్లీలో జపాన ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిషిమురా యసుతోషీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింథియా ద్వైపాక్షిక చర్చలను నిర్వహించారు.
ఉక్కు రంగంలో ఆర్థిక వృద్ధితో పాటుగా తక్కువ కరబన పరివర్తనను అనుసరించే అంతర్లీన ప్రాథమిక సూత్రంతో, తమ దేశ పరిశ్రమ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే విధాన వైఖరిని అనుసరించవలసిన అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి. ఇరు పక్షాలూ కూడా ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో రెండు, మూడవ స్థానంలో భారత్, జపాన్‌లు ఉండటానని,ఈ కారణంగా ప్రపంచ ఉక్కు పరిశ్రమలో సహ ప్రయోజన భాగస్వాములుగా ఉండాలన్న అభిప్రాయాన్ని పంచుకున్నారు.
భారత దేశంలో జపాన్ స్టీలు ఉత్పత్తిదారుల పెట్టుబడి కార్యకలాపాల విస్తరణను గుర్తిస్తూ, ఇరు పక్షాలూ కూడా రెండు దేశాలకూ చెందిన ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సహాయ సహకారాలను ఇచ్చి పుచ్చుకోవాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ ఉక్కు పరిశ్రమ తగువిధంగా అభివృద్ధి చెందేందుకు దారి తీస్తుందనే భావనకు వచ్చారు.
ఉక్కు డీకార్బొనైజేషన్ మార్గాల వైవిధ్యతను గుర్తిస్తూ, తమ సంబంధిత నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి సహకార ప్రాముఖ్యతను ఇరు పక్షాలూ ధృవీకరించాయి. అటువంటి సహకారాన్ని కొనసాగించడానికి స్టీల్ డైలాగ్ సహా ఇతర సహకార కార్యక్రమాల ద్వారా తదుపరి చర్చలను జరపాలని 2023 నవంబరలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో ఇంధన సామర్ధ్యానని పెంచడం, ఉక్కు ఉత్పత్తిని డీకార్బొనైజ్ చేయడం కోసం వినూత్నసాంకేతికతలపై తగిన దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
***
(Release ID: 1941281)
Visitor Counter : 118