రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఫాన్స్‌లోని పారిస్‌ లో బాస్టిలె డే పెరేడ్‌ డే పెరేడ్‌

Posted On: 07 JUL 2023 5:41PM by PIB Hyderabad

 2023 జూలై 14 వ తేదీన ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని జరిగే బాస్టిలె డే పెరేడ్‌ ఉత్సవంలో పాల్గొనేందుకు భారత త్రివిధ దళాల కంటింజెంట్‌ లో భాగంగా భారత నౌకాదళ కంటింజెంట్‌, ఫ్రాన్స్‌కు చేరుకుంది. ఈ నౌకాదళ బృంందంలో నలుగురు అధికారులు, 64 మంది నావికులు ఉన్నారు. ఈ కంటింజెంట్‌ కు కమాండర్‌ వ్రాత్‌ భగెల్‌ నాయకత్వం వహిస్తారు. ఈ అధికారి క్షిపణి యుద్ధతంత్రంలో, భారీ తుపాకులు వాడడంలో నిపుణులు. వరుణ విన్యాసాల సందర్భంగా ఆయన ఫ్రెంచ్‌ నౌక బిసిఆర్‌ వర్‌ నౌకను నడిపారు. ఆయన వెంట ఆయన డిప్యూటీలు లెఫ్టినెంట్‌ కమాండర్‌ దిశా అమృత్‌ ( 2023 రిపబ్లిక్‌ దినోత్సవ పెరేడ్‌ లో భారత నావికా దళ కంటింజెంట్‌కు నాయకత్వం వహించినవారు), లెఫ్టినెంట్‌ కమాండర్‌ రజత్‌ త్రిపాఠి, లెఫ్టినెంట్‌ కమాండర్‌ జితిన్‌ లలిత ధర్మరాజ్‌ లు ఇందులో పాల్గొంటున్నారు. 

ఈ ఉత్సవాల లో భారత నౌకాదళం తరఫున ఐఎన్ ఎస్ చెన్నై పాల్గొంటుంది.ఇది దేశీయంగా నిర్మితమైన విధ్వంసక నౌక. ఇది జూలై 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్ ఉత్సవాలలో పాల్గొంటుంది. ఈ నౌక సిబ్బంది  , ఫ్రాన్స్ లోని బ్రెస్ట్ లో జరిగే బాస్టిలి దినోత్సవాలలొ  ఇండియా తరపున పాల్గొంటారు.
భారత నావికా దళం, ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళం. ఇందులో నౌకలు, జలాంతర్గాములు, ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. దీని మోటో సంస్కృతంలో ఉంటుంది. అది  సం నో వరుణ: , అంటే సముద్రాలకు ప్రభువైన భగవంతుడు, మనకు శుభాలు చేకూర్చుగాక అని అర్థం. ఈ మోటోని రుగ్వేదం నుంచి తీసుకున్నారు. ఇది 1500 బిసి నాటిది.  భారత  నౌకాదళం పోరాట పటిమ  కలిగిన,  నమ్మకమైన, భవిష్యత్తుకు భద్రత కూర్చే ది. దీనిని అత్యంత నిపుణులైన సిబ్బంది నిర్వహిస్తున్నారు.

భారత దేశానికి గల నౌకా నిర్మాణ సామర్థ్యం భారతదేశ నావికాదళ సత్వర ఆధునీకరణకు, ఎంతగానో దోహదపడుతోంది.
ప్రస్తుతం దేశ  నౌకా నిర్మాణ  కేంద్రాలు అన్ని రకాల నౌకల నిర్మాణాన్ని  చేపడుతున్నాయి. అంతేకాదు, తమ స్వంత ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు,
విమాన విధ్వంసకాలు, న్యూక్లియర్ సబ్ మెరైన్లు, వంటి వాటిని నిర్మించి వాటిని నిర్వహిస్తున్న
 అతి కొద్ది ప్రముఖ దేశాల సరసన ఇండియా  నిలబడి ఉంది. ఐఎన్ఎస్ చెన్నయ్ ఈ దిశగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆధునిక నౌకగా దీనిని చెప్నుకోవచ్చు.

భారత–ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ఏడాది 25 సంవత్సరాలు  పూర్తి చేసుకుంటున్నది.ఉభయ దేశాలు నౌకాయాన రంగంలో లోతైన సంబంధాలు కలిగిఉన్నాయి. ఈ సంబంధాలు వాటి నావికాదళాలకుకూడా విస్తరించాయి.
దేశీయంగా చేపట్టిన ప్రాజెక్టు కింద, 75 స్కార్పియన్ తరగతి జలాంతర్గాములను మెస్సర్స్ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ కు చెందిన మెస్సర్స్ నావల్ గ్రూప్ తో కలిసి నిర్మిస్తున్నాయి. ఇది నౌకాదళ సామర్ధ్యాన్ని పెంచడమేకాక,భవిష్యత్తుకు కూడా మార్గం సుగమం చేసింది.

ఉభయ దేశాల నావికా  దళాల మధ్య నిర్వహిస్తున్న ద్వైపాక్షిక నావికా విన్యాసాలైన వరుణ, నావికాదళానికి చెందిన  అన్ని  రకాల సామర్ధ్యాల ప్రదర్శనకు వీలు కల్పించేది.
ఇది , భారతదేశం, ఫ్రాన్స్లమధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబింప చేసేందుకు ఉపకరిస్తుంది. ఈ విన్యాసాలను 1993లో ప్రారంభించారు. దీనిఇక 2001లో వరుణ అని  పేరు పెట్టారు.
వరుణ 21 వ ఎడిషన్ ను అరేబియా సముద్రంలో ఈ ఏడాది జనవరరి 23న నిర్వహించారు.

 

***


(Release ID: 1938083) Visitor Counter : 184


Read this release in: English , Urdu , Hindi , Tamil