నౌకారవాణా మంత్రిత్వ శాఖ

నౌకాయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు వైవిధ్యత కలిగిన అంతర్జాతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ‘సాగర్ సంపర్క్’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్


నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలుగా మరింత ఖచ్చితమైన మార్గసూచీని తెలిపే విధంగా ఈ మేడ్ ఇన్ ఇండియా వ్యవస్థ ఉపకరిస్తుంది.

సాగర్ సంపర్క్ వైవిధ్యభరిత అంతర్జాతీయయ నౌకాయాన మార్గ సూచీ ఉపగ్రహ వ్యవస్థ 6 ప్రాంతాలలో ప్రారంభించడం వల్ల,
ఇది సముద్ర మార్గ ప్రయాణానికి సంబంధించి డిజిఎల్ఎల్ సామర్ధ్యాన్ని పెంచుతుంది: శ్రీశర్వానంద్ సోనోవాల్

Posted On: 12 JUL 2023 5:35PM by PIB Hyderabad

భారత నౌకాయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు , వినూత్న ఆవిష్కరణలు, అత్యుత్తమ మౌలికసదుపాయాల కల్పనకు భారత పోర్టులు, నౌకాయాన, జలమార్గ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ  మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ ,నౌకాయాన రంగంలో వైవిధ్యతో కూడిన అంతర్జాతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (డిజిఎన్ఎస్ఎస్) సాగర్ సంపర్క్ను కేంద్ర పోర్టులు,
షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయంత్రి  శ్రీ శ్రీపాద యశో నాయక్ , పోర్టులు, షిప్పింగ్ , జలమార్గాల శాఖ కార్యదర్శి     శ్రీ టి.కె.రామచంద్రన్  లైట్ హౌస్లు, లైట్ షిప్ల డైరక్టరేట్ జనరల్ , మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల సమక్షంలో ప్రారంభించారు.
డిజిఎన్ ఎస్ ఎస్  అనేది టెరెస్ట్రియల్ ఆధారిత వ్యవస్థ. ఇది అంతర్జాతీయయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ(జిఎన్ ఎస్ ఎస్)లో దోషాలు, లోపాలను సవరించి  మరింత ఖచ్చితత్వంతో కూడిన పొజిషినింగ్ సమాచారాన్ని అందిస్తుంది.
 ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ శర్వానంద్ సోనోవాల్,‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో , పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ నావిగేషన్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చించి. ప్రత్యేకించి,
ఇటీవలి కాలంలో నౌకా రవాణా పరిమాణం పెరిగింది’ అని అన్నారు. సాగర్ సంపర్క్ పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన వైవిధ్యతతో  కూడిన అంతర్జాతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (DGNSS)
 ఆరు ప్రాంతాలలో రేడియో ఉపకరణాలు, నౌకాయాన  నావిగేషన్ సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని , ఇది డిజిఎల్ఎల్ కింద ఏర్పాటైందని  ఆయన తెలిపారు.


డిజిఎన్ ఎస్ ఎస్ సర్వీసు నావికులు  సురక్షితంగా నౌకను గమ్యస్థానానికి చేర్చడానికి మార్గసూచీగా ఉపకరిస్తుంది. అలాగే నౌకలు ఢీకొనే ప్రమాదం  నుంచి తప్పిస్తుంది. అలాగే పోర్టులలో, హార్బర్ లలో ప్రమాదాలను నివారిస్తుంది.
ఇది ఆయా నౌకలు సురక్షితంగా, సమర్ధతతో వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ శ్రీపాద యశో నాయక్ మాట్లాడుతూ, డిజిఎన్ ఎస్ ఎస్ తో అంతర్జాతీయ నౌకాయాన సంస్థ  (ఐ.ఎం.ఓ), సముద్రమార్గంలో ప్రాణ రక్షణ  (
(ఎస్.ఒ.ఎల్.ఎ.ఎస్), సముద్రయాన ఉపకరణాలు, నావిగేషన్,  లైట్హౌస్ అథారిటీలకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ (ఐఎఎల్ఎ)లు  నిర్దేశించిన అంతర్జాతీయ  ప్రమాణాలను పూర్తిచేసినట్టవుతుందన్నారు.ఉపగ్రహ సమాచార వ్యవస్థకు సంబంధించి పలుసదుపాయాలు అంటే జిపిఎస్, గ్లోబల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ (జిఎల్ఒఎన్ ఎ ఎస్‌ ఎస్) , డిజిఎన్ ఎస్ ఎస్ లు అందుబాటులోకి రావడంతో మరింత మెరుగైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడంతోపాటు,
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు కలిగిఉన్నట్టు అవుతుంది. ఇది 5 మీటర్ల దూరంలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో,  నావికులు తమ పొజిషనింగ్ను మరింత మెరుగుపరచుకోవడానికి ఉపకరిస్తుంది.
నూతనంగా రూపుదిద్దుకున్న డిజిఎన్ ఎస్ ఎస్ వ్యవస్థ జిపిఎస్, జిఎల్ఒఎన్ ఎ ఎస్ ఎస్లలో  సవరణలను ప్రసారం చేయగలదు. డిజిఎన్ ఎస్ ఎస్  వ్యవస్థ, జిపిఎస్ పొజిషనింగ్ లో మరింత ఖచ్చితత్వాన్ని తీసుకురావడమే కాక,
వాతావరణ పరిస్థితులతో ఏర్పడే దోషాలను తొలగించగలుగుతుంది. దీనిని ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానంతో, అదునాతన సాఫ్ట్వేర్ లతో సాధించడం జరిగింది.
దోష సవరణ దిద్దుబాటు  భారత తీరప్రాంతం నుంచి ప్రతి 100 నాటికల్ మైళ్లకు 5 మీటర్ల నుంచి 10 మీటర్లకు బదులుగా , 5 మీటర్ల కంటే  తక్కువకు మెరుగుపడింది.  

 

***(Release ID: 1939117) Visitor Counter : 161