ఆర్థిక మంత్రిత్వ శాఖ

డిజిటల్ అండ్ సస్టెయినబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ పై యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్ (యుఎన్ఇఎస్ సిఎపి ) జరిపిన గ్లోబల్ సర్వే లో భారతదేశం పనితీరు అత్యుత్తమం


ప్రపంచ వాణిజ్య సౌలభ్య ప్రయత్నాల్లో 2021లో 90.32 శాతంగా ఉన్న భారత్ 2023లో 93.55 శాతంతో ముందంజలో ఉంది.

పేపర్ లెస్, కాంటాక్ట్ లెస్ , ఫేస్ లెస్ వాణిజ్యం లక్ష్యంగా టురాంట్ కస్టమ్స్, సింగిల్ విండో ఇంటర్ ఫేస్ ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ ట్రేడ్ (స్విఫ్ట్), ప్రీ-అరైవల్ డేటా ప్రాసెసింగ్, ఇ-సంచిత్ వంటి భారతీయ కస్టమ్స్ డిజిటల్ కార్యక్రమాల అమలు

"విమెన్ ఇన్ ట్రేడ్ ఫెసిలిటేషన్" కాంపోనెంట్ స్కోరులో గణనీయమైన మెరుగుదల 2021 లో 66.7% నుండి 2023 లో 77.8% కి పెరిగింది

కెనడా, ఫ్రాన్స్, యుకె , జర్మనీతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ స్కోరుతో దక్షిణాసియా ప్రాంతంలో ఉత్తమ పనితీరు కనబరిచిన భారతదేశం

Posted On: 07 JUL 2023 7:14PM by PIB Hyderabad

డిజిటల్ , సుస్థిర వాణిజ్య సౌలభ్యం పట్ల భారతదేశం తన నిబద్ధతను ప్రదర్శిస్తూనే ఉంది, డిజిటల్ అండ్ సస్టెయినబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ పై యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్ (యుఎన్ఇఎస్ సిఎపి) ఇటీవల విడుదల చేసిన  గ్లోబల్ సర్వే నివేదికలో భారత్ అద్భుతమైన పనితీరు ఇందుకు నిదర్శనం.

 

140కి పైగా ఆర్థిక వ్యవస్థలను కవర్ చేస్తూ, 60 వాణిజ్య సౌలభ్య చర్యలను మదింపు చేసిన 2023 సర్వే, 2021 లో 90.32% తో పోలిస్తే 2023 లో 93.55% ఆకట్టుకునే స్కోరుతో ప్రపంచ వాణిజ్య సౌలభ్య ప్రయత్నాలలో భారత్ అగ్రగామిగా ఉన్నట్టు ప్రకటించింది.

 

 

2023 సర్వే వివిధ ఉప సూచికల వారీగా భారతదేశ అసాధారణ పురోగతిని గుర్తించింది, దేశం నాలుగు కీలక రంగాలలో - పారదర్శకత, ఫార్మాలిటీస్, ఇన్ స్టిట్యూషనల్ అరేంజ్ మెంట్ అండ్ కోఆపరేషన్, పేపర్ లెస్ ట్రేడ్ - లో 100% ఖచ్చితమైన స్కోరును సాధించింది:

 

టురాంట్ కస్టమ్స్, సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ ట్రేడ్ (స్విఫ్ట్), ప్రీ-అరైవల్ డేటా ప్రాసెసింగ్, ఇ-సంచిత్, కోఆర్డినేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ వంటి చొరవల ద్వారా వాణిజ్య ప్రక్రియలను పటిష్ట పరచడంలో, పారదర్శకతను పెంపొందించడంలో, భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో  భారతదేశ నిరంతర ప్రయత్నాలకు ఈ గణనీయమైన స్కోర్ లు నిదర్శనం. 'విమెన్ ఇన్ ట్రేడ్ ఫెసిలిటేషన్' విభాగంలో 2021లో 66.7 శాతంగా ఉన్న స్కోరు 2023 నాటికి 77.8 శాతానికి గణనీయంగా మెరుగుపడింది. ఇది లింగ సమ్మిళితత, వాణిజ్య రంగంలో మహిళల సాధికారత పట్ల నిబద్ధతను

సూచిస్తోంది.

 

 

దక్షిణాసియా ప్రాంతంలోని అన్ని దేశాలలో భారతదేశం ఇప్పుడు ఉత్తమ పనితీరు కనబరిచే దేశంగా ఉంది. కెనడా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ఓవరాల్ స్కోర్ ఎక్కువగా ఉంది.

 

 

ఈ క్రింది గ్రాఫ్ లో రుజువు పేర్కొన్నట్లుగా, భారతదేశం మొత్తం స్కోరు ఏటేటా మెరుగుపడుతూనే ఉంది, ఇది తదుపరి తరం ట్రేడ్ ఫెసిలిటేషన్ చర్యలను చేపట్టడం ద్వారా సులభతర వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచడానికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. డిజిటల్ అండ్ సస్టెయినబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ పై యునెస్కాప్ నిర్వహించిన గ్లోబల్ సర్వే డబ్ల్యూటీఓ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ (టిఎఫ్ఎ) తో పాటు దాదాపు 60 వాణిజ్య సౌకర్యాల చర్యలను పదకొండు ఉప సమూహాలుగా వర్గీకరించింది, అవి: పారదర్శకత; ఫార్మాలిటీస్; సంస్థాగత ఏర్పాటు- సహకారం; రవాణా సదుపాయం; కాగిత రహిత వ్యాపారం; సీమాంతర కాగిత రహిత వాణిజ్యం; ఎస్ఎంఈలకు వాణిజ్య సౌలభ్యం; వ్యవసాయ వాణిజ్య సౌలభ్యం; వ్యాపార సౌలభ్యంలో మహిళలు; ట్రేడ్ ఫెసిలిటేషన్ కోసం ట్రేడ్ ఫైనాన్స్; సంక్షోభ సమయాల్లో వాణిజ్య సౌలభ్యం.

ఈ సర్వే ఊహాజనిత ఆధారితం గా (పర్సెప్షన్ బేస్డ్) గా కాకుండా వాస్తవాల ఆధారితం (ఫ్యాక్ట్ బేస్డ్) గా ఉంటుంది. డేటా సేకరణ , ధృవీకరణకు మూడు-దశల విధానం సాధారణంగా అనుసరించబడుతుంది, ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఆరు నెలల వ్యవధిలో అమలు చేయబడుతుంది.

 

 

దేశ వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడంలోనూ, దేశంలో వాణిజ్య అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించడంలోనూ భారతీయ కస్టమ్స్  తీసుకున్న ఫేస్ లెస్ కస్టమ్స్, పేపర్ లెస్ కస్టమ్స్, కాంటాక్ట్ లెస్ కస్టమ్స్ లతో కూడిన టురాంట్ కస్టమ్స్ వంటి సులభ వాణిజ్య చర్యల  సామర్థ్యాన్ని ఈ సర్వే ప్రతిబింబిస్తుంది.

 

సమగ్ర సర్వే ఫలితాలు,  మరింత సమాచారం కోసం యుఎన్ఇఎస్ సిఎపి అధికారిక వెబ్ సైట్ (https://www.untfsurvey.org/economy?id=IND&year=2023) ను  సందర్శించండి.

 

****(Release ID: 1938117) Visitor Counter : 157


Read this release in: Urdu , English , Hindi , Marathi , Odia