శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ: క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్స్ పై ప్రతిపాదనలకు సంయుక్తంగా పిలుపు ఇచ్చిన భారత్- , అమెరికా


ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత సైన్స్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి; ద్వైపాక్షిక సమగ్ర, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయం ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు: డాక్టర్ జితేంద్ర సింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు మన దైనందిన జీవితంలో పరివర్తనాత్మక పురోగతికి దారితీస్తాయి; ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మరెన్నింటినో ప్రభావితం చేయడం ద్వారా మన సామాజిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి; ఎండోమెంట్ ఫండ్ తో ఎంతో మార్పు సామర్ధ్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 18 JUL 2023 3:43PM by PIB Hyderabad

అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్ ఎం గ్రాన్హోమ్ ఢిల్లీ లోని నార్త్ బ్లాక్ లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి

(స్వతంత్ర హోదా) , పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.

 

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. జెన్నిఫర్ వెంట ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధి బృందం కూడా ఉంది.

 

క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ: క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ పై  ప్రతిపాదనలకు భారత్, అమెరికా సంయుక్తంగా పిలుపు ఇచ్చాయి. ఇండో-యు.ఎస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం (ఐ యు ఎస్ ఎస్ టి ఎఫ్), సెక్రటేరియట్ ఫర్ యు ఎస్ ఐ ఎస్ టి ఇ ఎఫ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాయి.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కాంపిటీటివ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా, యు ఎస్ ఐ ఎస్ టి ఇ ఎఫ్  వాణిజ్యపరంగా ఆచరణీయమైన , సామాజిక సంబంధిత ఉమ్మడి యుఎస్-ఇండియా టెక్నాలజీ ఆవిష్కరణ , వ్యవస్థాపక చొరవలను ఎంపిక చేస్తుం దని, వాటికి మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ సంయుక్త కార్యక్రమాలు స్టార్టప్ లు, ప్రభుత్వం, అకడమిక్ లేదా వాణిజ్య ప్రయత్నాలతో సహా యుఎస్ , భారతీయ సంస్థల నుండి ఉద్భవించగలవని, అనువర్తిత ఆర్ అండ్ డి పైన దృష్టి పెట్టి వ్యాపార ప్రణాళిక , వాణిజ్య భావన , గణనీయమైన స్థిరమైన వాణిజ్య సామర్థ్యాన్ని కలిగి ఉండాలని ఆయన అన్నారు.

 

ద్వైపాక్షిక సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయాన్ని నొక్కిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నేతల నిర్ణయాన్ని అమలు స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా దేశాలు త్వరితగతిన సన్నద్ధమవడం సంతోషంగా ఉందన్నారు.

 

ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (అమెరికా - ఇండియా) సంబంధంలో కొత్త దిశ , కొత్త శక్తితో భవిష్యత్తు కోసం సాంకేతిక భాగస్వామ్యాన్ని ఈ నిమగ్నత రూపొందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీల సంయుక్త అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం యూఎస్-ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్ (యు ఎస్ ఐ ఎస్ టి ఇ ఎఫ్ ) కింద 20 లక్షల డాలర్ల గ్రాంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడాన్ని అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ స్వాగతించడం హర్షణీయమని,  భారత్ లో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్ పీ సి)  సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం హర్షణీయమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

శాస్త్రీయ , పారిశ్రామిక పరిశోధన , అభివృద్ధికి బీజం వేయడం, పోషించడం, పెంచడం, క్వాంటమ్ టెక్నాలజీ (క్యు టి) లో శక్తివంతమైన , సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో భారతదేశం ఇటీవల నేషనల్ క్వాంటమ్ మిషన్ (ఎన్ క్యు ఎం ) ను ఆమోదించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కృత్రిమ మేధకు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని, ఆర్థికాభివృద్ధికి అపారమైన అవకాశాలను అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు మన దైనందిన జీవితంలో పరివర్తనాత్మక పురోగతికి దారితీస్తాయని, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పులు,  మరెన్నింటినో ప్రభావితం చేయడం ద్వారా మన సామాజిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఎండోమెంట్ ఫండ్ పరివర్తన సామర్థ్యాన్ని ఆయన స్వాగతించారు.

 

వాణిజ్యపరంగా ఆచరణీయమైన, సామాజిక సంబంధితమైన ఇండో-అమెరికా  సంయుక్త సాంకేతిక ఆవిష్కరణ వ్యవస్థాపక ప్రతిపాదనల కోసం ఈ ఆహ్వానం గడువు ఆగస్టు 31, 2023 వరకు ఉంటుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి) వివిధ కోణాలను చూసే భారత, అమెరికా ప్రాధాన్యతలకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

 

***


(Release ID: 1940599) Visitor Counter : 207