నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
గ్రీన్ హైడ్రోజన్ (ఐసిజిహెచ్) 2023పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో ముగిసింది
గ్రీన్ హైడ్రోజన్ భారతదేశాన్ని ఇంధన దిగుమతిదారు నుండి ఇంధన ప్రదాత, ఎగుమతిదారుగా మార్చగలదు: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి
గ్రీన్ హైడ్రోజన్‌లో భారతదేశం స్వావలంబన మార్గానికి స్థోమత, ప్రాప్యత, ఆమోదయోగ్యత కీలకం: శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
గ్రీన్ హైడ్రోజన్ ధరను 2030 నాటికి కిలో 4.5 డాలర్ల నుండి కిలో ఒక డాలర్ కి తగ్గించాలి: జి20 షెర్పా అమితాబ్ కాంత్
Posted On:
07 JUL 2023 6:17PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో గ్రీన్ హైడ్రోజన్ ( ఐసిజిహెచ్) 2023పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విజయవంతంగా ముగిసింది.
నూతన, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ), పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, సిఎస్ఐఆర్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కాన్ఫరెన్స్ ముగింపు సదస్సులో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరితో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారతదేశ అధ్యక్ష పదవి సంవత్సరంలో జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ఎంఎన్ఆర్ఈ కార్యదర్శి శ్రీ భూపిందర్ భల్లా, గ్రీన్ హైడ్రోజన్‌పై సిఐఐ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు శ్రీ వినిత్ మిట్టల్ పాల్గొన్నారు.
2700 మంది ప్రతినిధులు, 135 మంది వక్తలు, ఏడు ప్లీనరీ సెషన్‌లు, 16 సాంకేతిక సెషన్‌లు, నాలుగు ప్యానెల్ చర్చలతో మూడు రోజుల పాటు చర్చలు జరిగిన ఈ సదస్సులో నిపుణులు గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థపై దృష్టి సారించారు.
తన ప్రసంగంలో, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి భారతదేశాన్ని ఇంధన దిగుమతిదారు నుండి ఇంధన ప్రదాత, ఎగుమతిదారుగా మార్చగల సామర్థ్యాన్ని గ్రీన్ హైడ్రోజన్ కలిగి ఉందని ఉద్ఘాటించారు. గణనీయమైన డిమాండ్, గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే, నిల్వ చేసే సామర్థ్యం, ఈ గ్రీన్ ఇంధనానికి కేంద్రంగా మారడానికి క్లిష్టమైన అవసరాలను తీర్చడంలో భారతదేశం ప్రయోజనాన్ని ఆయన హైలైట్ చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇతర గ్రీన్ ఇంధనాలతో పాటు భారతదేశం ప్రస్తుత 200 బిలియన్ల డాలర్ల ఇంధన దిగుమతి బిల్లును భవిష్యత్తులో 300 బిలియన్ డాలర్లు ఎగుమతి ప్రయోజనంగా మార్చగలదని శ్రీ పూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ఆమోదించడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను డాక్టర్ జితేంద్ర సింగ్ కొనియాడారు. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భారతదేశం నిబద్ధతను ఆయన నొక్కిచెప్పారు గ్రీన్ హైడ్రోజన్‌లో భారతదేశం స్వావలంబన మార్గానికి, స్థిరమైన పరిష్కారాలను కొనసాగించడానికి ప్రధాన లక్షణాలుగా స్థోమత, ప్రాప్యత, ఆమోదయోగ్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
జి20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ గ్రీన్ హైడ్రోజన్, శక్తి ప్రపంచ ఎగుమతిదారుగా భారతదేశం సామర్థ్యాన్ని హైలైట్ చేసారు, 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ధరను కిలో 4.5 డాలర్ల నుండి కిలోకి ఒక డాలర్ తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
(Release ID: 1938354)
Visitor Counter : 171