వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈ-కామర్స్ వేదిక గ్రోయోస్‌లో ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్’ కార్యక్రమం ఉత్పత్తులు
- ఈ చర్య మార్కెట్ విస్తరణ మరియు చేనేత మరియు హస్తకళల సేకరణను మెరుగుపరుస్తుంది
- జిల్లా-నిర్దిష్ట కళ మరియు క్రాఫ్ట్‌ను వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ యొక్క వాటాదారులు యాక్సెస్ చేయవచ్చు
Posted On:
08 JUL 2023 2:12PM by PIB Hyderabad
వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కింద అమలు చేస్తున్న ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్) (ఓడీఓపీ) కార్యక్రమం ఆన్‌బోర్డ్ అగ్రిగేటర్‌లకు ఈ-కామర్స్ ప్లేయర్ గ్రోయో వేదికపైకి రానుంది. గృహ వస్త్రాలు, గృహాలంకరణతో సహా వివిధ వర్గాలతో కూడిన ఓడీఓపీ-గుర్తించబడిన ఉత్పత్తులను విక్రయిం గ్రోయో వేదికపై అందుబాటులో ఉంచనున్నారు. ఈ సహకార ప్రారంభం 3 జూలై, 2023న ప్రారంభించబడింది. ఈ వన్-స్టాప్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ట్యాగింగ్ ప్రతి జిల్లా గుర్తింపును బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది. అదే సమయంలో ఓడీఓపీ ఉత్పత్తులకు ఎక్కువ దృశ్యమానతను అందిస్తుంది. ఇది విక్రేతలు కొనుగోలుదారుల నుండి ఉత్పత్తి అవసరాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వారి ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా డీపీఐఐటీ డైరెక్టర్ శ్రీమతి సుప్రియా దేవస్థలి మాట్లాడుతూ కళాకారులు పెద్ద కస్టమర్ బేస్‌ని పొందేందుకు వీలుగా.. ఇటువంటి సంస్థలతో జట్టుకట్టాల్సిన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ప్రభుత్వం వ్యవస్థాపకత మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందని, అటువంటి సహకారాల ద్వారా కళాకారులు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్ నుండి సిరామిక్స్, కేరళలోని కోజికోడ్ నుండి కొబ్బరి ఉత్పత్తులు, బుద్గామ్, జమ్ము మరియు కాశ్మీర్ నుండి కనీ శాలువాలు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నుండి బెల్ మెటల్ క్రాఫ్ట్ వంటి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రకాల చేతివృత్తుల ఉత్పత్తుల సేకరణ ఇప్పటికే ఈ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చింది. భవిష్యత్తులో ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న కేటగిరీలు వెల్‌నెస్, ఆభరణాలు మొదలైన వాటిని కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఓడీఓపీ దేశంలోని 100 జిల్లాలను కవర్ చేస్తూ 35+ బ్రాండ్‌లతో చేరింది. ఉత్పత్తి యాక్సెసిబిలిటీ మరియు విజిబిలిటీని మెరుగుపరచడానికి ఈ క్యాంపెయిన్ కింద మరిన్ని అగ్రిగేటర్‌లను తీసుకురావాలనేది టీమ్ దృష్టి సారించింది. ఓడీఓపీ కార్యక్రమం సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ.. జిల్లా స్థాయిలో స్థిరమైన ఉపాధిని సృష్టించే లక్ష్యంతో ఉంది. దేశంలోని ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ఎంచుకుని, బ్రాండ్ చేసి, ప్రచారం చేయాలనేది ఆలోచన. ఆత్మనిర్భర్ భారత్ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత జీ20 ప్రెసిడెన్సీని అనుసరించి, డీపీఐఐటీ, భారత ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. ఓడీఓపీ కేటలాగ్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ప్రతి సంస్థ ఈ కార్యక్రమానికి సహకరించాలని అభ్యర్థించారు.
***
(Release ID: 1938366)
Visitor Counter : 141