ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023: న్యూ ఢిల్లీలోని అగ్రి-ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో కార్యదర్శి, డీ పీ ఐ టీ మరియు సెక్రటరీ, ఎం ఓ ఎఫ్ పీ ఐ సహ-అధ్యక్షతన సమావేశం


ప్రముఖ ప్రపంచ స్థాయి మరియు భారత్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల భాగస్వామ్యం తో ఈ సమావేశం జరిగింది.

పాల్గొనే కంపెనీలు భారతీయ మార్కెట్‌పై తమ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేశాయి మరియు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించాయి.

Posted On: 06 JUL 2023 4:20PM by PIB Hyderabad

రాబోయే వరల్డ్ ఫుడ్ ఇండియా-2023కి సంబంధించి, నిన్న న్యూఢిల్లీలో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ (DPIIT) కార్యదర్శి మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్ కంపెనీలతో పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశంకు సహ అధ్యక్షత వహించారు. రౌండ్‌టేబుల్‌లో ప్రముఖ ప్రపంచ స్థాయి మరియు దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల భాగస్వామ్యం తో జరిగింది. 3-5 నవంబర్, 2023 న న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించబడుతున్న డబ్ల్యు ఎఫ్ ఐ -2023 కోసం పాల్గొనే కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఎం ఓ ఎఫ్ పీ ఐతో వారి భాగస్వామ్య అవకాశాల గురించి ఇంటరాక్షన్ సందర్భంగా చర్చించారు.

 

డీ పీ ఐ టీ కార్యదర్శి తన ప్రత్యేక ప్రసంగంలో,  భారత జీ డీ పీ లో తయారీ రంగం యొక్క పెరుగుతున్న  ప్రాముఖ్యతపై ఉద్ఘాటించారు. తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు మొదలైన అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తికి మాత్రమే కాకుండా, వాటిని పెద్ద పరిమాణంలో ప్రాసెస్ చేయడానికి భారతదేశంలోని అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ మండలాలను వాటి అనుకూలతలను కూడా ఆయన ప్రస్తావించారు.

 

ఎం ఓ ఎఫ్ పీ ఐ సెక్రటరీ తన ముఖ్య ప్రసంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న వృద్ధి మరియు విస్తృత అవకాశాల గురించి ప్రస్తావించారు. ఇంతకుముందు 2017 జరిగిన ఎడిషన్‌తో పోలిస్తే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరింత పెద్ద స్థాయిలో ప్రణాళిక రచించిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ యొక్క 2వ ఎడిషన్‌ ను  మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా అన్ని కంపెనీలకు సెక్రటరీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందించారు.

 

రౌండ్ టేబుల్ సందర్భంగా, పాల్గొన్న కంపెనీలు భారత మార్కెట్‌పై తమ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేశాయి మరియు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం మరియు  ప్రధాన మంత్రి కిసాన్ సంపద వంటి ఫ్లాగ్‌షిప్ పథకాలు అనుకూల విధానాలతో సహా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించాయి.  వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో పాల్గొనేందుకు కంపెనీలు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి మరియు ఈవెంట్‌ను స్పాన్సర్ చేయడానికి మరియు ప్రత్యేకమైన స్టాళ్ళలో తమ ఉత్పత్తులు మరియు సాంకేతికతలను ప్రదర్శించడానికి తమ సుముఖతను ధృవీకరించాయి. ఈవెంట్‌లో భాగంగా రూపొందించిన సెషన్‌ల కోసం ఎం ఓ ఎఫ్ పీ ఐతో భాగస్వామ్యానికి చాలా కంపెనీలు ఆసక్తిని కనబరిచాయి.

 

ఎం ఓ ఎఫ్ పీ ఐ అదనపు కార్యదర్శి తన ముగింపు వ్యాఖ్యలలో, ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ సెల్ (ఇన్వెస్ట్ ఇండియా) మరియు ఈవెంట్ పార్టనర్ ఫిక్కీ  భాగస్వామ్య వివరాలను నిర్ధారించడానికి కంపెనీలతో సంప్రదిస్తాయని పేర్కొన్నారు. ఈ వై ఈవెంట్‌కు నాలెడ్జ్ పార్టనర్‌గా ఎంపిక చేయబడింది.

 

***


(Release ID: 1937865) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi , Tamil