వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'రెసిన్ ట్రీటెడ్ కంప్రెస్డ్ వుడ్ లామినేట్స్స, 'ఇన్సులేటెడ్ ఫ్లాస్క్, సీసాలు, గృహ అవసరాల కోసం పాత్రల ' కోసం నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను (క్యూసీఓ) జారీ చేసిన డిపిఐఐటి
Posted On:
19 JUL 2023 2:25PM by PIB Hyderabad
గృహ అవసరాల కోసం ఇన్సులేటెడ్ ఫ్లాస్క్, సీసాలు, పాత్రలు, రెసిన్ ట్రీటెడ్ కంప్రెస్డ్ వుడ్ లామినేట్స్ (లక్కతో శుద్ధి చేసి పొరలుగా కుదించిన చెక్క) కోసం 2 కొత్త నాణ్యత నియంత్రణ ఆదేశాలను (క్యూసిఒలు) వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) 14 జులై 2023న జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ఆరు నెలలకు ఈ క్యూసీఒలు అమలులోకి వస్తాయి. భారతదేశంలో నాణ్యత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అదనంగా, ఈ క్యూసీఓలు వినియోగదారుల పరిరక్షణ, ప్రజా ఆరోగ్యానికి హామీ ఇస్తాయి.
దేశీయ మార్కెట్టు కోసం తయారు చేసినవి లేదా భారతదేశంలోకి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల కోసం రెసిన్ ట్రీటెడ్ కంప్రెస్డ్ వుడ్ లామినేట్స్ (కంప్రెగ్స్)- ఎలక్ట్రికల్, కెమికల్, సాధారణ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన క్యూసీఓలు ఐఎస్ ప్రమాణాలకింద నిర్బంధ
సర్టిఫికేషన్‌ను, ధృవీకరణను తప్పనసరి చేస్తాయి.
అలాగే, భారత్‌కు దిగుమతి చేసుకున్నలేదా దేశీయ మార్కెట్టు కోసం తయారు చేసిన ఉత్పత్తులు, గృహ వినియోగం కోసం ఇన్సులేటెడ్ ఫ్లాస్కు, సీసాలు, పాత్రలకు సంబంధించిన క్యూసిఒ గృహవినియోగం కోసం ఇన్సులేటెడ్ ఫ్లాస్కు, స్టెయిన్‌లెస్ స్టీల్ వాక్యూమ్ ఫ్లాస్కు/ బాటిల్, ఆహారపు నిల్వ కోసం ఇన్సులేటెడ్ పాత్రలకు ఐఎస్ ప్రమాణాల కింద సర్టిఫికేషన్‌ను, ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది.
నాణ్యమైన ఉత్పత్తుల తయారు చేయవలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ, ప్రజల సామర్ధ్యం, దేశ విశ్వసనీయత కారణంగా అత్యున్నత నాణ్యత కలిగిన భారతీయ ఉత్పత్తులు సుదూర తీరాలకు ప్రయాణిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచ శ్రేయససు కోసం శక్తి గుణికం అయిన ఆత్మనిర్భర్ భారత్ తత్వానికి ఇది నిజమైన నివాళి అవుతుందని ఆయన అన్నారు.
దీనికి అనుగణంగా, దేశంలో నాణ్యత నియంత్రణ విధానాన్ని ఏర్పాటు చేసే మిషన్ మోడ్‌లో డిపిఐఐటి ఉంది. వాడకందార్లలోనూ, ఉత్పత్తిదారులలోనూ ఒకేరకంగా నాణ్యతా అవగాహన, సున్నితత్వాన్ని అభివృద్ధి చేసేందుకు క్యూసిఒ అభివృద్ధి సహా పలు చొరవలను డిపార్ట్‌మెంట్ తీసుకుంటోంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ప్రమాణాలు స్వభావరీత్యా స్వచ్ఛందమైనవి కాగా, క్యూసిఒ తప్పనిసరి సర్టిఫికేషన్ పథకం, దీని ద్వారా సంబంధిత ఉత్పత్తికి వర్తించే నిర్ధిష్ట భారతీయ ప్రామాణాల జాబితాకు కట్టుబడి ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నాణ్యతలేని ఉత్పత్తులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడాన్నినివారించడం, అనుచిత వాణిజ్య పద్ధతులను నిరోధించడం, మానవ, జంతు లేదా వృక్షజాల ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణకు దేశీయంగా తయారు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం క్యూసిఒను నోటిఫై చేయడంలోని లక్ష్యం.
క్యూసీఓలు దేశంలోని ఉత్పాదక నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరచడమే కాక, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల బ్రాండ్‌ను, విలువను పెంచుతాయి. నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలల అభివృద్ధి, ఉత్పత్తి మాన్యువళ్ళతో కలిసి ఈ చొరవలు భారతదేశంలో నాణ్యతా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో తోడ్పడతాయి.
బిఐఎస్‌తో నిరంతరం డిపిఐఐటి సంప్రదింపులలో ఉంటూ, 317 ఉత్పత్తి ప్రమాణాలను ఆవరిస్తూ 64 కొత్త క్యూసిఒల అభివృద్ధికి దారితీసేలా చేసింది. ప్రతి క్యూసిఒ విషయంలోనూ కీలక పారిశ్రామిక అసోసియేషన్లు, పరిశ్రమ సభ్యులతోనూ విస్త్రతంగా వాటాదారుల సంప్రదింపులను జరుపుతూ వారి ఇన్‌పుట్లను/ అభిప్రాయాలను తెలుసుకున్నారు.
పరిశ్రమల నుంచి వచ్చిన అభిప్రాయాలను జోడించిన తర్వాత ముసాయిదా క్యూసీఒలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆమోదముద్ర వేయగా, శాసనవ్యవహారాల విభాగం దానిని చట్టపరమైన పరిశీలనను చేసింది. ఆ తర్వాత క్యూసీఓలను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఒ) వెబ్‌సైట్‌పై డబ్ల్యుటిఒ సభ్య దేశాల నుంచి వ్యాఖ్యాల కోసం అప్‌లోడ్ చేసి 60 రోజుల పాటు ఉంచారు.
దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పరిరక్షించేందుకై, క్యూసీఒలు సజావుగా అమలు చేయడం, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడం కోసం, క్యూసిఒల అమలు కసం కాలక్రమం పరంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సడలింపులు మంజూరు చేయడం జరిగింది.
క్యూసీఓల అమలుతో, బిఐఎస్ చట్టం, 2016 కింద బిఐఎస్ యేతర సర్టిఫైడ్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకాలను నిషేధితమవుతాయి. బిఐఎస్ చట్టంలోని అంశాన్ని ఉల్లంఘిస్తే, రెండేళ్ళ జైలు శిక్ష లేదా తొలి నేరానికి రూ. 2 లక్షలవరకు జరిమానా విధించవచ్చు. రెండవసారి, ఆ తర్వాత జరిగే ఉల్లంఘనలకు జరిమానా కనీసం రూ.5 లక్షల నుంచి ప్రారంభమై, గరిష్టంగా వస్తువుల విలువకు పదిరెట్లుగా ఉండవచ్చు.
ముందు పేర్కొన్న చొరవలతో భారత దేశంలో నాణ్యత కలిగిన ప్రపంచస్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలన్నది భారత ప్రభుత్వం లక్ష్యం. తద్వారా ఆత్మనిర్భర్ భారత్‌ను సృష్టించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను నెరవేర్చవచ్చు.
***
(Release ID: 1941001)
Visitor Counter : 117