ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆపరేషన్ గోల్డ్‌మైన్ కింద సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 25.26 కోట్ల విలువైన 48 కిలోల గోల్డ్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

Posted On: 09 JUL 2023 9:17PM by PIB Hyderabad

ఆపరేషన్ గోల్డ్‌మైన్‌లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 25.26 కోట్ల విలువ చేసే 48.20 కిలోల గోల్డ్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకుంది. ఇటీవలి కాలంలో విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో  స్వాధీనం చేసుకున్న బంగారంలో ఇది ఒకటి.

 

 

భారతదేశంలోకి పేస్టు రూపంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నారని  నిఘా విభాగాల నుంచి అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా 07.07.2023న సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్. IX172లో షార్జా నుంచి వచ్చిన  ముగ్గురు  ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అడ్డగించారు. వారి హ్యాండ్ బ్యాగేజీ, చెక్ ఇన్ లగేజీ ని నిశితంగా పరిశీలించారు. 5 బ్లాక్ బెల్టుల్లో  20 తెల్ల రంగు  ప్యాకెట్లలో 43.5 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో అధికారులు గుర్తించారు.  సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం  అధికారుల సహాయంతో ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు విచారించారు.  భారత్‌లోకి అక్రమంగా తరలించేందుకు బంగారాన్ని దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. అధికారులు స్క్రీనింగ్, పరీక్షలను తప్పించుకోవడానికి ఇమ్మిగ్రేషన్‌కు ముందు ఉన్న మరుగుదొడ్డిలో  బంగారం మార్పిడి చేయాలని అనుకున్నారు.అధికారులు మరిన్ని తనికీలు నిర్వహించి ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ ప్రక్కనే ఉన్న పురుషుల వాష్‌రూమ్‌లో  పేస్టు రూపంలో ఉన్న  మరో  4.67 కిలోల బంగారాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సిఐఎస్ఎఫ్ కు డీఆర్ఐ   అప్పగించింది.పేస్టు రూపంలో  స్వాధీనం చేసుకున్న  మొత్తం 48.20 కిలోలబంగారం నుంచి దాదాపు , 42 కిలోల కంటే ఎక్కువ బరువున్న బంగారం (స్వచ్ఛత 99%) వెలికి తీసురారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 25.26 కోట్ల రూపాయల వరకు ఉంటుంది..

కస్టమ్స్ చట్టం, 1962 కింద ప్రయాణికుల నుంచి డీఆర్ఐ అధికారులు  స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. వారు అందించిన సమాచారం మేరకు  ఒక అధికారితో పాటు 3 మంది ప్రయాణికులను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యవస్థీకృత స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడయింది.  విమానాశ్రయంలోని అధికారులతో సహా ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని కనుగొనడానికి తదుపరి దర్యాప్తు, మొత్తం సిండికేట్‌ను నిర్వీర్యం చేయడానికి  డీఆర్ఐ చర్యలు ప్రారంభించింది.

చర్య స్మగ్లింగ్ సిండికేట్ కార్యకలాపాలను డీఆర్ఐ ఛేదించింది. దేశంలో అధిక-విలువైన వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు  చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగా సూరత్ విమానాశ్రయంలో డీఆర్ఐ తనిఖీలు నిర్వహించింది.

 

***



(Release ID: 1938420) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Marathi , Hindi