మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలకు చెందిన 63 మంది విద్యార్థులు టీచర్ల పర్యవేక్షణలో జపాన్ లో విద్యా, విజ్ఞాన విహార / అవగాహన యాత్రకు బయలుదేరి వెళ్లారు.


న్యూఢిల్లీలో శనివారం జెండా ఊపి యాత్ర ప్రారంభించారు.

Posted On: 08 JUL 2023 6:13PM by PIB Hyderabad

        జపాన్ శాస్త్ర సాంకేతిక (జె ఎస్ టి) సంస్థ సహకారంతో  భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ యాత్రకు శనివారం జెండా ఊపి ప్రారంభించారు.   మొత్తం 63 మంది విద్యార్థులు టీచర్ల పర్యవేక్షణలో జయం యాత్రకు బయలుదేరి వెళ్లారు.
విద్యా, విజ్ఞాన విహార / అవగాహన యాత్రలో విద్యార్థులు స్వయంగా తెలుసుకుని విజ్ఞాన సముపార్జన కోసం జపాన్ లో వివిధ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, ప్రదర్శనశాలలు, యూనివర్సిటీలు,  పరిశోధనా సంస్థలు చూస్తారు.  తద్వారా వారికి తమ జీవనోపాధి మార్గాన్ని,  జీవిత గమనాన్ని ఎంచుకోవడానికి మార్గదర్శకంగా ఉంటుంది.   కేంద్రీయ విద్యాలయాలు,  నవోదయ విద్యాలయాల 11-12 తరగతులలో  ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై వివిధ అంశాలు /విషయాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని అభిషలించే విద్యార్థులు  ఈ బృందంలో ఉన్నారు.  జూలై 9 నుంచి 15 వరకు రోజుల యాత్రకు వెళ్తున్న ఈ విద్యార్థులు ప్రేరణ పొంది ఎంతో ఉత్సహపూరితులై ఉన్నారు.  
               
               ఈ కార్యక్రమానికి విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని పాఠశాల విద్య & సాక్షరత శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి అర్చనా శర్మ
అవస్థీ ,  జపాన్ జె ఎస్ టి మేనేజర్ శ్రీ కెమ్మోషి యుకియో,  సి ఐ ఇ టి - ఎన్ సి ఇ ఆర్ టి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ. పి.  బెహరా,   విద్యా మంత్రిత్వ శాఖ ,  కేంద్రీయ విద్యాలయ సంఘటన,  నవోదయ విద్యాలయ సమితి అధికారులు ,  తదితరులు హాజరయ్యారు.  

                యువతలో మేధో వికాసంతో పాటు శాస్త్ర శోధనను అభివృద్ధి చేసేందుకు 2014 నుంచి జపాన్ శాస్త్ర  సాంకేతిక (జె ఎస్ టి) సంస్థ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని పాఠశాల విద్య & సాక్షరత శాఖతో కలసి  సకురా విజ్ఞానశాస్త్ర కార్యక్రమం కింద సకురా ఉన్నత పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.  భారత  విద్యార్థులను స్వల్పకాలిక పర్యటన కార్యక్రమం కింద జపాన్ యాత్రకు ఆహ్వానిస్తారు.  వారు జపాన్ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని గురించి,  ఆ దేశ సంస్కృతిని గురించి  తెలుసుకునే అవకాశం కలుగుతుంది.  

               మొదటిసారి ఇండియా 2016 ఏప్రిల్ లో ఈ కార్యక్రమంలో పాల్గొంది.  ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 411 మంది విద్యార్థులు  69 మంది పర్యవేక్షకులతో కలసి జపాన్ సందర్శించారు.   మన దేశం నుంచి చివరి బృందం 2019 నవంబర్ లో జపాన్ వెళ్లి వచ్చింది.  విశ్వ మహమ్మారి కోవిడ్ -19 కాలంలో జె ఎస్ టి  ఆన్ లైన్ లో యూనివర్సిటీ సందర్శనలు నిర్వహించింది.  




 

******


(Release ID: 1938367) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi , Tamil