సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉధంపూర్ సెక్టార్‌లో పూర్వపు ఉధంపూర్ జిల్లాలో భాగమైన కత్రా, రియాసిలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్వదేశ్ యోజన కింద రూ. 190 కోట్ల నది దేవిక పునరుజ్జీవన ప్రాజెక్ట్ అలాగే రూ. 100 కోట్ల మంటలై ప్రాజెక్ట్, సుధ్ మహదేవ్, సురిన్సర్ మొదలైనవి మన్సార్ సరస్సు ద్వారా సమగ్ర అభివృద్ధితో ఓ ప్రత్యేకమైన మతపరమైన పర్యాటక సర్క్యూట్‌ను అందించబోతోంది : డా. జితేంద్ర సింగ్
దేశంలో మతపరమైన యాత్రా సౌలభ్యం మరియు మతపరమైన పర్యాటక పునరుద్ధరణ కోసం మొదటిసారిగా మతపరమైన పర్యాటక ప్రదేశాల సంరక్షణ మరియు అభివృద్ధి చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో సాధ్యమైంది: డాక్టర్ జితేంద్ర సింగ్
జమ్మకశ్మీర్‌లో మతపరమైన పర్యాటకానికి ప్రోత్సాహించేందుకు ఢిల్లీ కత్రా ఎక్స్‌ప్రెస్ హైవే, చారిత్రాత్మకమైన కామాఖ్య (అస్సాం) నుండి కత్రా
(వైష్ణో దేవి) రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రధాని నరేంద్ర మోదీ అందించిన ఉత్తమ బహుమతులు అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
ప్రసాద్ పథకం కత్రా వైష్ణో దేవితో పాటు భారతదేశంలో మతపరమైన పర్యాటక అభివృద్ధికి మరియు ప్రమోషన్‌కు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 JUL 2023 5:18PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మాట్లాడుతూ " ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రత్యేకించి ఉధంపూర్ సెక్టార్‌లో కత్రా మరియు రియాసి కూడా ఒక ప్రత్యేకతను అందించబోతోంది. రూ. 190 కోట్ల రివర్ దేవికా పునరుజ్జీవన ప్రాజెక్ట్, రూ. 100 కోట్ల మంటలై ప్రాజెక్ట్, స్వరాజ్య యోజన కింద మన్సార్ సరస్సు, సుధ్ మహదేవ్, సురిన్సర్ మొదలైన వాటి ద్వారా సమీకృత అభివృద్ధితో మతపరమైన పర్యాటక సర్క్యూట్ రూపుదిద్దుకుంటోంది" అని చెప్పారు.
ఉధంపూర్ జిల్లా యంత్రాంగంతో మంతలైలో జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు.
నేటి సమావేశం వేదికగా ఉన్న మంటలై ప్రాజెక్ట్ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ..ఈ ప్రాజెక్టును మొదటగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి యోగగురువుగా ఉన్న దివంగత ధీరేంద్ర బ్రహ్మచారి ప్రారంభించారని మరియు భూమిని లీజుకు తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రాజెక్ట్ మధ్యలో ధీరేంద్ర బ్రహ్మచారి విమాన ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించారు మరియు అప్పటి నుండి వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనికి శ్రద్ధ చూపలేదు మరియు దానిని శిథిలావస్థకు మార్చాయి. అయితే, 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రాజెక్టు పునరుద్ధరించబడిందని, ఇప్పుడు ఈ ప్రదేశంలో అత్యాధునిక వెల్‌నెస్ సెంటర్ కమ్ టూరిస్ట్ రిసార్ట్ వచ్చిందన్నారు. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోకుండా ఉండిపోయిన దేవిక నది కూడా ఇదే విధంగా ఉంది మరియు మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా నదీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ దేవిక నది పునరుద్ధరణ మరియు సుందరీకరణ కోసం ఆమోదించబడిందని చెప్పారు.
ఇంకా వివరిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పవిత్ర పట్టణమైన కత్రా వైష్ణో దేవికి 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైల్వే స్టేషన్ వచ్చిందని, ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం జాతీయ ప్రసాద్ పథకంలో చేర్చబడిందని అన్నారు. అంతేకాకుండా అంతర్ మోడల్ స్టేషన్, సుద్మహదేవ్ పవిత్ర ప్రదేశం కూడా 2014 తర్వాత మాత్రమే దృష్టిని ఆకర్షించింది మరియు ఇప్పుడు కనెక్టివిటీని సులభతరం చేయడానికి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి నిర్మాణంలో ఉందని వివరించారు. మంటలై మరియు మన్సార్‌లు ఇప్పటికే అధికారిక టూరిస్ట్ సర్క్యూట్‌లో చేర్చబడుతుండగా, శివ ఖోరీ కూడా రాబోయే కాలంలో దానిలో భాగమవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
కిష్త్వార్ జిల్లాలోని తీర్థయాత్ర మచైల్ యాత్రలో కనీస సౌకర్యాలు లేవని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. గత 9 సంవత్సరాలలో యాత్రలో టాయిలెట్లు మరియు మొబైల్ టవర్లు అందించబడ్డాయని మరియు విద్యుత్ సరఫరా లేనప్పుడు ప్రత్యేకమైన సోలార్ పవర్ ప్లాంట్ కూడా అందించబడిందని చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం దేశంలోని పురాతన మతపరమైన పర్యాటక ప్రదేశాల నిధితో ఆశీర్వదించబడిందని, ఈ మతపరమైన పర్యాటక ప్రదేశాలను సులభంగా సంరక్షించడం మరియు అభివృద్ధి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో సాధ్యమైందని అన్నారు. అలాగే దేశంలో మతపరమైన తీర్థయాత్ర మరియు మతపరమైన పర్యాటక పునరుద్ధరణ జరుగుతోందని వివరించారు.
ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతంగా ఉందని, దేశంలోనే అత్యుత్తమంగా అనుసంధానించబడిన నియోజకవర్గమని, గత తొమ్మిదేళ్లలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీ కత్రా ఎక్స్‌ప్రెస్ హైవే, చారిత్రాత్మకమైన కామాఖ్య (అస్సాం) నుండి కత్రా (వైష్ణో దేవి) రైలు 2,000 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, రెండు ముఖ్యమైన మతపరమైన గమ్యస్థానాలను కలుపుతోందని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటవి జమ్మూ మరియు కాశ్మీర్‌లో మతపరమైన పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన ఉత్తమ బహుమతులలో ఒకటని డాక్టర్ జితేంద్ర సింగ్ జోడించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మతపరమైన పర్యాటక సర్క్యూట్ ఈ ప్రాంత అభివృద్ధి మరియు పురోగతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాత్రికులు ఈ మతపరమైన ప్రదేశాలను సందర్శించాలన్న ఆకాంక్షను కలిగి ఉన్నారని చెప్పారు. భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాలను సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సౌకర్యవంతమైన నెట్‌వర్క్‌తో అనుసంధానించాలనే ఆలోచనను ముందుకు తెచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
ప్రసాద్ స్కీమ్ 'తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్' తీర్థయాత్రలను ప్రాధాన్యతాబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఏకీకృతం చేయడం ద్వారా పూర్తి మతపరమైన పర్యాటక అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్నఈ పథకం ద్వారా మతపరమైన పర్యాటకం ఏర్పడిందని తెలిపారు. ఉధంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం దీనికి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు.
ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ఈ మతపరమైన పర్యాటక ప్రదేశాల్లో పనులను వేగవంతం చేయాలని డాక్టర్ సింగ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
***
(Release ID: 1940092)
Visitor Counter : 159