బొగ్గు మంత్రిత్వ శాఖ
2023 సంవత్సరానికి "టైమ్‌లీ పేమెంట్స్ (సీపీఎస్‌ఈలు)" విభాగంలో జీఈఎం పురస్కారం అందుకున్న ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
प्रविष्टि तिथि:
07 JUL 2023 2:19PM by PIB Hyderabad
భారత బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ అయిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, 2023 సంవత్సరానికి, "టైమ్‌లీ పేమెంట్స్ (సీపీఎస్‌ఈలు)" విభాగంలో జీఈఎం పురస్కారం అందుకుంది. జీఈఎం దార్శనికతకు అనుగుణంగా ఈ-మార్కెట్ విధానాల విశ్వసనీయత మెరుగుపరచడంలో అందించిన అత్యుత్తమ సహకారానికి ఈ పురస్కారం దక్కింది. ఎన్‌ఎల్‌సీఐఎల్ 2017లో జీఈఎం పోర్టల్‌లో నమోదైంది. 2018-19లో రూ.2.21 కోట్ల చిన్న విలువతో ప్రారంభమైన ఎన్‌ఎల్‌సీఐఎల్ వృద్ధి, 2022-23లో రూ.984.93 కోట్లకు చేరి, అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. 'గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్' (జీఈఎం) ఒక ప్రత్యేకమైన ఈ-మార్కెట్ సేవల వేదిక. వివిధ వస్తువులు, సేవలను ప్రజలకు చేర్చడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ ప్రజా సేకరణల పోర్టల్ ఇది. దేశంలో పారదర్శకమైన, అందుబాటులో ఉండే, సమర్థవంతమైన ప్రజా సేకరణలు ఉండాలన్న జీఈఎం విధానాలకు అనుగుణంగా మార్కెటింగ్‌ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ పురస్కారాలు అందజేస్తోంది.

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ తరపున డైరెక్టర్ (ప్రణాళికలు & ప్రాజెక్టులు) శ్రీ కె.మోహన్ రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. సంస్థ సీఎండీ శ్రీ ప్రసన్న కుమార్ మొట్టుపల్లి ఎన్‌ఎల్‌సీఐఎల్ అధికారుల కృషిని అభినందించారు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
*******
(रिलीज़ आईडी: 1938074)
आगंतुक पटल : 173