ఆయుష్
azadi ka amrit mahotsav

గోవాలో ఆయుష్ ఆరోగ్య సేవలు, పరిశోధన సౌకర్యాలు ప్రారంభం


సంప్రదాయ వైద్య విధానానాలను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్ ఆరోగ్య సేవలు, పరిశోధన సౌకర్యాలు ఏర్పాటు

Posted On: 14 JUL 2023 4:01PM by PIB Hyderabad

గోవాలోని రిబందర్‌లో ఆయుష్ ఆరోగ్య సేవలు, పరిశోధన సౌకర్యాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది. స్థానిక ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన ఆయుష్ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఖనిజ, సముద్ర మూలాలు ఉన్న ఔషధాలపై పరిశోధన చేపట్టడానికి మ్యూజియం, గ్రంథాలయం, ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

రిబందర్‌లో ఆయుష్ ఆరోగ్య సేవలు, పరిశోధన సౌకర్యాలను గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో  కేంద్ర ఆయుష్ , ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు,  పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్, గోవా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ విశ్వజిత్ రాణే ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో  కేంద్ర ఆయుష్ ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడారు. సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించాలన్న   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా గోవాలో  ఆయుష్ ఆరోగ్య సేవలు  ప్రారంభించామన్నారు ప్రాచీన వైద్య శాస్త్రం ద్వారా సమాజ సంక్షేమం సాధించవచ్చునని అన్నారు. ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక ద్వారా   అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందన్నారు. 

 గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ప్రాచీన వైద్యంలో ఆయుష్  ఒక విశిష్టమైన వ్యవస్థ అని అన్నారు. 2014లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రాచీన వైద్యం విధానం ప్రాధాన్యత గుర్తించారని అన్నారు. గోవా రాష్ట్రంలో పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఆయుష్ హెల్త్‌కేర్ హబ్‌గా గోవా మారుతుందన్నారు. 

కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు,పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ   ఆధునిక వైద్య విధానంతో సంప్రదాయ వైద్య విధానాన్ని  ఏకీకరణ చేయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.   . పరిశోధనలను ప్రోత్సహించడానికి, ప్రతి గ్రామానికి ఆయుష్‌ను తీసుకెళ్లడానికి తమ శాఖ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.  ప్రజలు ఆయుష్ సేవలు పూర్తిగా పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఆరోగ్య సంరక్షణ  పరిశోధన కేంద్రంలో  CCRAS – మినరల్ అండ్ మెరైన్ మెడిసినల్ రిసోర్సెస్  ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, CCRH – క్లినికల్ రీసెర్చ్ యూనిట్ (హోమియోపతి), CCRS - సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్, CCRYN - క్లినికల్ రీసెర్చ్ యూనిట్, CCRUM – యునాని స్పెషాలిటీ క్లినిక్ ఏర్పాటు చేశారు.దీనిలో ఓపీడీ,, డిస్పెన్సరీ, పంచకర్మ, ప్రయోగశాల కోసం సౌకర్యాలు కల్పించారు. 

 రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆరోగ్య సంరక్షణ  పరిశోధన కేంద్రంలో నెలకొల్పిన సంస్థలు పని చేస్తాయి.  మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రముఖ  సంస్థలతో కలిసి   సంప్రదాయ వైద్య వ్యవస్థలో పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక వైద్య విధానంతో కలిపి  ఆయుష్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆవిష్కరణలనుప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

***


(Release ID: 1939556) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi , Tamil