హోం మంత్రిత్వ శాఖ
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్ఎఫ్) కింద హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 180.40 కోట్ల తదుపరి విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
2023-24 సంవత్సరంలో 27 రాష్ట్రాలకు ఎస్‌డిఆర్ఇఎఫ్ కేంద్ర వాటాగా ఇప్పటికే రూ. 10,031.20 కోట్లను విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం
Posted On:
14 JUL 2023 6:51PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్‌కు తాత్కాలిక ఉపశమనంగా 2023-24 సంవత్సరానికి రూ. 180.40 కోట్ల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్ఎఫ్)రెండవ విడత కేంద్ర వాటా ముందస్తు విడుదలకు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం తెలిపారు. ఈ రాష్ట్రంలో వాన, వరదలతో ప్రభావితమైన ప్రజలకు తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్‌డిఆర్ఎఫ్ నుంచి 10 జులై 2023న తక్షణ ఉపశమన చర్యల కోసం రూ. 180. 40 కోట్ల కేంద్రవాటాలోని తొలి విడతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రస్తుత వర్షాకాలంలో ప్రభావితమైన ప్రజలకు సహాయక చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు తోడ్పడతాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు/ వరదలు, క్లౌడ్ బరస్ట్ (హఠాత్ భారీ వానలు), కొండచరియలు విరిగిపడటం వల్ల నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు, వాటిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన లాజిస్టిక్, ఆర్ధిక సహాయాన్ని భారత ప్రభుత్వం అందించింది. రక్షణ కార్యకలాపాల కోసం రక్షక పడవలు, అవసరమైన పరికరాలతో 11 ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. పౌరులను ఖాళీ చేయించి, సురక్షిత స్థానాలకు తరలించేందుకు పావొంతా సాహిబ్ వద్ద 01 కాలమ్ 1 పారా ఎస్ఎఫ్‌ను & 205 సైనిక వైమానిక దళాన్ని మోహరించారు. పౌరులను తరలించేందుకు రెండు ఎంఐ-17వి5 హెలికాప్టర్లను మోహరించారు.
పరిస్థితిని అక్కడిక్కడ అంచనా వేసేందుకు, హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాలు (ఐఎంసిటిలు)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఎంసిటి తన క్షేత్ర పర్యటనలను 17 జులై 2023 నుంచి ప్రారంభించనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో 27 రాష్ట్రాలకు ఎస్‌డిఆర్ఇఎఫ్ కేంద్ర వాటాగా ఇప్పటికే రూ. 10,031.20 కోట్లను విడుదల చేసింది.
***
(Release ID: 1939751)