ఆయుష్
azadi ka amrit mahotsav

సుశ్రుత జయంతి సందర్భంగా మూడు రోజుల సెమినార్‌ను నిర్వహించిన ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద


పలు ప్రత్యక్ష శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నఏఐఐఏలోని శల్య తంత్ర విభాగం

Posted On: 14 JUL 2023 9:29PM by PIB Hyderabad

ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) సుశ్రుత జయంతి-2023 సందర్భంగా 13-15 జూలై 2023 జులై 13 నుండి 15 వరకు మూడు రోజుల సెమినార్‌ను నిర్వహిస్తోంది. శస్త్రచికిత్స పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన సుశ్రుతుని స్మరించుకుంటూ సుశ్రుత జయంతిని ప్రతి సంవత్సరం జూలై 15న జరుపుకుంటారు. ఈ విశేషమైన వ్యక్తిని, శస్త్రచికిత్స రంగంలో ఆయన చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకోవడానికి, ఏఐఐఏ శల్యతంత్ర విభాగం "శల్యకాన్" అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సెమినార్ సందర్భంగా జూలై 13, 14 తేదీల్లో లైవ్ సర్జికల్ ప్రదర్శన జరిగింది. సెషన్ మొదటి రోజు, లాపరోస్కోపిక్ సర్జరీ, జనరల్ సర్జికల్ విధానాలతో సహా తొమ్మిది ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలు జరిగాయి. ఇది ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రదర్శనలను చూసేందుకు, నేర్చుకునేందుకు పాల్గొనేవారిని అనుమతించింది. అదనంగా, ఒక సైంటిఫిక్ సెషన్ పరిశోధకులు, నిపుణుల కోసం వారి పరిజ్ఞానాన్ని, అంతర్దృష్టులను పంచుకోవడానికి ఒక వేదికను అందించింది, దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. సెషన్ రెండవ రోజు 13 ప్రత్యక్ష శస్త్రచికిత్సలు జరిగాయి.

ఏఏఐఎం (భారతీయ సంగ్యహారక్ అసోసియేషన్, వారణాసి)తో కలిసి నిర్వహించిన శల్య తంత్రం, సంగ్యాహరణ్ పై జాతీయ సెమినార్ జూలై 13న ప్రారంభమైంది. జూలై 15 వరకు కొనసాగుతుంది. ఈ సెమినార్ సుశ్రుత జ్ఞానం, అభ్యాసాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగ వచ్చిన 180 మంది పాల్గొన్నారు. 

ఎన్సిఐఎస్ఎం ఛైర్‌పర్సన్ డా. దేవపూజారి జయంత్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు, రాష్ట్రీయ శిక్షణ మండల్, పూణె డా. దిలీప్ పురాణిక్,  వైస్ ఛాన్సలర్, గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం, జామ్‌నగర్, డాక్టర్ ముకుల్ పటేల్  ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్. తనూజా నేసరి (డైరెక్టర్ ఏఐఐఏ), ప్రొఫెసర్ డాక్టర్ యోగేష్ బద్వే, శల్యతంత్ర ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. 

 

******


(Release ID: 1939747) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Marathi