రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీకి విచ్చేసిన అర్జెంటీనా రిపబ్లిక రక్షణ మంత్రి; ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ సింగ్‌తో చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
17 JUL 2023 5:22PM by PIB Hyderabad
భారత్‌లో నాలుగు రోజుల పర్యటన కోసం అర్జెంటీనా రిపబ్లిక్ రక్షణ మంత్రి శ్రీ జార్జ్ ఎనిరిక్ టియానా 17 జులై 2023 న్యూఢిల్లీకి విచ్చేశారు. తన పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్‌తో 18 జులై 2023న ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం, సంఘటితం చేయడం కోసం శ్రీ జార్జ్ టియానా ద్వైపాక్షిక చర్చలను నిర్వహించనున్నారు. పర్యటనలో ఉన్న మంత్రి న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ లో పుష్ప గుచ్ఛాలను ఉంచి, మరణించిన వీరులకు నివాళులు అర్పించనున్నారు.
తన పర్యటన సందర్భంగా అర్జెంటీనా రక్షణ మంత్రి బెంగళూరును కూడా సందర్శించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 1940377)
సందర్శకుల సూచీ సంఖ్య : : 167