వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
“భారత్ దాల్” పేరిట సబ్సిడీ ధరలతో శనగ పప్పు విక్రయం ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్; రూ.60కి కిలో ప్యాక్, కిలో రూ.55కి 30 కిలోల ప్యాక్ విడుదల
Posted On:
17 JUL 2023 5:45PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహరం, ప్రభుత్వ పంపిణీ, టెక్స్ టైల్, వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సబ్సిడీ ధరలకు శనగపప్పు విక్రయాన్ని ప్రారంభించారు. “భారత్ దాల్” బ్రాండ్ తో విడుదల చేసిన శనగపప్పు కిలో ప్యాక్ రూ.60కి, 35 కిలోల ప్యాక్ కిలో రూ.55 ధరకు విధుల చేశారు.
జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) ఢిల్లీ-ఎన్ సి ఆర్ లలో రిటైల్ స్టోర్ల ద్వారా సబ్సిడీ శనగ పప్పు విక్రయిస్తోంది. పప్పులు సగటు వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవే “భారత్ దాల్” విక్రయం.
జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్) శనగ పప్పు మిల్లింగ్, ప్యాకేజింగ్ చేపడితే ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్, సఫల్ రిటైల్ స్టోర్ల ద్వారా ఢిల్లీ-ఎన్ సి ఆర్ లలో విక్రయిస్తారు. అలాగే సంక్షేమ పథకాల కింద సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు, జైళ్ల శాఖలకు, వినియోగదారుల సహకార సంఘాలకు కూడా శనగ పప్పు అందుబాటులో ఉంచుతారు.
శనగ మన దేశంలో పుష్కలంగా ఉత్పత్తి చేసే పప్పు దినుసు. దీన్ని పలు రకాల్లో వినియోగిస్తారు. శనగను నానబెట్టి, ఉడకబెట్టి సలాడ్ గాను, శనగను వేయించి స్నాక్ గాను విక్రయిస్తారు. వేయించిన శనగ పప్పును కంది పప్పు ప్రత్యామ్నాయంగా కూరలు, సూప్ లలో వినియోగిస్తారు. కారం, తీపి పిండి వంటల్లో ముడి పదార్థంగా శనగ పిండిని వినియోగిస్తారు. శనగకు పోషకాహార విలువలు కూడా ఉన్నాయి. అందులో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ బి, సెలీనియం బీటా కెరోటిన్, చోలిన్ ఉన్నాయి. రక్త హీనత, రక్తంలో చక్కర అదుపులో ఉంచడానికి; ఎముకలు, మానసిక ఆరోగ్యానికి శనగ ఉపయోగపడుతుంది.
***
(Release ID: 1940383)
Visitor Counter : 166