బొగ్గు మంత్రిత్వ శాఖ

వాణిజ్య మరియు క్యాప్టివ్ మైన్స్ బొగ్గు ఉత్పత్తిని సమీక్షించిన మంత్రి ప్రహ్లాద్ జోషి


2023-24 ఆర్ధిక సంవత్సరంలో 162 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని నిర్దేశం

Posted On: 06 JUL 2023 6:07PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో వాణిజ్య మరియు క్యాప్టివ్ గనుల బొగ్గు ఉత్పత్తి పనితీరును సమీక్షించారు. క్యాప్టివ్ మరియు కమర్షియల్ బొగ్గు గనుల నుండి ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ట్వీట్‌లో తెలిపారు. గత ఆరేళ్లలో స్థిరంగా పెరుగుతూ  216% వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య మరియు క్యాప్టివ్ గనుల ద్వారా 39% బొగ్గు ఉత్పత్తిని పెంచే మార్గాలపై ఈరోజు సమావేశంలో శ్రీ జోషి చర్చించారు. భూగర్భ బొగ్గు గనుల నుండి ఉత్పత్తిని కూడా మంత్రి సమీక్షించారు. 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు భూగర్భ బొగ్గు గని మిషన్ ప్రణాళికపై ఉద్ఘాటించారు.

జూన్ 2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని సిఎం (ఎస్‌పి) చట్టం 2015/ఎంఎండిఆర్‌ చట్టం 1957 కింద ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు విడతల వాణిజ్య బొగ్గు గనుల వేలం పూర్తయింది మరియు మొత్తం సంవత్సరానికి 218.9 మిలియన్ టన్నుల (ఎంటిపిఏ) మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 86 బొగ్గు గనులు విజయవంతంగా వేలం వేయబడ్డాయి. మొత్తం 98 గనులను అందించే 7వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ కొనసాగుతోంది.

వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభానికి ముందు బొగ్గు గనుల నిర్వహణకు సగటు వ్యవధి ఐదు సంవత్సరాలు. అయితే వాణిజ్య వేలం తర్వాత బొగ్గు గనుల నిర్వహణ యొక్క సగటు వ్యవధి గణనీయంగా తగ్గింది మరియు ఉత్పత్తి సహకారంతో ఇప్పటికే ఫలితం కనిపించింది.మొదటి వాణిజ్య బొగ్గు గని దాని కేటాయింపు నుండి ఒక సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించింది.2021-22 ఆర్ధిక సంవత్సరంలో వాణిజ్య బొగ్గు గనుల నుండి బొగ్గు ఉత్పత్తి 1.15 మిలియన్ టన్నులు (ఎంటి) మరియు 2022-23 ఆర్ధికసంవత్సరంలో 7.12 ఎంటి నాలుగు వాణిజ్య బొగ్గు బ్లాకులతో అంటే సుల్యారి, గారెపాల్మా 4/1, గారెపాల్మా 4/7 మరియు గోటిటోరియమైన్‌లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదనంగా ఆరు వాణిజ్యపరంగా వేలం వేయబడిన బొగ్గు గనులు 12.2 మిలియన్ టన్నుల (ఎంటి) బొగ్గు ఉత్పత్తిని ఆశించే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

 

*******



(Release ID: 1937887) Visitor Counter : 163