రక్షణ మంత్రిత్వ శాఖ
మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో ప్రారంభం కానున్న భారత్ - మంగోలియా ఉమ్మడి సైనిక విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ -2023
Posted On:
16 JUL 2023 9:56AM by PIB Hyderabad
దాదాపు 43 సిబ్బందితో కూడిన భారతీయ సైనిక దళం మంగోలియాకు బయలుదేరి వెళ్ళింది. అక్కడ జరుగనున్న ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసం 15వ ఎడిషన్ నొమాడిక్ ఎలిఫెంట్ -23లో పాలుపంచుకోనుంది. ఈ విన్యాసాలను 17 జులై నుంచి 31 జులై 2023వరకు మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం మంగోలియాతో కలిసి నిర్వహించే శిక్షణా కార్యక్రమం. దీనిని మంగోలియాలోనూ, భారత్‌లోనూ ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తారు. గత ఎడిషన్‌ను అక్టోబర్ 2019లో బాక్లో స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్‌లో నిర్వహించారు.
మంగోలియా సాయుధ దళాల యూనిట్ 084, జమ్ము &కాశ్మీర్ లైట్ ఇన్‌ఫ్రాంట్రీ రెజిమెంట్‌కు చెందిన భారతీయ సైనికులు ఈ విన్యాసంలో పాలుపంచుకుంటున్నారు. భారతీయ సైన్యం 16 జులై 23న భారతీయ వైమానిక దళానికి చెందిన సి-17 విమానంలో ఉలాన్‌బాతర్‌కు చేరుకుంది. ఇరు సైన్యాల మధ్య సానుకూల సైనిక సంబంధాలను, ఉత్తమ ఆచరణలను ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పర కార్యాచరణను అభివృద్ధి చేయడం, స్నేహం, సౌహార్ద్రతను పెంపొందించడం ఈ విన్యాసాల లక్ష్యం. ఐక్యరాజ్య సమితి నిర్దేశాల ప్రకారం పర్వత ప్రాంతాలలో పర్వత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఈ విన్యాసాల ప్రాథమిక ఇతివృత్తం దృష్టిపెడుతుంది.
ఈ విన్యాసాల పరిధిలో ప్లెటూన్ స్థాయి క్షేత్ర శిక్షణా విన్యాసం (ఎఫ్‌టిఎక్స్) ఉంటుంది. ఈ విన్యాసాల సందర్భంగా, భారతీయ, మంగోలియా దళాలు తమ నైపుణ్యాలను, సామర్ధ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన వివిధ శిక్షణా కార్యకలాపాలలో పాల్గొంటారు. ఈ కార్యకలాపాలలో సహనశీలత శిక్షణ, ప్రతిక్రియ కాల్పులు, రూం ఇంటర్వెన్షన్, చిన్నదళాల విన్యాసాలు, ఎత్తుగడలు, రాక్ క్రాఫ్ట్ శిక్షణ ఉంటాయి. ఇరువురి కార్యకలాపాల అనుభవాల నుంచి ఇరు పక్షాలకు చెందిన సైనికులు నేర్చుకుంటారు.
ప్రాంతీయ భద్రత, సహకారం పట్ల భారత్, మంగోలియాలు ఉమ్మడిగా కట్టుబడి ఉన్నాయి. నొమాడిక్ ఎలిఫెంట్ -23 విన్యాసాలు భారతీయ సైన్యం, మంగోలియా సైన్యపు రక్షణ సహకారంలో మరొక ప్రముఖ మైలురాయి. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచి పోషిస్తుంది.
***
(Release ID: 1940174)
Visitor Counter : 244