జౌళి మంత్రిత్వ శాఖ

‘సమర్త్’ కింద మరో 43 కొత్త అమలు భాగస్వామ్య సంస్థల ఎంప్యానెల్మెంట్

అదనంగా 75,000 మంది లబ్ధిదారులకు శిక్షణే లక్ష్యం

అమలు చేసే భాగస్వాములకు మద్దతులో 5% పెంపు;

పథకం కింద నైపుణ్యాన్ని అందించే పరిశ్రమలకు చాలా వరకు ఉపశమనం

Posted On: 11 JUL 2023 7:43PM by PIB Hyderabad

టెక్స్‌టైల్స్ రంగ సామర్థ్య పెంపు సాధికార కమిటీ (సమర్త్) సమావేశంలో ఈరోజు జరిగింది. ఈ సమవేశంలో 43 మంది కొత్త ఇంప్లిమెంటింగ్ పార్టనర్‌లను ఎంప్యానెల్‌మెంట్ చేశారు. దీంతో ఇంప్లిమెంటింగ్ పార్ట్‌నర్ల ప్యానెల్ విస్తరించబడింది. దీని ద్వారా అదనంగా దాదాపు 75,000 మంది లబ్ధిదారులకు శ్రామిక శక్తికి నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా శిక్షణ ఇవ్వాలనే నిర్ణయించారు. ఈ మేరకు అదనపు లక్ష్యాన్ని శిక్షణకు కేటాయించారు. ఈ పథకం కింద నైపుణ్యాన్ని అందించే పరిశ్రమలకు అవసరమైన అదనపు ఆర్థిక సహాయాన్ని అందించే ఖర్చు నిబంధనలలో 5 శాతం పెంపుతో నిధుల నమూనా కూడా సవరించబడింది. తాజా చర్యతో జౌళి మంత్రిత్వ శాఖ 157 టెక్స్‌టైల్ పరిశ్రమలు / పరిశ్రమ అనుబంధ సంఘాలు, 16 కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు మంత్రిత్వ శాఖలోని 3 సెక్టోరల్ ఆర్గనైజేషన్‌లతో భాగస్వామ్యమై సమర్త్ శిక్షణా కార్యక్రమాలను చేపట్టినట్టయింది. ఈ పథకం దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలలో అమలుచేయబడుతోంది.  ఎస్.సి, ఎస్.టి. మరియు ఇతర అట్టడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు శిక్షణ అందిస్తుంది. ఇప్పటి వరకు లక్ష్యంగా కేటాయించిన 4.72 లక్షల మంది లబ్ధిదారులలో 1.88 లక్షల మంది లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు శిక్షణ పొందిన లబ్ధిదారుల్లో 85% కంటే ఎక్కువ మంది మహిళలే. సంఘటిత రంగ కోర్సులలో శిక్షణ పొందిన 70% కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్లేస్‌మెంట్ అందించబడింది. సమర్త్ అనేది స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ద్వారా స్వీకరించబడిన విస్తృత నైపుణ్యం అభివృద్ది పాలసీ ఫ్రేమ్‌వర్క్ క్రింద రూపొందించబడిన టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ యొక్క డిమాండ్ ఆధారిత మరియు ప్లేస్‌మెంట్-ఆధారిత నైపుణ్య కార్యక్రమం. వ్యవస్థీకృత టెక్స్‌టైల్ మరియు సంబంధిత రంగాలలో ఉద్యోగాలను సృష్టించడంలో పరిశ్రమ యొక్క ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు అనుబంధించడం ఈ పథకం లక్ష్యం. ప్రాథమిక ఎంట్రీ లెవల్ స్కిల్లింగ్‌తో పాటు, అప్‌స్కిల్లింగ్/రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఈ పథకం ఉంది. అపారెల్ & గార్మెంటింగ్ విభాగాలలో ఉన్న కార్మికుల ఉత్పాదకతను మెరుగుపరచడానికి అమలు చేయబడింది. సమర్త్ చేనేత, హస్తకళ, పట్టు మరియు జనపనార వంటి సాంప్రదాయ వస్త్ర రంగాల యొక్క నైపుణ్యం/పునః నైపుణ్యం అవసరాలను కూడా తీరుస్తోంది.

 

***



(Release ID: 1938836) Visitor Counter : 177