శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

చంద్రయాన్ -3 భారతదేశ అంతర్జాతీయ భాగస్వామ్యాల స్థాయిని ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ , స్టార్టప్ లలో ఎంతో పెంచుతుంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ పై ప్రతిపాదనలకు భారత్, అమెరికా పిలుపు: జీవితాలలో మార్పు కోసం క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ద్వైపాక్షిక సమగ్ర, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయాన్ని నొక్కిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు మన దైనందిన జీవితంలో మార్పు తో కూడిన పురోగతికి దారితీస్తాయి; ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఇంకా ఎన్నింటినో ప్రభావితం చేయడం ద్వారా మన సామాజిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఎండోమెంట్ ఫండ్ తో మార్పు సామర్ధ్యం స్వాగతించ దగింది ; డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 12 JUL 2023 5:02PM by PIB Hyderabad

చంద్రయాన్ -3 భారతదేశ అంతర్జాతీయ భాగస్వామ్యాల స్థాయిని పెంచుతుందని, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్,  స్టార్టప్ లలో భారతదేశ అంతర్జాతీయ సహకారాల స్థాయిని పెంచుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పి ఎం ఒ, అణు శక్తి విభాగం,  అంతరిక్ష , సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

మానవ అంతరిక్షయానం సహకారం కోసం అమెరికా కు చెందిన నాసా,  భారతదేశానికి చెందిన ఇస్రో కలసి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ ను అభివృద్ధి చేస్తున్నాయని, నాసా నేడు భారతదేశ వ్యోమగాములను కోరుతోందని మంత్రి చెప్పారు. మానవాళి మొత్తానికి ప్రయోజనం చేకూర్చేలా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఉమ్మడి దార్శనికతను ప్రతిబింబించే ఆర్టెమిస్ ఒప్పందాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా భారత్ సంతకం చేసిందని ఆయన చెప్పారు.

 

భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రాతినిధ్యం వహించగా, భారత్- అమెరికా దేశాలు రెండూ ‘జీవితాల మార్పు కోసం క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ,  క్వాంటం ఆఫ్ టెక్నాలజీస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‘  పై  సంయుక్త  ప్రతిపాదనల కోసం పిలుపునిచ్చిన అనంతరం జితేంద్ర సింగ్ మాట్లాడారు.

ఇండో-యు.ఎస్  సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం (ఐ యు ఎస్ ఎస్ టి ఎఫ్) , సెక్రటేరియట్ ఫర్ యు ఎస్ ఐ ఎస్ టి ఇ ఎఫ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాయి.

 

ద్వైపాక్షిక సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయం అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాని మోదీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నాయకుల నిర్ణయాన్ని అమలు స్థాయికి తీసుకెళ్లడానికి భారత్, అమెరికా పక్షాలు త్వరితగతిన ముందుకు రావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

 

ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (అమెరికా - ఇండియా) సంబంధంలో కొత్త దిశ , కొత్త శక్తితో ఇండో-అమెరికన్ భాగస్వామ్యం భవిష్యత్తు కోసం సాంకేతిక భాగస్వామ్యాన్ని రూపొందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీల సంయుక్త అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం యూఎస్-ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్

(యుఎస్ఐఎస్ టి ఇ ఎఫ్) కింద 20 లక్షల డాలర్ల గ్రాంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడాన్ని అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ స్వాగతించడం హర్షణీయమని, భారత్ లో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్.పి.సి ) సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సంతోషకరమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

శాస్త్రీయ , పారిశ్రామిక పరిశోధన,  అభివృద్ధిని విత్తనం చేయడం, పెంచడం, క్వాంటమ్ టెక్నాలజీ (క్యూటి) లో శక్తివంతమైన , సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో భారతదేశం ఇటీవల నేషనల్ క్వాంటమ్ మిషన్ (ఎన్ క్యు ఎం ) ను ఆమోదించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కృత్రిమ మేధకు ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని, ఆర్థికాభివృద్ధికి అపారమైన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు మన దైనందిన జీవితంలో పరివర్తనాత్మక పురోగతికి దారితీస్తాయని, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పులు ఇంకా ఎన్నింటినో ప్రభావితం చేయడం ద్వారా మన సామాజిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఎండోమెంట్ ఫండ్ ద్వారా మార్పు సామర్థ్యాన్ని ఆయన స్వాగతించారు.

 

ఆగస్టు 31, 2023 వరకు ఈ పిలుపు తెరిచిఉంటుంది.ఆశాజనక ఉమ్మడి ఇండో-యు.ఎస్.ని ఆహ్వానిస్తుంది. వాణిజ్యపరంగా,  లాభదాయకంగా సామాజిక సంబంధితంగా ఉండే సాంకేతిక ఆవిష్కరణలు , వ్యవస్థాపక ప్రతిపాదనలు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డి జి) ల వివిధ కోణాలను పరిశీలిస్తున్న భారత,యు ఎస్  ప్రాధాన్యతలకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

 

*****



(Release ID: 1939111) Visitor Counter : 161