రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ సంబంధాలను & వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు మలేసియాలో పర్యటించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
प्रविष्टि तिथि:
08 JUL 2023 10:02AM by PIB Hyderabad
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరచడంపై దృష్టి పెట్టి 10-11 జులై, 2023న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మలేసియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. మలేసియా రక్షణ మంత్రి దాతో సెరి మహమద్ హసన్‌తో రక్షణ మంత్రి ద్వైపాక్షిక చర్చలను నిర్వహించనున్నారు. ఈ చర్చల సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించి, పరస్పర ఒడంబడికలను మరింత బలోపేతం చేసేందుకు నూతన చొరవలను అన్వేషించనున్నారు. అలాగే, భాగస్వామ్య ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు.
తన పర్యటన సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మలేసియా ప్రధాన మంత్రి శ్రీ వైబి దాతో సెరి అన్వర్ బిన్ ఇబ్రహీమ్‌ను కూడా కలుసుకోనున్నారు.
మొత్తం ప్రాంతపు శాంతి, శ్రేయస్సు పట్ల ఉమ్మడి ఆసక్తిని భారత్, మలేసియాలు కలిగి ఉన్నాయి. రక్షణ, భద్రత సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలకు విస్తరించిన బహుముఖీయ, బలమైన సంబంధాన్ని ఇరు దేశాలూ కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2015లో చేసిన మలేసియా పర్యటన సందర్భంగా స్థాపించిన మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య దృక్పధానికి అనుగుణంగా పని చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయి.
****
(रिलीज़ आईडी: 1938371)
आगंतुक पटल : 175